జీవరసాయన శాస్త్ర పరిశోధనలకు మొదటగా బంగారు బాట వేసినది డా.హరగోవింద ఖురానా. ఈయన పంజాబ్ లోని కుగ్రామం రాయ్‌పూర్‌లో 1922 జనవరి 2 న లో జన్మించారు. ఈ గ్రామము ప్రస్తుత పాకిస్థాన్‌లో ఉన్నది. ఆ గ్రామంలో పేదరికంలో పుట్టి పెరిగిన ఆయనకు 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. Massachusetts Institute of Technology (MIT) జీవ, రసాయనిక శాస్త్ర విభాగాల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
ప్రొటీన్ల సంశ్లేషణలో ఆర్‌ఎన్‌ఏ సంకేతాల తీరుపై చేసిన పరిశోధనలు ఆయనకు నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి. మరో ఇద్దరితో కలసి ఆయన ఈ బహుమతిని పంచుకున్నారు. డీఎన్‌ఏ రసాయనిక ధర్మాలపై జరిపిన పరిశోధనలు ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. విస్కాన్సిన్ వర్సిటీలో 1960-70ల కాలంలో ఆయన సాగించిన పరిశోధనలు పలు భావి ఆవిష్కరణలకు దోహదపడ్డాయి. విస్కాన్సిన్‌లో దాదాపు దశాబ్దకాలం బోధన, పరిశోధనలు కొనసాగించిన తర్వాత ఆయన MITలో చేరారు. యువ శాస్త్రవేత్తలకు తర్ఫీదు ఇచ్చేందుకు తన ఎక్కువగా ఇష్టపడేవారు. రిటైరైన తర్వాత కూడా పలువురు యువ శాస్త్రవేత్తలు ఆయన వద్దకు వచ్చేవారని అన్నారు.
"Gobind was a brilliant, path-breaking scientist, a wise and considerate colleague, and a dear friend to many of us at MIT, said Chris Kaiser, MacVicar professor of biology and head of the department of biology, in an e-mail announcing the news to the department 's faculty.
పేదరికంలోనూ తమను చదివించేందుకు తన తండ్రి తన జీవితాన్నే అంకితం చేశారని ఖురానా తన ఆత్మకథలో రాసుకున్నారు. అతని విజయంలోఒకసోదరిమరియుముగ్గురు సోదరులు బాగా support గా నిలిచారని. తన తండ్రిబ్రిటిష్ ఇండియన్ప్రభుత్వ నకు ఒక పట్వారి (ఒక వ్యవసాయపన్నుclerk) గా పనిచేసేవారనీ .దాదాపు వంద కుటుంబాలు గల తమ స్వగ్రామంలో అక్షరాస్యత సాధించిన తొలి కుటుంబం తమదేనని ఆయన చెప్పుకున్నారు. ముల్తాన్ వద్ద హైస్కూలు విద్య పూర్తి చేసుకున్న ఖురానా, పంజాబ్ వర్సిటీ నుంచి 1943లో కెమిస్ట్రీలో డిగ్రీ, 1945లో బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్‌లో ఉండగానే, బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో చదువుకునేందుకు ఆయనకు స్కాలర్‌షిప్ లభించింది. అక్కడే ఆయన 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. స్విట్జర్లాండ్‌లోని ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్‌డాక్టరల్ పరిశోధనలు సాగించారు. తను ఈ స్తాయికి చేరటానికి జీవితంలో చాలా కష్టపడ్డారని తన biographyలో రాసుకున్నారు.
కేంబ్రిడ్జిలో మరో పోస్ట్‌డాక్టరల్ పరిశోధన చేశారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీలో ఉద్యోగం లభించడంతో 1952లో వాంకోవర్ నగరానికి చేరుకున్నారు. అక్కడ ఎనిమిదేళ్లు ఉద్యోగం చేశాక, 1960లో అమెరికాలోని విస్కాన్సిన్ వర్సిటీలో చేరారు. అక్కడే ఆయన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంజైమ్ రీసెర్చ్ కోడెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, కీలకమైన పరిశోధనలు సాగించారు. ఈయన నవంబర్ 9 , 2011 న పరమపదించినారు.
ఇండియన్ స్టూడెంట్స్ ఆయనని చూడటానికి వెళ్ళినప్పుడు
డా.హరగోవింద ఖురానా
జననము -1922 జనవరి 2 న
మరణము - నవంబర్ 9, 2011 న
మాతృదేశము -భారతదేశము
జాతీయత - భారతీయుడు
రంగము -జీవ, రసాయన శాస్త్రము
ముఖ్య విభాగము -Massachusetts Institute of Technology
గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు. కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు. తరువాత బలరాముని మేలుకోల్పారు . అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు . తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో .
శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజులు ప్రతీ సంవత్సరం 5 శాస్త్ర, సాంకేతిక రంగాలలో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ ద్వారా బహుమతించబడతాయి.
జీవ శాస్త్రాలు
భూమి, వాతావరణ, అఘాత మరియు ఖగోళ శాస్త్రాలు
భౌతిక శాస్త్రాలు
వైద్య శాస్త్రాలు
రసాయన శాస్త్రాలు
సాంకేతిక శాస్త్రాలు
గణిత శాస్త్రాలు
శాంతి స్వరూప్ భట్నాగర్ (ఫిబ్రవరి 21, 1894 – జనవరి 1, 1955) ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. బ్రిటీష్ ఇండియాలోని షాపూర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది)లో జన్మించాడు.ఈయనికి చిన్నప్పటి నుంచి బొమ్మలు, యంత్ర పరికరాలు చేయటంలో ఆసక్తి కనబరిచేవారు. వీరి పరిశోధనలు ఎక్కువగా పారిశ్రామిక రసాయనాలపై జరిగింది. ఆయన శాస్త్రీయ పరిశోధనకు 1941లో బ్రిటన్ ప్రభుత్వం సర్ బిరుదును ప్రదానం చేసింది.భారత స్వాతంత్యం తరువాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ సంస్థకు తొలి డైరెక్టర్ జనరల్ పదవి అలంకరించాడు. మన దేశంలో మొత్తం 12 పరిశోధన శాలలను ఈయన స్థాపించాడు. ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది. అంత గొప్ప శాస్త్రీయవేత్త గురించి తెలుసుకొని ఆయనికి నివాళు అర్పిస్తున్నాను.
జననం -ఫిబ్రవరి 21 1894, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం -జనవరి 1 1955, న్యూఢిల్లీ, భారతదేశం
నివాసం -భారతదేశం
జాతీయత -భారతీయుడు
రంగము -రసాయన శాస్త్రం
సంస్థ -శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా కౌన్సిల్
మాతృ సంస్థ -పంజాబ్ విశ్వవిద్యాలయం యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్