Blogger Widgets

బుధవారం, జనవరి 31, 2018

రామచరిత మానస 8 సాధుపురుషులకు నమస్కరించెదను .

బుధవారం, జనవరి 31, 2018

                            దో -  బందఉఁ  సంత సమాన చిత , హిత అనహిత నహిC కోఇ |
                                     అంజలి  గత సుభ సుమన జిమి, సుమ సుగంధ కర దోఇ|| 3 (క ) || 
                                     సంత సరల చిత జగత హిత , జాని సుభాఉ   సనేహు      |
                                     బాలబినయ సుని కరి కృపా , రామచరన రతి దేహు         || 4 (ఖ) ||
దోసిట చేరిన పుష్పములు రెండుచేతులుకును (అంటే పుష్పములు కోసిన చేయికి మరియు పట్టుకున్న చేతికి )  సుగంధమును సమానముగా పంచును.     అట్లే సాధుపుంగవులు అందరిని సమభావముతోనే చూచుదురు .  వారికి శత్రువులుకానీ మిత్రులు కానీ ఉండరు .  అట్టి సాధుపురుషులకు నమస్కరించెదను . 
సాధువులు సరళ చిత్తులు , లోకోపకారులు , వారిసద్ భావమును స్నేహమును తెలుసుకుని , " ఓ సాధువులారా ! ఈ బాలుని ప్రార్ధనను మన్నించి శ్రీరామచంద్రునిపాదపద్మములపై ప్రీతికలుగునట్లు అనుగ్రహింపుడు" - అని తులసీదాసు వేడుకుంటున్నారు. 

మంగళవారం, జనవరి 30, 2018

రామచరిత మానస (7 ) సత్సాంగత్యమహిమ

మంగళవారం, జనవరి 30, 2018

దో - సుని సముఝహిC జన ముదిత మన ,  మజ్జహిC అతి అనురాగ |
లహహిC చారి ఫల అచ్ఛత తను , సాధు సమాజ ప్రయాగ ||  2  ||
ఈ సాధుసమాజరూపమైన ప్రయాగ మహిమను విని , అవగాహన చేసుకొని , అత్యంత భక్తి తో అందుమునకలు వేయువారికి ఈ జన్మలోనే ధర్మార్థ కామ మోక్ష ( చతుర్విధ పురుషార్ధములు ) ఫలములు సిద్దియించును .   (దో  || 2|| )
చౌ -  మజ్జన ఫల పేఖిఅ తతకాలా    |  కాక హోహిC  పిక బకఉ మరాలా   ||
         సుని  ఆచరజ కరై జని కోఈ      |  సతసంగతి మహిమా నహిC  గోఈ   || 1 ||
         బాలమీక  నారద ఘటాజోనీ      |  నిజ నిజ ముఖని  కహీ నిజ హోనీ ||
         జలచర థలచర నభచర నానా|  జే  జడ చేతన జీవ జహానా              || 2 ||
         మతి కీరతి గతి భూతి భలా ఈ   |  జబ జెహిC జతన జహోC జెహిC పాఈ ||
         సో జానబ సతసంగ  ప్రభాఊ     |  లోకహుC భేద న ఆన ఉపాఊ         || 3 ||   
         బిను సతసంగ బిబేక న హోఈ|  రామ కృపా బిసు సులభ న సోఈ    ||
         సతసంగత ముద మంగల మూలా | సొఇ ఫల సిద్ది సబ సాధన ఫూలా|| 4 ||
         సఠ సుధరహిC సతసంగతి పాఈ | పారస పరస కుధాత సుహాఈ        ||
         బిధి బస సుజన కుసంగత పరహీC | ఫని మని సమ నిజ గున అనుసరహీC  || 5 ||
         బిధి హరి హర కబి కోబిద బానీ    |   కహత సాధు మహిమా సకుచానీ     ||
         సో మో సన కహి జాత న కైసేC    |   సాక బనిక మని గున గన జైసేC      || 6 ||
సాధుసమాజరూపమైన ఈ ప్రయాగలో మునిగిన వెంటనే ఫలము లభించును.  కాకులు కోయిలలు అగును.    కొంగలు హంసలగును.  దీనికి ఆశ్చర్యపడనవసరం పనిలేదు .  సత్సాంగత్యమహిమ జగద్విదితము.  వాల్మీకి , నారద, అగస్త్యాదిమహర్షుల జీవితగాధలు  మనకు ప్రభల నిదర్శనము  .  భూచరములు , జలచరములు , ఖేచరములు మొదలగు చరాచరప్రాణులన్నీ సత్సంగ ప్రభావమువలననే ఐశ్వర్యములను , బుద్ది , కీర్తి , సద్గతులను పొందినవి .  ఈ ఐశ్వర్యాదులు పొందుటకు సత్సాంగత్యము తప్పా మరియేమార్గము లోకమున గానీ వేదములందుగానీ ప్రస్తావించలేదు .    సత్సాంగత్యము లేనిదే వివేకము అబ్బదు . శ్రీరాముని దయవల్లనే సత్సాంగత్యము లభించును.  ఆనంద ప్రాప్తికి శ్రేయోలాభములకును సత్సాంగత్యమే మూలము .  సాధనములన్నియు పుష్పములు .  సత్సాంగప్రాప్తియే ఫలములు .  ఇనుము పరుసవేదిని తాకినంతనే ఎలా బంగారంగా మారునో అదేవిధంగా దుష్టులుకూడా సత్సాంగత్యము వలన సత్పురుషులుగా మారుదురు .  విధివశమున సత్పురుషులకు దుష్టసాంగత్యము ప్రాప్తిపొందిన పాము పడగపై గల మణివలె వారు సద్గుణములతోనే విలసిల్లుదురు. సర్పవిషముచే మణి ఏ విధముగా స్వయంప్రకాశితమగును .  అలానే దుష్టసాంగత్యముచే సజ్జనులు ఏ మాత్రము ప్రభావితులు కాకుండా తమ సుగుణములతోనే శోభిల్లుచుందురు .  కవులుకానీ , విజ్ఞులుకానీ కడకు బ్రహ్మవిష్ణుమహీశ్వరులుకానీ సత్పురుషమహిమను వర్ణించలేరు.  ఇకనేను చెప్పుట కూరలమ్మువాడు మణులనాణ్యతను చెప్పినట్లు అగును . 
|| స్వస్తి || 

సోమవారం, జనవరి 29, 2018

రామచరిత మానసత్రివేణి సంగము

సోమవారం, జనవరి 29, 2018


దో - జథా సుఅంజన అంజి దృగ , సాధక సిద్ధ సుజాన  || 
కౌతుక దేఖత సైల బన , భూతల భూరి నిధాన ||  1 || 

సిధ్ధ జనులను కనులలో పెట్టుకున్న సిద్ధులు , సాధకులు శిఖరములపైనను వనముల మద్యయందును, భూగర్భముల యందునగల సమస్తనిధులను అనాయాసముగా  చూచినట్లు గురుపాదకమలాదూళిని కనులకద్దుకున్నవారు సిద్ధిని జ్ఞానమును అవలీలగా పొందుదురు.    ( దోహా -1)

చౌ - గురు  పద రజ  మృదు మంజుల అంజన   |   నయన అమిఅ  దృగ దోష బింభజన  ||
         తెహిCకరి   బిమల   బిబేక    బిలోచన          |   బరనఉC  రామ చరిత భవ మోచన    ||  1  ||
         బందఉC  ప్రథమ  మహీసుర చరనా           |   మోహ జనిత  సంసయ  సబ  హరనా  ||
         సుజన   సమాజ  సకల  గున   ఖాని              |   కరఉC   ప్రనామ  సప్రేమ  సుబానీ      ||  2  ||                                                                      సజ్జనుల మహిమ 
          సాధు  చరిత  సుభ  చరిత    కాపాసు           |    నిరస బిసద  గునమయ  ఫల జాసూ   || 
           జో  సహి  దుఖ  పరఛిద్ర   దురావా             |    బందనీయ  జెహిC  జగ  జస  పావా     ||  3 || 
           ముద  మంగలమయ సంత సమాజా         |    జో  జగ  జంగమ  తీరధరాజూ              || 
           రామ  భక్తి   జహఁ  సురసరి   ధారా              |    సరసఇ  బ్రహ్మ బిచార ప్రచారా           ||  4 || 
           బిధి  నిషేధమయ కలిమల హరినీ            |     కరమ కథా రబినందని  బరనీ             || 
           హరి   హర    కథా   బిరాజతి   బేని               |    సునత సకల ముద మంగల  దేనీ       ||  5 || 
            బటు  బిస్వాస అచల నిజ ధరమా             |   తీరథరాజ   సమాజ  సుకరమా             || 
            సబాహి సులభ సబ దిన సబ దేసా             |   సేవాత  సాదర  సమన  కలేసా            ||  6 ||
            అకథ     అలౌకిక      తీరథరాఊ                  |    దేఇ   సద్య  ఫల   ప్రగట  ప్రభాఉ       || 7  || 

గురుదేవునిపాదపద్మరజము  కోమలమైనది. మనోజ్ఞమైనది. అది నేత్ర దోషములను రూపుమాపు నయనామృతసిద్దాంజనము.  ఈ అంజనముచే నామనోనేత్రములను నిర్మలమొనర్చుకొని, సంసారబంధములనుండి విముక్తి ప్రసాదించు శ్రీరామచరిత  వర్ణించెను .  అజ్ఞానజనితములైన సందేహాలను పారద్రోలు భూసురోత్తములకు ముందుగా వందనములాచరించుదును.  అనంతరము సద్గుణసంపన్నులగు సాధువులకును, సత్పురుషులకును వినయముతో ప్రణమిల్లేదను.   ప్రత్తి ఎండినదై, స్వచ్ఛమై గుణమయమై ఉండును.  అట్లే సాధువుల చరిత్ర అనాసక్తమై పాపరహితమై సద్గుణ సంపన్నమై అలరారును .  వడకుట, నేయుట మొదలగు సందర్భములలో ప్రత్తితాను కష్టములను సహించి , ఇతరుల ఛిద్రములను కప్పివేయును.  గొప్పకీర్తిని సంపాదించును.  అట్లే సాధువులు ఎన్ని కష్టములనయినా ఓర్చుకొనుచు ఇతరులను ఉద్దరించును.  అట్టి సాధువుల సమాజము ఆనందమయము , కల్యాణప్రదము.  అది ఒక కదులుతున్న ప్రయాగ ( త్రివేణి సంగము ) . అచట రామ భక్తి అను గంగా ప్రవాహము.  బ్రహ్మ విచారమే సరస్వతి నది. నిధినిషేధ రూపములైన కధలు కలియుగ పాపములు ప్రక్షాళన చేయు యమునాతరంగములు .  ఈ మూడునదులు ఇచట కలియును. శివకేశవుల కధలు త్రివేణీసంగమములై శ్రోతలకు ఆనందమును, శుభములను అందించును .  ఈ సాధుసమాజ రూపమున ప్రయాగ క్షేత్రమున స్వధర్మమము నందు విశ్వాసము అక్షయవటం.  సత్కార్యములే తీర్థరాజా పరివారము .   తీర్థరాజమైన ఈ ప్రయాగ వివిధదేశములలో సర్వకాలములు అందు సాధుజనరూపమున అందరికి లభ్యమగును.  వారిని సాదరంగా సేవిచుటచే అవిద్యావంటిక్లేశములు అన్నీ పటాపంచలగును.    ఈతీర్థరాజము అలౌకికము , వర్ణనాతీతము , సాధ్యఫలదాయకము.  దీని ప్రభావము ప్రత్యక్షము.  

ఆదివారం, జనవరి 28, 2018

రామచరిత మానస 5 గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తున్నాను...

ఆదివారం, జనవరి 28, 2018


గురు ప్రస్తుతి
బందఉC  గురు పద కంజ , కృపా సింధు నరరూప హరి | 
మహామోహ  తమ పుంజ , జాసు బచన రబి కార నికర || 5 || 

నేను నా గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తున్నాను.  ఆయన కృపాసముద్రుడు ,  మనుష్యరూపమును దాల్చిన శ్రీహరి .  సూర్యకిరణములు అంధకారమునువలె .  విజ్ఞాననిధి ఐన ఆయన వచనములు అజ్ఞానమును పటాపంచలు  గావించును .  || 5 || 

చౌ - బందఉC  గురు పద పదుమ పరాగా  |  సురుచి  సుబాస సరస అనురాగా || 
        అమిఅ మూరిమయ  చూరన  చారూ |  సమన సకల భావరుజ పరివారు    || 1 || 
        సుకృతి  సంభు తన బిమల బిభూతీ |  మంజుల మంగల మోద ప్రసూతీ  ||  
        జన మన మంజుల ముకుర మల హరినీ | కిఏC తిలక గున గన బస కరనీ || 2 || 
        శ్రీగుర పద నఖ మని గన జోతీ  | సుమిరత  దిబ్య  దృష్ఠి  హియC  హోతీ  || 
        దలన మోహ తమ సో సప్రకాసూ |  బడే భాగ ఉర ఆవఇ  జాసూ || 3 || 
        ఉఘరహిC  బిమల బిలోచన  హీ కే  |  మిటహిC  దోష దుఖ భవ రజనీ కే  || 
         సూఝహిC  రామ చరిత మని మానిక  |  గుపుత ప్రగట జహఁ జో జెహి ఖానిక || 4 || 

నా గురుదేవునిపవిత్రపాదపద్మదూళి సుందరమైనది, సురుచిరమమైనది , సువాససనలువెదజల్లునది. అనురాగ మధురిమలను వెదజల్లునది.  అది జన్మమృత్యురూప సాంసారిక బాధలను నశింపజేయు దివ్యౌషధము.  అమృత రూపావనస్పతి యొక్క దివ్య చూర్ణము .  అట్టి గురుపాదపద్మములకు నా వందనము.  ఈ దూళి శంకరుని శరీరముపైన వున్న విభూతివలె  నిర్మలమైనది,  శుభకరమైనది ,  ఆనంద ప్రదమైనది .  ఇది భక్తుని మనోదర్పణం పై గల మాలిన్యమును తొలగించును.  తిలకముగా ధరించినచో పెక్కు సుగుణములను సమకూర్చును.  శ్రీగురుదేవుని నఖద్యుతులు మణులవలె ప్రకాశించుచు స్మరణమాత్రమునే అవి అజ్ఞాన అంధకారమును రూపుబాపి ఆత్మానందమును గూర్చును.  గురుదేవుల పాదపద్మములను హృదయములో నిలుపుకున్నవాడు భాగ్యాశాలి. గురుదేవుల కృపచే వాని మనోనేత్రములు విచ్చుకొనును, పాపములను,  సాంసారికబాధలను దూరమగును.  శ్రీరామకధలు అనెడి మణిమాణిక్యములు ఏగని యందు గుప్తములుగా వున్నాను, ప్రకటితములైనను  ఆ హృదయమున ప్రకాశమానములగును .  ( చౌపాయీ || 1-4) 
|| స్వస్తి || 

శనివారం, జనవరి 27, 2018

రామచరిత మానస || 4 ||

శనివారం, జనవరి 27, 2018

రామచరిత మానస పారాయణ లోని ఈరోజు నాల్గవ రోజు రెండు శ్లోకాలు తెలుసుకుందాము.

శ్లోకం :
నీల సరోరుహ  స్యామ, తరున అరన బారిజ నయన | 
కరఉ సో మమ ఉర ధామ, సదా ఛీరసాగర సయన || 3|| 

నల్లగల్వలవలె నీలమైన శరీర కాంతి  కలవాడు, విచ్చిన ఎర్రని మందారమువంటి విశాలనేత్రములు కలవాడు,  క్షీరసాగర శయనుడైన  శ్రీమన్నారాయణుడు సర్వదా నా హృదయమున నివశించు గాక.  

శ్లోకం :
కుంద ఇందు సమ దేహ, ఉమా రమన కరునా అయన | 
జాహి దీన పర నేహ, కారఉ  కృపా  మర్దన మయిన  || 4 ||

పార్వతి పతి అయిన పరమేశ్వరుడు  మల్లె పువ్వువలె ,  చంద్రునివలె తెల్లని దేహ కాంతి కలవాడు, కరుణామూర్తి , దీనజనరక్షకుడు , మన్మథమర్దుడు అయిన ఆ పరమేశ్వరుడు నన్ను బ్రోచు గాక.     

శుక్రవారం, జనవరి 26, 2018

రామచరిత మానస _ ప్రార్ధన:

శుక్రవారం, జనవరి 26, 2018


ప్రార్ధన:
సో-జో సుమిరత సిధి హోఇ,   గన నాయక కరిబర బదన |
కరఉ అనుగ్రహ సోఇ ,   బుద్ది రాసి సుభ గుస సదన                 || 1  ||

పరమశివునిప్రథమగణములకు అధిపతియగు గజాననుడు తననుస్మరించువారికి కార్యసిద్దిని కలిగించును. అతను విజ్ఞానఖని (భక్తులకు బుద్ది ప్రదాత ), సుగుణాల రాశి , అట్టి శ్రీ వినాయకుడు నన్ను అనుగ్రహించు గాక .   (సోరఠ|| 1)

మూక హోఇ  బాచాల, పంగు చఢఇ గిరిబర గహన | 
జాసు కృపఁ  సొ దయాల,  ద్రవఉ సకల కలిమల దహన || 2|| 

దయాళువైన భగవంతుని అనుగ్రహముచే మూగవాడు వక్త అగును.  కుంటివాడు దుర్గమములైన పర్వతములైనను ఎక్కగలడు,  కలి కల్మషములను రూపుమాపు ఆ భగవంతుడు నాపై కృపచూపు గాక.  || 2 ||     
స్వస్తి 

గురువారం, జనవరి 25, 2018

రామచరిత మానస ||2||

గురువారం, జనవరి 25, 2018

ఈరోజు  తులసీదాసు రచించిన రామచరిత మానస నుండి శ్లోకాలు 
sreerama feet కోసం చిత్ర ఫలితం
శ్లోకం :  
యన్మాయావశవర్తి విశ్వమఖిలం బ్రహ్మాదిదేవాసురా
             యత్సత్త్వాదమృషైవ భాతి సకలం రజ్జౌ యథాహేర్భ్రమః |
 యత్పాదప్లవమేకమేవ హి భవాంభోధేస్తితీర్షావతాం
             వందే2హం తమశేషకారణపరం రామాఖ్యమీశం హరిమ్  ||

శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు  యొక్క అవతారము .  ఆయన మాయకు ఈ సమస్త విశ్వము, బ్రహ్మాది దేవతలు, అసురగణాములు వసవర్తులు.  ఆయిన అస్తిత్వ ప్రభావముచే మిథ్యా జగత్తు అంతయును రజ్జు సర్పబ్రాంతిచే సత్యముగా తోచును .  ఆయన పాదములే భవసాగరమును దాటగోరువారికి నౌకలు .  అతడు అశేషకారకములకు అతీతుడు. శ్రేష్టుడు .  అనగా మూలకారణమైనవాడు. అట్టి శ్రీరామచంద్ర ప్రభువునకు ప్రణామములు. 

శ్లోకం :  
నానాపురాణనిగమాగమసమ్మతం యద్ 
రామాయణే నిగదితం క్వచిదన్యతో2పి | 
    స్వాంతఃసుఖాయ తులసీ రఘునాథగాథా
భాషానిభంధమతిమంజులమాతనోతి || 

రఘుకులతిలకుడైన శ్రీరామచంద్రునిగాథ వేదపురాణశాస్త్రసమ్మతము.  ఆకథనే శ్రీమద్రామాయణము మహాకావ్యముగా వాల్మీకిమహర్షి మనోజ్ఞముగా వర్ణించెను.  ఇతరకవులు ఆ కథను వివిద రీతుల రచించిరి.  అట్లే ఈ తులసీదాసు తన ఆత్మానందము కొరకు ఈ రామాయణ గాథనే సరళమైన మధురమైన భాషలో వ్రాయుచున్నాడు.

|| స్వస్తి || _/\_

బుధవారం, జనవరి 24, 2018

రామచరిత మానస

బుధవారం, జనవరి 24, 2018

ఈరోజు రధసప్తమి చాలా మంచి రోజు కదా ! అందుకే ఈరోజు నుండి కొంచెం కొంచెంగా రామచరిత మానస చదువుకుందాం అనిపించింది , నాతో పాటుగా మీకు కూడా అందిస్తున్నాను. ముందుగా మనం రామచరితమానస చదివేముందు. మనకు రామచరిత మానస ను మనకు అందించిన కవివరేణ్యులు గురించి తెలుసుకుందాం వారికి ముందుగా నమస్కారములు తెలుపుకుందాం.
గోస్వామి తులసీదాసు ఉత్తరప్రదేశ్‌ బాండా జిల్లా రాజ్‌ పూర్‌లో ఆత్మారాం దుబే మరియు హుల్సీ దేవి దంపతులకు జన్మించాడు. రామాయణాన్ని సంస్కృతంలో విరచించిన వాల్మీకి యొక్క అవతారమే తులసీదాసు అని అంటారు. భక్తి, కావ్య రచన, తాదాత్మ్యత, భాష వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు తులసీదాసు తన జీవితాన్ని రామభక్తికి అంకితం చేశాడు. గోస్వామి తులసీదాసు అవధ ప్రాంత కవి, తత్వవేత్త. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీప ప్రాంతాలను అప్పట్లో అవధ దేశంగా పిలిచేవారు. తులసీదాసు జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు.
రామచరిత మానస్:
వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీరామచరితమానస్‌గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని దశరథనందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంథం పూర్తికావటానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు.ఆయన తదనంతరం వారణాసిలో "తులసీ ఘాట్" ఏర్పడింది. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హుమాన్‌ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్‌ చాలీసా వంటివి ఉన్నాయి.
అవసాన సమయంలో ఆఖరికి వారణాశిలో స్థిరపడ్డాడు. అక్కడే క్రీ.శ.1623లో తన తనువు చాలించాడు. అభినవ వాల్మీకి, భక్తశిరోమణి అయిన తులసీదాస కవులకు నమస్కారములు.
ఈరోజు నుండి రామచరితమానస .................._/\_
సత్యం శివమ్ సుందరం శ్రీ గణేశాయనమః శ్రీ జానకీవల్లబో విజయతే శ్రీరామచరిత మానసము
ప్రధమ సోపానం
బాలకాండము
మంగళాచరణం
శ్లోకం: వర్ణానామర్ధసంఘానాం రసానాం ఛాందసామపి
మంగళానాం చ కర్తారౌ వందే వాణీవినాయకౌ||
భవానీశంకరౌ వందే శ్రద్దావిశ్వాసరూపిణౌ
యాభ్యామ్ వినా న పశ్యంతి సిద్ధాః స్వాంతఃస్థమీశ్వరమ్||

వందే బోధమయం నిత్యం గురుం శంకరరూపిణమ్
యమాశ్రితో హి వక్రో2పి చంద్రాః సర్వత్ర వంద్యతే||
సీతారామగుణగ్రామపుణ్యారణ్య విహారిణౌ
వందే విసుద్ధవిజ్ఞానౌ కవీశ్వరాకపీశ్వరౌ ||

ఉద్భవస్థితిసంహారకారిణీం క్లేశహారిణీం
సర్వశ్రేయస్కరీం సీతాం నతో౭హం రామవల్లబామ్ ||

|| స్వస్తి || _/\_

మంగళవారం, జనవరి 23, 2018

ఆరోగ్యదాత....... అభయప్రదాత......లోక బాంధవుడుకి నమస్కారములు. _/\_

మంగళవారం, జనవరి 23, 2018

సప్తాశ్వ రథ మారూడం
ప్రచండం కశ్యపాత్మజం 
శ్వేత పద్మ ధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం 

ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటినీ నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడి జన్మదినమును ధసప్తమిగా జరుపుకుంటాం.  ప్రత్యక్ష భగవానుడు  సమయపాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత... అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో- చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. ఆయనే సూర్యుడు. అదితికశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి.  రధసప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను (ఏడు  గుర్రముల పేర్లు వరుసగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్ణుప్, పంక్తి )  వంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.  
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు. ఎముకలకు  బలముగా వుంటాయి.  కేన్సర్ రాకుండా కాపాడతాయి.  ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
శుద్ధ సప్తమికి ’రథసప్తమి’ అని పేరు. ఈరోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షానిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది.
సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు.ఆవుపాల పాయసం నివేదించడం, అది కూడా ఆరుబయట సూర్యకిరణాలు పడే తావున ఆవుపేడ పిడకలను మండించి, దానిపై పాయసాన్ని పొంగించడం ఒక చక్కని ప్రక్రియ. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.
’రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక మలుపు. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు.
రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశం పొంది , ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు.
శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.
ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి.  ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి.  
సూర్య రశ్మిలో విటమిన్ D ఉంటుంది అది ఎముకల పటుత్వానికి అవసరం అని చెబుతారు. అంతే కాకుండా విటమిన్ D కణ విభజనలో కూడా తోడ్పడుతోంది. దీన వలన గాయాలు మానడమే కాకుండా కాన్సర్ రాకుండా కూడా ఉపయోగం ఉంటుంది. సూర కాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన వారిలో చాలా రకాల కాన్సర్ తక్కువగా వస్తుంది అని డాక్టర్స్ చెబుతారు. ముఖ్యంగా పెద్ద పేగు, మల ద్వారానికి సంబంధించిన కాన్సర్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. 
రధసప్తమి రోజున మనం ఉదయంనే లేచి ఆచరించవలసిన విధి 
 "జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్గ్యమిస్తే చాలు మనకు ఆయుః ఆరోగ్యాలతోపాటు అష్టైశ్వర్యాలు అందిస్తాడు. 
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.

శుక్రవారం, జనవరి 12, 2018

సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును.

శుక్రవారం, జనవరి 12, 2018

ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం బాగా చేసుకున్నాము కదా ఈ రోజు ఆకరి పాసురము.  ఈ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.
గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చే
యుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.


పాశురము: 
 
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్
అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్
శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్
ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.

తాత్పర్యము:
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొంది  మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది.
ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును. అని ఫలశ్రుతి పాడిరి.

ఏడేడు జన్మలకు నీతో విడరాని బంధుత్వము కలవారముగ కావలెను.




మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు. ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పుత్ర్తి చేస్తున్నారు. ముప్పైవ పాసురములో ఫలశ్రుతి.
మొదటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.
అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము ఆవిష్కరించి  తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.

పాశురము :
శిత్తం శిఱుకాలే వందున్నై చ్చేవిత్తు, ఉన్
పొత్తామరైయడియే పోత్తుం పొరుళ్ కేళాయ్;
పెత్త మ్మేయ్ త్తుణ్ణు ఙ్కులత్తిల్ పిఱంద నీ
కుత్తేవ లెఙ్గ్ ళై క్కొళ్ళామల్ పోకాదు;
ఇత్తైప్పఱై కొళ్వా నన్ఱుకాణ్; గోవిందా ;
ఎత్తైక్కు మేళేళు పిఱ్ విక్కుం, ఉందన్నో
డుత్తోమే యావో మునక్కే నామాళ్ శెయ్ వోం,
మత్తై నఙ్కా మఙ్గళ్ మాత్తే లో రెంబావాయ్

తాత్పర్యము:
బాగా తెల్లవారకముందే నీవున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.

గురువారం, జనవరి 11, 2018

లోక మర్యాదనేరుగని పిల్లలము. కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక ఉండకుము.

గురువారం, జనవరి 11, 2018




గోపికలు శ్రీ కృష్ణునితో అన్నారు మేము మార్గ శీర్ష స్నానము చేయవలెనని వచ్చాము . మాకు మా వ్రతమునకు కావలసిన పరికరములు అడిగారు. ఆ వ్రతము చేసిన తర్వాత తామూ పొందవలసిన ఆభరణములను, వస్త్రములను, భోగములను ప్రార్దిమ్చినారు .
శ్రీ కృష్ణునకు వారు హృదయము తెలియును. ఇదంతయు లుకిక వ్రత గాధ కాదు. వీరు కోరునవి లుకిక వ్రతోపకరనములు కావు. ఆముష్మిక ఫలమునండుతకే వీరు కోరుచున్నారు. కాని వీరి నోటివేమ్తనే దానిని చెప్పిమ్చవలెను అని తలంచి ఇట్లు అడిగినారు.
ఓ గోపికలారా ! మీరు కోరినవన్నియు చాలా చక్కగా వున్నాయి. మీరు " పరిశీలించి కృపచేయమని" అనిఅన్నారు.
కదా పరిశీలించినా మీ అభిప్రాయమేమో నాకు తోచటంలేదు. వ్రతము చేసి మహత్తరమైన అలంకరనములను భోగములను అందవలెనన్నా దానికొక అదికారము ఉండాలి కదా? ఫలమునాశించిన మీరు ఆ ఫలాప్రాప్తికి ఏదోఒక యత్నము కుడా చేసి యుండాలి కదా? మా కది కావాలని అన్నంత మాత్రమున నేను ఇచ్చుటకు వీలుకాదు. దానికి తగిన యోగ్యతా మీకున్న ఇవ్వగలను. కావున మీకున్న అధికారము అనగా మీ యోగ్యతా ఎట్టిదో వివరించుము. ఫలమును అందగోరు వారు దానికి సాధనమునుగూడ సంపాదిమ్పవలేనుగాడా? మీరు అట్టి సాధనమును దేనినైనా ఆర్జించినారా ?
ఇట్లు అడుగగానే గోపికలు తమ హృదయము విప్పి చెప్పుచున్నారు .
గోపికలు కామ్క్షిమ్చునది పరమ పుశార్ధముఅగు నారంట భగవత్ పురక భవత్కైమ్కర్యము. దానికి వరేమియు యోగ్య తను సంపాదించుకొని రాలేదు . పరమాత్మే ఉపాయముగా నమ్మిన వారు, వాటి కంటే వేరే ఉపాయము తాము పొందుటకు ప్రతిభందకములని తెలుసుకున్నవారు. కర్మలు చేసి, జ్ఞానము సంపాదించి, భక్తి తో ఉపాసించి పరమాత్మను పొందాలని తలంపు వీరికి లేదు. వాడె వానిని పొందించ వలెనని నమ్మినవారు. అందుచే ఇట్లు భగవానుడే యుపాయమని నమ్మకము కలవారు. భగవానుని ముందు ఏమి విజ్ఞాపనము చేయవలెనో ఆమాటలను గోపికలు ఈ పాసురమున వివరిచుచున్నారు .
పాశురము : 
కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం కానమ్ శేర్-నుంద్-ణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నో
డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్

తాత్పర్యము:
పశువుల వెంట వానిని మేపుటకై అడవికిపోయి. అచటనే శుచినియమములు లేక తిని,  జీవించి యుండి ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియు జ్ఞానములేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మిచిన పుణ్యమే మాకున్న పుణ్యము . మాకెన్ని లోపాలున్నా తీర్చగాల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ ! నీతో మాకుగల సంబంధము పోగొట్టుకోన వీలుకాదు . లోక మర్యాదనేరుగని పిల్లలము. అందుచే ప్రేమవలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక ఉండకుము. మాకు ఆపేక్షితమగు పరను పరను ఇవ్వుము.

బుధవారం, జనవరి 10, 2018

నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజించవలె

బుధవారం, జనవరి 10, 2018

గోపికలు తామూ చరించబోవు మార్గ శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవిమ్చినారు. అందు వారడిగిన ద్రవ్యములు సులభాములేయైననాను వారు కోరిన వారు కోరిన గునముఅలు గల ద్రవ్యము దుర్లభాములు. అందుచే శ్రీ కృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను గోరుట కాదు , నన్నే కోరి వీరీ వస్తువులను కోరినారు. అనుకొనెను.పాచజన్యమును పోలిన శంఖములను కోరారు. మరి అల్లాంటి శంఖము దొరకదు. ఆ శంఖము శ్రీ కృష్ణుని వీడదు. అందుచే శ్రీ కృష్ణుడే శంఖధరుడై తమతో నుండవలెనని వారు కోరారు.
చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు . శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు. శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర. ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను. మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి. మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము.
తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను . జెండా గరుత్మంతుడు . వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను.
తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను. మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు, పడగ, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలగడ, చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు. వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే , శేషునే వారికి చాందినిగా ఇచ్చెను .
ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా . గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరణముచే తామూ పోందకోరిన ఫలమును వివరించుచున్నారు.  ఈ పాసురము విశేషమైనది నేటి నివేదన చక్కెరపోంగళి ఆరగింపుగాఇస్తారు.  గోపికలు ఈ పాసురము రోజు 108  గిన్నెలు చెక్కరపొంగలి నెయ్యి ఎక్కువ వేసి మోచేతి నుండి కారునట్లు వేసిచేస్తారు.  ఎందుకుఅంటే 26  రోజులు వీరు నెయ్యి వాడలేదు కదా.  అందువల్ల ఈ పాసురము రోజు మంచిగా చెక్కెర పొంగలి నివేదిస్తారు.
పాశురము:
కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు మురంగైవరివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్ 


తాత్పర్యము:
తనతో కూడని శత్రువులను జయించేది  కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘనసన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు , బాహువులకు డందకడియములు , చెవి క్రిందు భాగమున దరించే దిద్దు, పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు, కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి. తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి. దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజించవలె . గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు. 

మంగళవారం, జనవరి 09, 2018

నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుము

మంగళవారం, జనవరి 09, 2018




శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందము తో వారిని చుచుతూ ఉండిపోయాడు. వారి పాసురము పాసురము మండలమును, నేత్ర ములను , వక్షస్థలమును , నడుమును చూచుచు ఇతర స్పృహ లేనంతగా వ్యామోహముతో పరవశమై ఉన్నాడు . వారి మాటలు విని మరి కొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్న అడిగెను " గోపికలారా ! నన్నే కోరి వచ్చాము అని చెప్పారు . మరలా నీకిష్టమైనచో పర అను వాద్యమును ఇమ్మని అంటున్నారు. నన్నే కలియవలేనని కోరిక ఉన్నవారు వేరోక దానిని కాంక్షించారు కదా?  మీరు పర అడుగుటలో ఉద్దేశ్యము ఏమి? మీ కోరిక విషయములో నాకు సందేహముకలుగుతున్నది. అని శ్రీ కృష్ణుడు వారిని ప్రశ్నించెను.  వారు దానికి భగవద్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతము చెయ్యమన్నారు. మేము పెద్దల యెడ ఉపకారబుద్ధితో ఈ వ్రతము ఆచరించ బూనినాము. అని గోపికలు చెప్పారు.
అంత శ్రీ కృష్ణ పరమాత్మ సరే కానిండు. అయితే ఆవ్రతము ఏమి ? దానికి ప్రమాణము ఏమి ? దానికి కావలిసిన పదార్ధాలు ఏమి ? అవి ఎన్ని కావాలి? వివరాలు తెలపండి. అని అడిగెను. అంత గోపికలు ఈ వ్రతమునకు కావలసిన పరికరములు  అర్ధించుచున్నారు. ఈ పాశురములో  
 పాశురము:
మాలే మణివణ్ణా -గరి నీరాడువాన్
మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్
ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే
శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే
కోలవిళక్కే కొడియే వితానమే
ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:

ఆశ్రిత వ్యామోహముకలవాడా! ఇంద్ర నీలము అను మణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్ధ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు అర్ధించి నీ వద్దకు వచ్చితిమి . ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు విన్నవించేదము. ఈ భూమండలమంతను వణుకుచున్నట్లు శబ్ధము చేయు , పాలవలె తెల్లనైన , నీ పాంచజన్యమనబడే శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద "పర " అను వాద్యము కావాలి మంగళ గానము చేయు భాగవతులు కావాలి. మంగళ దీపములు కావాలి. ధ్వజములు కావాలి. మేలుకట్లు కావాలి. పై పరికరములు ను క్రుపచేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.  సర్వ శ క్తిమంతుడవై మాకోరకు శ్రీ కృష్ణుడు వై సులభుడవైన నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుమని గోపికలు ఈ ప్రాసురమున ప్రార్ధించినారు

సోమవారం, జనవరి 08, 2018

ఆశ్రిత వ్యామోహము కలవాడా! నిన్నే కోరి వచ్చినాము.

సోమవారం, జనవరి 08, 2018

గోపికలు ఈ విధముగా మంగళము పాడుతుఉంటే శ్రీ కృష్ణ పరమాత్మ వారి ప్రేమకు , వాగ్వైభవనమునకు చాలా సంతోష్మ్చి " ఓ గోపికలారా! మీకు జన్మసిద్దాముగా మా యందుగల ప్రీతిచే మంగళము నాకాక్షించుచున్నారు . చాలా సంతోషమే , కానీ ఈ రాత్రివేళ మంచులో నడచి శ్రమ పడి వచ్చారు . చాలా శ్రమ అయ్యింది. కేవలము మంగళ శాసనము కాంక్షతోనే యున్నట్లు చెప్పుతున్నారు . కానీ దానికంటే వేరొక ప్రయోజనము లేదా? ఉన్నచో చెప్పండి. తప్పక నేరవేర్చుతాను. అనెను . నీగుణ కీర్తనము చేయుచూ వచ్చుటచే మంచు , రాత్రి , మొదలగున్నవి మాకు ఇబ్బందిని కలిగించవు. మాకు ప్రధాన ప్రయోజనము నీకు మంగళము పాడుతయే. లోకులకై వ్రతమోనర్చుటకుపర నొసంగిన ఒసగుము. మేము మీ స్వరూపమును మా స్వరూపమును తెలిసిన వారమే. కావునామంగళా శాసనమే ప్రధాన ప్రయోజనము అని తెలియచేయుచు శ్రీ కృష్ణ అవతార రహస్యమును తామెరుగుదుము అని దానిని ఈ పాశురములో వివరించినా మన గోపికలు.
గోపికలు ఈ పాశురములో శ్రీ కృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దానివలన శ్రమ తీరి ఆనందించుచున్నారు. అని చెప్పుచున్నారు.

పాశురము:

ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరిరవిల్

ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళర
తరిక్కిలానాకి త్తాన్ తీంగు నినైంద
కరుత్తై పిరపిత్తు కంజన్ వైత్తిల్
నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై
అరుత్తిత్తు వందోం పఱై తరుతియాగిల్
తిరుత్తక్క శెల్వముమ్ శేవకముమ్ యాంపాడి
వరుత్తముమ్ తీరుంద్ ముగిరుంద్-ఏలోర్ ఎంబావాయ్ 

తాత్పర్యము:

భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి , శంఖచక్రగధాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవి కుమారుడవై జన్మించి , శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి, కట్టను కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభావముగల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్ట భావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యతముచేసి వానికడుపులోచ్చిచ్చువై నిన్ను చంపవలెనని తలచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా! నిన్నే కోరి వచ్చినాము . పర అను వాద్యము నిచ్చిన ఇమ్ము . సాక్షాత్తు లక్ష్మీ దేవే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును , నీ వీర చరిత్రమును , కీర్తించి శ్రమను విడిచి పెట్టి సంతోషించు.
భగవానుని పాడుటకు సాధనానుస్టానము చేయుచున్నప్పుడు చాలా శ్రమలు కలుగును. ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందముగా ఉండాలి. దానికి నామసంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందులో వివరించారు.

ఆదివారం, జనవరి 07, 2018

నీవీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము పొందగమేమీనాడు వచ్చాము

ఆదివారం, జనవరి 07, 2018

ప్రస్తుతము గోపికలు మంచి దశకు చేరి ప్రేమ దశలోనున్నవారగుటచే తమకు కలిగిన అమంగళములను అతనిని దర్శించినంతనే  పోగొట్టుకోవాలని , తమకులేని మంగళములను సంపాదించుట మాని ప్రేమైక హృదయులై  శ్రీకృష్ణునకు మంగళము పాడుచున్నారు.  ఇట్లే గోపికలు శ్రీ కృష్ణపరమాత్మ వలన తమ కార్యము నెరవేరునని , తమ ప్రభువు నడచి వచ్చి ఆసనము పై కుర్చొనగానే ఆపాదాములు ఎర్రదనమును  చూచి తామూ చేసిన యపచారమునకు భాధపడి మంగళము పాడిరి.  ఈ పాశురము చాలా విశేషమైనది.  మన స్వామివారికి హారతి అంటే  చాలా ఇష్టం కదా అందుకే  ఈ పాసురములో స్వామికి వారికి హారతి ఎక్కువగా ఇస్తారు.  విశేషమైన నివేదనగా దద్యోజనం ఆరగింపుగా ఇవ్వాలి.

పాశురము:
అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి
శెన్ఱంగు త్తెన్-ఇలంగై శెత్తాయ్ తిఱల్ పోత్తి
పొన్ఱచ్చకడం ఉదైత్తాయ్ పుగర్ పోత్తి
కన్ఱుకుణిలా వెఱిందాయ్ కరిల్ పోత్తి
కున్ఱుకుడైయా వెడుత్తాయ్ కుణమ్ పోత్తి
వెన్ఱు పకై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్ఱెన్ఱుమ్ శేవకమే యేత్తి ప్పఱైకొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగ్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
ఆనాడు బలి చక్రవర్తి తనదికాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడించగా ఈ లోకమునంతను వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదములకు మంగళము .రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావనుడుండు లంకకే వెళ్లి సుందరమగు భవనములు కోటయుగల దక్షిణ  దిశనున్న లంకలో ఉన్నా రాక్షసులను చెండాడిన మీ భాహు పరాక్రమములకు మంగళము . శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేసించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము . వత్సము పై ఆవేసించిన అసురునితో వెలగ చుట్టుపై నాఎసించిన యసురుని చంపుటకై ఓడిసేలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరనపుడు ముందువేనుకకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము.  ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినని కోపముతో రాళ్ళ వాన కురియగా గోపాలురకు గోవులకు భాధ కలుగకుండా గోవర్ధన పర్వతమును గోడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము.  శ త్రువులను సములముగా పెకళించి  విజయము నార్జించి ఇచ్చేది మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము.
ఈ విధముగా నీవీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము పొందగమేమీనాడు వచ్చాము అనుగ్రహించుము.
అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.

శనివారం, జనవరి 06, 2018

సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చు

శనివారం, జనవరి 06, 2018

అననన్య గతికలమై వచ్చి నన్నాస్రయించినారము , కటాక్షిం చుము అని గోపికలు ప్రార్ధించగా శ్రీ కృష్ణునకు మనస్సులో చాలా భాద కలగినది. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్నాశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్లి సాయపడి రక్షించవలసి ఉండగా వేరొక గతిలేని వారమైనాము అని దైన్యముగా పల్కు నట్లు ప్రేరేపించితినే ! ఎంత తప్పు చేసితిని అని శ్రీ కృష్ణుడు చాలా నోచ్చుకోనేను.
ఇలా పడుకున్న శ్రీ కృష్ణుని లేచి నడచి వచ్చి ఆ స్థానమున సింహాసనమున వేంచేసి తమ కోరివిని క్రుపచేయవలేనని గోపికలు ప్రార్ధించుచున్నారు.
పాశురము 



మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం
శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి
మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు
పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్
కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరుందు యాం వంద
కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము:
పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని , తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి, , అన్ని వైపులా దొర్లి , దులుపుకొని , వెనుకకు ముందుకు శరీరమును చాపి , గర్జించి , గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్పసవర్ణ !
నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము.
అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.

శుక్రవారం, జనవరి 05, 2018

ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.

శుక్రవారం, జనవరి 05, 2018

గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .
పాశురము 


అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విడియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.
సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది.  నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షితించితివా !  మేము అనుభావించేతీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)