రాకేశ్ శర్మగారికి జన్మదిన శుభాకాంక్షలు. |
అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ. 1984 ఏప్రిల్ 3 న సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందినసోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కల్సి బైకనూర్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినాడు. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు వ్యోమగాములలో ఇతను 138 వ వాడు.
1954 సం.లో పాటియాలాలో జన్మించిన రాకేశ్ శర్మ, భారత వైమానిక దళం లో చేరాడు. చకచకా ఉన్నతపదవులు పొంది స్క్వాడ్రన్ లీడర్మరియు "విమాన చోదకుడు" అయ్యాడు. 1984లో భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్ళి మొదటి భారతీయ రోదసీ వ్యోమగామి అయ్యాడు. భారతదేశానికి చెందిన "భారత అంతరిక్ష పరిశోధన సంస్థ" (ISRO) మరియు రష్యాకు చెందిన "సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్" (ఇంటర్ కాస్మోస్) సమన్వయ కార్యక్రమమైన ఈ యాత్ర సాల్యూట్-7 రోదసీ స్టేషను లో 8 రోజులపాటు కొనసాగింది. ఈ యాత్రలో 35 యేళ్ళ రాకేష్ శర్మతో పాటు రష్యాకు చెందిన ఇరువురు వ్యోమగాములూ ప్రయాణించారు. వీరియాత్ర "సోయుజ్ టి-11" లో ఏప్రిల్ 2 వతేదీ 1984 న ప్రారంభమయింది. ప్రయాణసమయంలో రాకేష్ శర్మ హిమాలయాలలో జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టులకై ఛాయాచిత్రాలను తీశాడు. ఈ ప్రయాణ సమయాన అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాకేష్ శర్మను భారతదేశం ఎలా కనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు రాకేష్ శర్మ సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా అని సమాధానం చెప్పి దేశభక్తిని చాటిచెప్పాడు.
రోదసీ నుండి తిరిగొచ్చాక రష్యా ఇతన్ని "హీరో ఆఫ్ సోవియట్ యూనియన్" అనే బిరుదు ఇచ్చి గౌరవించింది. భారతదేశం రాకేష్ శర్మనూ ఇరువురు రష్యన్ వ్యోమగాములనూ అశోక చక్ర అవార్డులతో సత్కరించింది.
రాకేష్ శర్మ మరియు వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా ఇరువురూ ఈ యాత్రకు పోటీపడ్డారు, అదృష్టం రాకేష్ శర్మను వరించింది. వీరిరువురూ "జీరో గ్రావిటీ" (భూమ్యాకర్షణా రహితం) శిక్షణపొందారు, ఈ శిక్షణలో వీరు యోగాభ్యాసం చేశారు. ప్రయాణంలోకూడా రాకేష్ శర్మ 'యోగాసనాలు' చేశాడు.
రాకేష్ శర్మ ప్రస్తుతం పదవీ విరమణ పొందాడు. నవంబరు 2006 ఇతను ప్రముఖ శాస్త్రజ్ఞుల సమావేశంలో పాల్గొన్నాడు. ISRO నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత మొదటి వ్యోమగామి యాత్రకు పచ్చజెండా ఊపబడింది. మన భారతదేశానికి మంచి పేరు సంపాదించిన రాకేశ్ శర్మగారికి 62వ జన్మదిన శుభాకాంక్షలు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.