శాంతి స్వరూప్ భట్నాగర్ |
శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజులు ప్రతీ సంవత్సరం 5 శాస్త్ర, సాంకేతిక రంగాలలో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ ద్వారా బహుమతించబడతాయి.
జీవ శాస్త్రాలు
భూమి, వాతావరణ, అఘాత మరియు ఖగోళ శాస్త్రాలు
భౌతిక శాస్త్రాలు
వైద్య శాస్త్రాలు
రసాయన శాస్త్రాలు
సాంకేతిక శాస్త్రాలు
గణిత శాస్త్రాలు
శాంతి స్వరూప్ భట్నాగర్ (ఫిబ్రవరి 21, 1894 – జనవరి 1, 1955) ప్రసిద్ధిగాంచిన భారతీయ శాస్త్రవేత్త. భట్నాగర్ ను భారత పరిశోధన శాలల పితామహుడిగా అభివర్ణిస్తారు. బ్రిటీష్ ఇండియాలోని షాపూర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది)లో జన్మించాడు.ఈయనికి చిన్నప్పటి నుంచి బొమ్మలు, యంత్ర పరికరాలు చేయటంలో ఆసక్తి కనబరిచేవారు. వీరి పరిశోధనలు ఎక్కువగా పారిశ్రామిక రసాయనాలపై జరిగింది. ఆయన శాస్త్రీయ పరిశోధనకు 1941లో బ్రిటన్ ప్రభుత్వం సర్ బిరుదును ప్రదానం చేసింది.భారత స్వాతంత్యం తరువాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ సంస్థకు తొలి డైరెక్టర్ జనరల్ పదవి అలంకరించాడు. మన దేశంలో మొత్తం 12 పరిశోధన శాలలను ఈయన స్థాపించాడు. ఈతని జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం స్థాపించింది. అంత గొప్ప శాస్త్రీయవేత్త గురించి తెలుసుకొని ఆయనికి నివాళు అర్పిస్తున్నాను.
జననం -ఫిబ్రవరి 21 1894, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణం -జనవరి 1 1955, న్యూఢిల్లీ, భారతదేశం
నివాసం -భారతదేశం
జాతీయత -భారతీయుడు
రంగము -రసాయన శాస్త్రం
సంస్థ -శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా కౌన్సిల్
మాతృ సంస్థ -పంజాబ్ విశ్వవిద్యాలయం యూనివర్శిటి కాలేజ్ ఆఫ్ లండన్
ప్రాముఖ్యత -భారతీయ ఖగోళ కార్యక్రమం
ముఖ్య పురస్కారాలు -పద్మవిభూషణ్ OBE , Knighthood
జై హింద్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.