బుధవారం, ఫిబ్రవరి 07, 2018
దో - భాగ చోట అభిలాషు బడ , కరఉC ఏక బిస్వాస |
పై హహిC సుఖ సుని సుజల సబ , ఖల కరిహహిC ఉపహాస ||
నాశక్తి అల్పము , కానీ లక్ష్యము అనల్పం దుర్జనులు పరిహాసించును , సుజనులు నా రచనకు ఆనందింతురని నా పరమ విశ్వాసము .
చౌ - ఖల పరిహాస హోఇ హిత మోరా | కాక కహహిC కలకంఠ కఠోరా ||
హంసహి బక దాదుర చాతకహీ | హCసహిC మలిన ఖల బిమల బతకహీ || 1 ||
కబిత రసిక న రామ పద నేహూ| తిన్హ కహC సుఖద హాస రస ఏహూ ||
భాషా భనితి బోరి మతి మోరీ | హCసిబే జోగ హCసేC నహిC ఖోరీ || 2 ||
ప్రభు పద ప్రీతి న సాముఝి నీకీ | తిన్హహి కథా సుని లాగిహి ఫీకీ ||
హరి హర పద రతి మతి న కుతరకీ | తిన్హ కహుC మధుర కథా రఘుబర కీ || 3 ||
రామ భగతి భూషిత జియCజానీ | సునిహహిC సుజన సరాహి సుభానీ ||
కబి న హోఉC నహిC బచన ప్రబీనూ | సకల కలా సబ బిద్యా హీనూ || 4 ||
ఆఖర ఆరథ ఆలంకృతి నానా | ఛంద ప్రబంధ అనేక బిధానా ||
భావ భేద రస భేద అపారా | కబిత దోష గున బిబిధ ప్రకారా || 5 ||
కబిత బిబేక ఏక నహిC మోరేC | సత్య కహఉC లిఖి కాగద కోరేC || 6 ||
దుర్జనుల పరిహాసముగూడ నాకు హితమే . కోకిలపాట కాకులకు కఠోరముగానే ఉండును. కొంగలు హంసలను . కప్పలు చాతకపక్షులను పరిహసించుచుండును. నీచులు సచ్చరితలు విని నవ్వుదురు . కవిత్వమునందును శ్రీరామచంద్రుని పాదపద్మములయందును భక్తిలేని కవితారసికులకు ఈ కవిత హాస్యరస ప్రధానమై సుఖమునిచ్చును. నా రచన లౌకికభాషలో సాగినది . పైగా నాబుద్ధి అల్పమైనది . కావున నవ్వదగినది. అందువల్లవారు నవ్వుటలో వారిదోషము ఏమిలేదు. శ్రీహరి చరణకమలములయందు భక్తిలేనివారికిని , అవగాహనరహితులకును ఈ కథ పేలవంగా కనిపించవచ్చు. హరిహర భక్తులకును , కుతర్కబుద్దులుకానివారికిని శ్రీ రఘునాధునిచరితము మధురముగా ఉండును , హాయిని గొల్పును , సజ్జనులు ఈ గాధను శ్రీరామభక్తివైభవభూషితమైనదిగా గ్రహించి, మనోహరముగా ప్రశంసించుదురు. నేను కవిని కాను . వాక్చతురుడునూ కాను , వాక్యరచనాకళయందును , నాకు ప్రావీణ్యములేదు . శబ్దార్ధ ప్రయోగములు వివిధములు . అలంకారములు , ఛందస్సులు అనేకము . భావరుసభేదములు అపరిమితములు . కవితాగుణములు , దోషములు వివిధములు ఈ కవితావిశేషములలో ఏ ఒక్కదానిని గూర్చియు నేనెరుగనేఎరుగను . ఈ సత్యమును ప్రమాణపూర్వకముగా తెల్పుచున్నాను .
మంగళవారం, ఫిబ్రవరి 06, 2018
చౌ - ఆకర చారి లాఖ చౌరాసీ | జాతి జీవ జల థల నభ బాసీ ||
సీయ రామమయ సబ జగ జానీ | కరఉC ప్రనామ జోరి జుగ పానీ || 1 ||
జాని కృపాకర కింకర మోహో | సబ మిలి కరహు ఛాడి ఛల ఛోహో ||
నిజ బుధి బల భరోస మోహి నాహిC | తాతేC బినయ కరఉC సబ పాహీC || 2 ||
కరన చహఉC రఘుపతి గున గాహా | లఘు మతి మోరి చరిత అవగాహా ||
సూఝ న ఏకC అంగ ఉపాఊ | మన మతి రంక మోనోరధ రాఊ || 3 ||
మతి అతి నీచ ఊCచి రుచి ఆఛీ | చహిఅ అమిఅ జగ జురఇ న ఛాఛీ ||
ఛమిహహిC సజ్జన మోరి ఢిఠాఈ | సునిహహిC బాలబచన మన లాఈ || 4 ||
జౌC బాలక కహ తోతరి బాతా | సునహిC ముదిత మన పితు అరు మాతా ||
హCసిహహిC కూర కుటిల కుబిచారీ | జే పర దూషన భూషనధారి || 5 ||
నిజ కబిత్త కేహి లాగ న నీకా | సరస హోఉ అథవా అతి ఫికా ||
జే పర భనితి సునిత హరషాహీC | తే బర పురుష బహుత జగ నాహీC || 6 ||
జగ బహు నర సర సరి సమ భాఈ | జే నిజ బాఢి బడహిC జల పాఈ ||
సజ్జన సకృత సింధు సమ కోఈ | దేఖి పూర బిధు బాఢఇ జోఈ || 7 ||
భూమ్యాకాశములందును జలములయందును జీవించు చతుర్విధములైన ( జరాయుజ , అండజ , స్వేదజ , ఉద్బీజములు ) 1. మానవులు , జంతువులు 2. పక్షులు 3. క్రిమి , కీటకాదులు 4. మొక్కలు . ఎనుబదినాలుగు లక్షల జీవరాసులు సీతారాములని భావించి , వాటికి అంజలి ఘటించుదును . ఓ దయానిధులారా ! నన్ను మీ సేవకునిగా భావించి , నిష్కపటచిత్తములతో నాపై కృపచూపించండి . నా బుద్ధిబలముపై నాకు విశ్వాసములేదు. కనుక మీకువిన్నవించుకొనుచున్నాను. రఘుకులతిలకుఁడైన శ్రీరామునిగుణములను వర్ణింపగోరుతున్నాను . నా బుద్ది చాలా అల్పమైనది . శ్రీరాముని చరిత అగాధమైనది. నేను ఏ కావ్యఅంగము ఎరుగను . నా మనోరధము మాత్రము రాజువలె ఉన్నతమైనది కానీ నా మనస్సు , బుద్ధి నిరుపేదలవలె అల్పములైనవి. నా కోరిక ఘనమైనది , కానీ నా బుద్ధి మాత్రము అల్పమైనది. నేను అమృతము కోరుచున్నాను . కానీ మజ్జిగ కూడా సంపాదించ శక్తిలేనివాడను . సజ్జనులు నా అతిసాహసమును మన్నించి, ఈ బాలుని వచనములను ఆదరముతో ఆలకించుదురు గాక . తల్లిదండ్రులు తమ పిల్లల చిలుకపలుకలును చూసి ఆనందించుడు.
కఠినాత్ములు , కుటిలురు , దురాలోచనపరులు ఇతరుల దోషములే ఎంచుటఏ ఒక ఘనకార్యముగా భావించి , వారిని పరిహాసించుదురు . మనోహరముగా నున్నా లేక పేలవంగా నున్నను ఎవరికవిత్వం వారికి మధురముగానే ఉండును . కానీ ఇతరులారచనలను విని మెచ్చుకొను సజ్జనులు మాత్రం చాలా అరుదుగామాత్రమే ఉందురు . కుంభవృష్టి పడినప్పుడు వరదలు పొంగిపొరలు నదులు. తటాకములవలె తమ ఉన్నతికి పొంగిపోవు జనులు లోకమున కోకొల్లలు . కానీ పూర్ణ చంద్రుని చూచి గంతులువేయు సముద్రునివలె ఇతరులఔన్నత్యమును చూచి, సంతసించు సహృదయులు చాలా తక్కువగా ఉందురు .
సోమవారం, ఫిబ్రవరి 05, 2018
దో - గ్రహ భేషజ జల పవన పట , పాఇ కుజోగ సుజోగ |
హోహిC కుబస్తు సుబస్తు జగ , లఖహిC సులచ్ఛన లోగ || 7 క ||
సమ ప్రకాస తమ పాఖ దుహుC , నామ భేద బిధి కీన్హ |
ససి సోషక పోషక సముఝీ, జగ జస అపజస దీన్హ || 7 ఖ ||
జడ చేతన జగ జీవ జత , సకల రామమయ జాని |
బందఉC సబకే పద కమల , సదా జోరి జుగ పాని || 7 గ ||
దేవ దనుజ నర నాగ ఖగ , ప్రేత పితర గంధర్బ |
బందఉC కిన్నెర రజనిచర, కృపా కరహు అబ సర్బ || 7 ఘ ||
గ్రహములు, ఔషధులు, జలములు , వాయువు, వస్త్రములు ఇవి అన్నియును వాటి వాటి సహచర్యములను బట్టి మంచి , లేక చెడుగా భావింపబడుచుండును. విజ్ఞులైన వారు ఈ లోకసత్యములను ఎఱుంగ గలరు. శుక్ల , కృష్ణపక్షములయందు వెన్నెల , చీకటి సమంగానే వుండును. కానీ విధాత వాటికి వేరువేరు పేర్లును పెట్టెను . లోకము చంద్రునికళలవృద్ధికి తోట్పడు శుక్లపక్షమును ప్రకాశించును . క్షీణదశకు ఆకరమగు కృష్ణపక్షమును ఏవగించుకొనును . విశ్వమునందలి చేతనాచేతన పదార్ధములన్నియును శ్రీరామమయములు . కావున నేను వాటిచరణకమలములకు చేతులుజోడించి మ్రొక్కెదను . దేవతలు, దైత్యులు, మానవులు, నాగులు, పక్షులు, ప్రేతలు, పితరులు, గంధర్వ, కిన్నెర, రాక్షసులు మొదలుగు సమస్త ప్రాణకోటికి ప్రణమిల్లుదును . తదనుగ్రహము నాకు లభించుగాక.
ఆదివారం, ఫిబ్రవరి 04, 2018
దో - జడ చేతన గున దోషమయ , బిస్వ కీన్హ కరతార |
సంత హంస గున గుహహిC పయ , పరిహరి బారి బికార || 6 ||
భగవంతుడు చేతనాచేతనరూపమైన విశ్వాసమునందు మంచిచెడులను సృష్టించెను. హంస పాలను గ్రహించి నీటిని వదలినట్లే సాధువులు గుణములను గ్రహించి , దోషములను దూరముగా పరిహరించెదరు.
చౌ - అస బిబేక జబ దేఇ బిదాతా | తబ తజి దోష గునహిC మను రాతా ||
కాల సుబాఉ కరమ బరిఆఈC | భలెఉ ప్రకృతి బస చుకఇ భలాఈC || 1 ||
సో సుధారి హరిజన జిమి లేహిC | దలి దుఖ దోష బిమల జసు దేహీC||
ఖలఉ కరహిC భల పాఇ సుసంగూ | మిటఇ న మలిన సుభాఉ అభంగూ || 2 ||
లఖి సుభేష జగ బంచక జేఊ | బేష ప్రతాప పూజిఅహిC తేఊ ||
ఉఘరహిC అంత న హోఇ నిబాహూ | కాలనేమి జిమి రావన రాహూ || 3 ||
కిఎహుC కుబేషు సాధు సనమానూ | జిమి జగ జామవంత హనుమానూ ||
హాని కుసంగ సుసంగతి లాహూ | లోకహుC బేద బిదిత సబ కాహూ || 4 ||
గగన చఢఇ రజ పవన ప్రసంగా | కీచహిC మిలఇ నీచ జల సంగా ||
సాధు అసాధు సదన సుక సారీC| సుమిరహిC రామ దేహిC గని గారీC|| 5 ||
ధుమ కుసంగతి కారిఖ హోఈ | లిఖిఅ పురాన మంజు మసి సోఈ ||
సోఇ జల అనల అనిల సంఘాతా | హోఇ జలద జగ జీవన దాతా || 6 ||
భగవదనుగ్రహమున విచక్షణాశక్తిని కల్గివున్నవారు చెడును విసర్జించి, మంచిని మాత్రమే గ్రహించుదురు. ఒక్కొక్కప్పుడు మంచివారుసైతము మాయామోహితులై కాలము , స్వభావము , కర్మల ప్రభావముచే సన్మార్గము నుండి వైదొలుగుదురు. భగవద్బాక్తులు ఈ పొరపాటును తెలుసుకుని , వాటిని సవరించుకొందురు. దుఃఖదోషములును అధిగమించి నిర్మలమైనయాశమును పొందుదురు . అలాగే దుష్టులుగూడ ఒక్కొక్కసారి సత్సాంగత్యప్రభావమున సత్కర్మలను ఆచరింతురు . కానీ వారి దుష్టస్వభావములు మాత్రము మారవు . కపట వేషధారులైన ధూర్తులు మొదట గౌరవింపబడినను కాలక్రమమున వారివారి నిజస్వరూపము బట్టబయలగును . కాలనేమి , రావణుడు , రాహువు మొదలుగు వారివృత్తాంతములు ఇందుకు ప్రబల నిదర్శనము . సజ్జనుల , రూపములు, వేషములు ఎట్లనన్న వారు హనుమద్జాంబవతాదులువాలె అందరిచే గౌరవింపబడుదురు . దుష్టసహవాసము ప్రమాదకరం . సజ్జనమైత్రి వరప్రసాదం . ఇది లోకవిదితము , వేదప్రామాణికము . వాయు సాంగత్యమున పైకెగురు ధూళి ఉన్నతస్థితికి చేరును. అదియే పతనోన్ముఖంగా సాగిపోవు నీటితో కూడినప్పుడు బురదై అధోగతిపాలగును . సజ్జనులఇండ్లలో పెరిగిన చిలుకలు , గోర్వంకలు , రామనామము జపించును . దుర్జనుల ఇండ్లలోని చిలుకలు దుర్భాషలాడును . పొగ మాలినములతో కల్సినచొ నల్లబారును . కానీ సిరాగా మారినచో పవిత్ర పురాణములును వ్రాయవచ్చును . ఆ పోగయే- నీరు , అగ్ని , గాలితో కలిసి , మేఘముగా , మారినపుడు , వర్షజలముల ద్వార జీవులకు ప్రాణదాత యగును.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ