అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడినది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు. ఈ రోజున జరుపుకొనాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యిచ్చినది. 1760 లో ప్రచుచింబడిన ప్రముఖ రచన lettres sur la danse యొక్క రచయిత మరియు ఆధునిక ప్రెంచ్ నృత్యనాటికల సృష్టి కర్త అయిన Jean Georges Noverre(1727-1810) యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆదినాన్ని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు.
ప్రతి సంవత్సరం, ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడు ప్రపంచవ్యాప్తంగా చెలామణి అయ్యేవారు ఒక సందేశాన్ని అందించటానికి ఆహ్వానించబడతారు. ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యొక్క ప్రవేశ పత్రం ఆధారంగా ఈ ప్రసిద్ధ నృత్యదర్శకుడు లేదా నర్తకుని ఎంపిక చేయడం జరుతుంది.
UNESCO నిర్వహించిన అంతర్జాతీయ నృత్య దినోత్సవం లో యిప్పటివరకు పాల్గొన్న మరియు సందేశాన్ని అందించిన ప్రముఖులలో మెర్సీ కన్నింగ్‌హం, మారిస్ బెజర్త్ , అక్రం ఖాన్ మరియు అన్నె తెరెసా దె కీర్ స్మేకర్ లు.
ఈ దినం యొక్క లక్ష్యం నృత్య కళారూపం యొక్క ప్రపంచీకరణను చేధించడానికి,అన్ని రాజకీయ, సాంస్కృతిక మరియు జాతి అడ్డంకులు అధిగమించడానికి మరియు సాధారణ భాషలో గల నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయుట. ప్రపంచ నృత్య కూటమి, మరియు దాని నృత్య కమిటీ ఈ దినాన్ని పారిస్ లోని UNESCO లోనూ మరియు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. అసలు నృత్యం అన్నది సంగీతానికి అనుగుణంగా శరీరం కదలికలు మీద ఆదారపడి వుంటుంది. మానసిక ఉల్లాసానికి చాలా ఉపకరిస్తుంది. ఇది సరే ప్రపంచ ప్రసిద్దమైన నృత్యాలు కొన్ని వున్నాయి. వాటిలో
ఈ రోజు హిందువులకు మరియు జైనులకు ప్రత్యకమైన రోజు, అదే అక్షయ తృతీయ . వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా పిలుస్తారు. సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది , తరిగి పోనిది అని అర్థం. హిందూ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే సంపద అక్షయమవుతుందని భారతీయుల నమ్మకము. ఈ రోజు నాడే రైతులు విత్తనాలుకు పూజ చేసి నాటుతారు. ఎందుకంటే విత్తులు మంచిగా వ్యవసాయం వృద్ది చెందుతుంది. ఇంకా "అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు.భగీరధుడు తపస్సు ఫలితంగా గంగానది భూమి తరలి వచ్చిన రోజు. యజ్ఞ యాగాదులు చేయటానికి మంచి కాలం. శ్రీ కృష్ణులవారి బాల్య స్నేహితుడు కటిక దరిద్రుడైన సుదాముడు కృష్ణుని దగ్గరకు వెళ్లి అటుకులు సమర్పించి అత్యంత దనవంతుడైనాడు. ధర్మరాజు సూర్యనారాయణ మూర్తి నుండి అక్షయ పాత్రను పొందినాడు. వ్యాసుడు మహాభారతాన్ని చెప్తున్నప్పుడు విఘ్ననాయకుడు అయిన గణపతి భారతాన్ని రాయటం మొదలు పెట్టినరోజు. శంకరాచార్యులు వారు కనకదరా స్తోత్రాన్ని పాడితే కనకం వర్షంలాగ పడిన రోజు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు నిండు సభలో ద్రౌపది కి వస్త్రాపహరణ చేసి అవమానించదలిచారు , అప్పుడు ఆమెకి శ్రీ కృష్ణులు వస్త్రాలు ఇచ్చి ద్రౌపదిని కాపాడిన రోజు. అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. కుబేరుడు, దేవతల కోశాధికారి, ధనానికి దేవత అనీ. లక్ష్మీ దేవి మరియు కుబేరుడు అక్షయ్ తృతీయ నాడు పూజిస్తే, సంపద కలగ చేస్తుంది. అంతే కాదు ఈరోజు నాడే అన్నపూర్ణాదేవి జన్మించినది. ఈరోజు కి ఇన్ని విశేషాలు వున్నాయి కాబట్టే అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.
పద్మం వంటి తన పదాన్ని,పద్మంవంటి చేతితో, పద్మంవంటి నోటిలో చోప్పిస్తూ మర్రి ఆకుదొన్నెలో శయనించియున్న బాలముకుందునికి మనసా నమస్కరిస్తున్నాను.
మర్రి ఆకు మీద శయినించిన భగవానుడు శ్రీ కృష్ణులు. పద్మము వంటి పదాన్ని పద్మం వంటి చేతితో నోటిలో పెట్టుకొని మధువును చప్పరిస్తూ కనిపిస్తారు. ఈ వృత్తాంతం మనకు మార్కండేయ మహర్షి చరిత్ర లో కనిపిస్తుంది. మార్కండేయుడు 6 మన్వంతరములు మహా విష్ణువుకోరకు ఘోరమైన తపస్సు చేస్తాడు. మార్కండేయుని తపస్సు తన ఉనికికే సమస్యగా మారుతుందనుకొని మహేంద్రుడు అప్సరసలును పంపి తపస్సు భగ్నం చెయ్యటానికి ప్రయత్నించాడు. కానీ ప్రయత్నాలన్నీ వృదాయ్యాయి. మార్కండేయుడు ఈ మాత్రం చలించకుండా తపస్సు చేస్తూనే వున్నాడు. మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యి మార్కండేయ నీ తపస్సుకు కారణం ఏమిటి. నీకు ఏమి వరం కావాలి అని ప్రశ్నించాడు మహా విష్ణువు. అప్పుడు మార్కండేయుడు దేవా నీ మాయని చూడాలని వుంది అన్నాడు. కొన్నాళ్ళకు మహా ప్రళయం వచ్చింది. ప్రచండమైన గాలి, వర్షం. నదులు, సముద్రాలు పొంగి పొర్లుతున్నాయి. భూమితో పాటు సమస్తం నీటిలో మునిగిపోయాయి. మార్కండేయుడు విష్ణుమాయవల్ల నీటిలో తేలియాడుతూ తిరుగుతుండగా ఒకప్రదేశంలో మర్రి ఆకుమీద శయనించి వున్న చిన్న శిశువు నోటిలో కాలివేలు పెట్టుకొని చీకుతూ కనిపించాడు. అతనే వటపత్ర శాయి.
మహా విష్ణువు ఆదేశంతో మర్రి ఆకు పై వున్నా వటపత్ర శాయి కడుపులోకి వెళ్లి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమి, ప్రాణి కోటి కానిపిస్తుంది. మహావిష్ణువు మరలా ఇంకొకచోట సమస్త ప్రాణులను సృస్తిస్తాడని మార్కండేయుడు తెలుసుకుంటాడు. ఈ విధంగా మహా విష్ణువు మాయను తెలుసుకున్నాడు మార్కండేయుడు.
మొట్టమొదటి వితంతు వివాహం జరిపించిన వ్యక్తి, మొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించిన వారు , తెలుగులో మొదటి స్వీయ చరిత్ర ఆయనదే, తెలుగులో తొలి నవల రాసింది ఆయనే, తెలుగులో తొలి ప్రహసనం రాసింది అతనే , ఆయనకున్న ఇతర విశిష్టతలు పద్య కావ్యాలు, నాటకాలు, నవలలు, ప్రహసనాలు, కధలు, వ్యాసాలు,చరిత్రలు ఇంకా ఎన్నో రచనలు రాసారు . చాలా పత్రికలు కూడా నడిపారు. అతనెవరో తెలుసా కందుకూరి వీరేశలింగం పంతులు గారు . కందుకూరివారు ఎంతోమందికి ఆదర్సవంతముగా నిలిచారు అనటంలో సందేహం లేదంటే నమ్మండి . గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు ఆయన. సాహితీ వ్యాసంగంలోనూ అంతటి కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.
వీరేశలింగం పంతులు 1848ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోనికందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. వీరేశలింగంకు నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయారు. పెదతండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగారు. ఐదో యేట బడిలో చేరి, బాలరామాయణం,ఆంధ్ర నామ సంగ్రహం,అమరం,రుక్మిణీ కళ్యాణం,సుమతీ శతకం,కృష్ణ శతకంమొదలైనవి నేర్చుకున్నారు. పన్నెండో యేట రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరారు. చిన్నప్పటినుండీ, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవారు. తన పదమూడో యేట బాపమ్మ అనే ఎనిమిదేళ్ళ అమ్మాయితో బాల్యవివాహమయింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకే కృషి చేసారు.
ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.
ఆంధ్ర దేశంలో బ్రహ్మ సమాజం స్థాపించారు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలయింది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసారు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పని చేసారు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి ఆయన.యుగకర్త గా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణాల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం 1919 మే 27న మరణించారు.
చార్లీ చాప్లెన్ తెలియని వారువుండరు. ఆయన1889 ఏప్ర్లెల్ 16 వతేదిన ఇంగ్లాండ్ లో జన్మించారు.మనందరికీ తెలిసి చార్లీ చాప్లెన్ అంటె ఆయన హాస్య నటుడు.చాప్లెన్ డ్రస్ స్టయిల్ బిగుతుగా వున్న కోటు, లూజ్ ఫేంట్, పెద్దషూ , చేతికి ఒక వంకీ కర్రా, వంకర టింకరి నడక,మరి దానికి బ్రష్ లాంటి మీసకట్టుతో, చాప్లెన్ మనకు కనిపిస్తారు. ఎలాంటి వారికి అయినా నవ్వుతెప్పించే కళాకారుడు చాంప్లెన్.అయనను తన పాత్రలో ట్రాంప్ గా తయారు చేసుకున్నారు. చాప్లెన్.
చాప్లెన్ మంచి కళాకారుడు, మిమిక్రి చాలాబాగా చిన్నప్పటినుండీ బాగా చేసేవారు.మంచిరచయిత, పాటగాడుకూడా.అయన ఒకశాంతి ప్రియుడు, అందంగాడు, మంచిహృదయంకలవాడు,చాంప్లెన్ ఒక ప్రపంచ అద్బుతాలలో ఒకరు. చార్లీ చాప్లిన్1889 ఏప్రిల్ 16 వ తేదీన ఇంగ్లండ్‍లోజన్మించాడు. అతని తల్లి పేరు హన్నా ఆమె శ్పానిష్-ఐరిష్ వంశంనుండి వచ్చింది. తండ్రి చార్లెస్ ఫ్రెంచి-యాదు వంశీయుడు. తల్లిదండ్రులిరువురు వృత్తిరీత్యా నటులు వారి ప్రదర్శనలు 'వాడెవిల్' అనే తరహాకి చెందినవి. అంటే ఆట, పాట, హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలన్నమాట. ఇంగ్లండ్‍లో మ్యూజిక్ హాల్స్‍గా ప్రసిద్ధికెక్కిన నాటక మందిరాలలో ఈ వాడెవిల్ ప్రదర్శనలు జరిగేవి. చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శన లిచ్చి డబ్బు గడించేవారు. కాని, అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు. అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది. తండ్రి కొన్నాళ్లకి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరికొన్నాళ్లకి చనిపోయాడు. తల్లి అష్టకష్టాలు పడి పిల్లలను పెంచింది. కొన్నాళ్లకి ఆమెకి మతి చలించి, ఉన్మాదిని అయింది. ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు చాప్లిన్ మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనబరచాడు. అయిదవ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజి మీదకి ఎక్కి పాట పాడాడు. క్రమంగా నట వృత్తిలో ప్రవేశించాడు. కాని వేషాలు వరసగా దొరికేవి కావు. పది పదకొండేళ్ల వయస్సు వచ్చేవరకు అతని జీవితం చాల దుర్భరంగా గడిచింది. కూలి నాలి చేసి పొట్టపోసుకునేవాడు. మార్కెట్‍లోనో, పార్కులలోనో పడుకునేవాడు. కాని క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి. అందులో ఒకటి "From Rags to Riches " అనే నాటకంలో మరొకటి షెర్లాక్ హొమ్స్ నాటకంలో బిల్లీ అనే ఆ ఫీసు బోయ్ వేషం. 1904 నాటికి మంచి నటుడుగా పేరు వచ్చింది. మంచి భవిష్యత్తువుందని అందరు అనేవారు. అన్న సిడ్నీ ద్వారా కార్నో కంపెనీ అనే సంస్థలో నటుడుగా చేరాడు. 1910-1913 మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు. అక్కడా అతనికి మంచి పేరు వచ్చింది. అతని అభిమానులలో ఒకడు మాక్ సెనెట్. అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి, నటుడు, చలన చిత్ర నిర్మాత. అప్పటికే అతడుఎన్నో కామెడీలు నిర్మించాడు. అప్పటికి స్టేజిమీద వారానికి 50 డాలర్ల జీతంపుచ్చుకుంటున్న చాప్లిన్‍ను వారానికి 150 డాలర్లతో తన సినిమాలలోకి తీసుకున్నాడు. 1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు. జన్మతః చాప్లిన్ బ్రిటిష్ వాడైనా అతడి ప్రతిభని గుర్తించి గౌరవించి ఆదరించిందిఅమెరికా. మరి అదే అమెరికాలో అతని వ్యక్తిగత జీవితం పట్ల, రాజకీయ భావాల పట్ల ఎంతగా అసహనం, విద్వేషం ఏర్పడ్డాయంటే 1952 ప్రాంతాలలో అతడు అమెరికాను శాశ్వతంగా వదలిపెట్టిస్విట్జర్లెండ్లో స్థిరపడవలసి వచ్చింది. ముఖ్యంగా అతడు మీడియాకు ప్రధాన కేంద్రమయ్యాడు. పత్రికలవాళ్ళు అతడ్ని వ్యక్తిగతంగా, వృత్తి రీత్యా గూడా ఇబ్బందులపాలు చేస్తూనే వున్నారు. అతడ్ని అమెరికాకు వ్యతిరేకి అని, కమ్యూనిస్టని చాలా ఘోరంగా ప్రచారం చేసారు. " యిన్ అమెరికన్ యాక్టివిటీస్ కమెటీ, విచారణ పరిశోధన విభాగం న్యాయస్థానం ద్వారా చాప్లిన్‌కు తాఖీదులు పంపడం తరచూ జరిగేది. అతడు అమెరికాలో అప్పటికి 40 ఏళ్ళుగా నివసిస్తున్నప్పటికీ, చాప్లిన్ బ్రిటీష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు. ఈ వంకతో అతడ్ని వేధించడం మొదలేశారు. అయితే చాప్లిన్ వాదమేమంటే , తాను కళాకారుడనని, అందువల్ల ఏ దేశ పౌరుడయినా పట్టించుకోవలసింది కాదని, తన అభిప్రాయం ప్రకారం కళాకారుడుగా తాను ప్రపంచ పౌరుడనని, ప్రత్యేకంగా ఏ ఒక్క దేశానికీ చెందినవాడ్నికాదని చెప్పాడు. కాని కమిటీ ఎలాగైనా అతడ్ని జైలుపాలు చేయాలని ప్రయత్నించింది. ఫలితం దక్కలేదు. పత్రికలవాళ్ళు అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని వివధ ప్రయత్నాలు చేశారు. వారికి ఒకే ఒక కోరిక అతడ్ని ఎలాగైనా రష్యా పంపించివేయాలని.
దైనందికంగా ఏర్పడుతున్న ఇబ్బందుల కారణంగా అతడు 1952 లో అమెరికాను వదలి ఇంగ్లండ్ చేరుకొని అక్కడ నుంచి స్విట్జర్లెండ్‌లో స్థిరపడ్డాడు. అక్కడ ప్రజలు , ప్రఖ్యాత రచయితలు , కళాకారులు, చిత్రకారులు, రంగస్థల నటులు, అతన్ని ప్రశంసించేవారు. అతడ్ని " గ్రేట్ హ్యూమనిస్ట్ ' ( గొప్ప మానవతావాది) అని చెప్పుకునేవారు. అప్పటికి చాప్లిన్‌కు 64 సంవత్సరాల వయస్సు వచ్చింది. అతని కోరికల్ల చివరి ఈ కాస్త జీవితం ప్రశాంతంగా గడపాలని, పరిస్థితులన్నిటినీ బేరీజు వేసుకున్న దరిమిలా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు
ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా పెయింటింగ్ తెలియని వారు వుండరు. ఈ పెయింటింగ్ చాలా విశిష్టమైనది. ఈ పెయింటింగ్ చూస్తే విచిత్రమైన అనుభూతి కలుగుతుందిట. ఒక్కక్కసారి నవ్వుతున్నట్టు కనిపిస్తుందిట. ఇంకోసారి చూస్తే కోపంగా కనిపిస్తుందిట. ఈ పెయింటింగ్ మీద అనేకమైన శాస్త్రీయమైన ప్రయోగాలు చేస్తున్నారుట.
మనకు ఈ పెయింటింగ్ గురించి తెలుసు కానీ ఇది ఎవరు వేసారు అన్నది అందరికీ తెలియదు. ఈ పెయింటింగ్ ను లియొనార్డో డావిన్సి అన్న ప్రముఖ కళాకారుడు వేసాడు.
మనం అతని గురించి తెలుసుకుందాం. లియొనార్డో డావిన్సి ఏప్రిల్ 15, 1452 లో జన్మించారు. ఇతను ఇటాలికి చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు మరియు రచయిత. ఇతడు చిత్రీకరించిన చిత్రాలలో ప్రసిద్ది చెందినది లాస్ట్ సప్పర్ మరియు మొనాలిసాచిత్రం. డావిన్సి తల్లిపేరు రజెష్కాటెరిన్స్. 1469 లో ఈయన తండ్రి ష్లోలెంన్స్ కు వెళ్ళీపోయారు. 14 ఏళ్ళ వయస్సు నాటికే మోడలింగ్ లో డావిన్సి ఎంతో ప్రతిభ కనబరిచాడు. ఈయనను ఆండ్రియా డెల్ వెర్రాచివో శిల్పాచార్యునివద్ద చేర్చించాడు డావిన్సి తండ్రి.30 యేళ్ళ వరకు డావిన్సి ప్లోరెన్స్ లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. కాని ఆదాయం మాత్రము యేమీ ఉండేది కాదు. 1482 లో డావిన్సి మిలాన్ రాజుకు తన గురించి తెలియ జెప్పుకున్నాడు. ఫలితంగా ఈయన మిలిటరీ ఇంజనీరింగ్ కాగలిగారు. ఎన్నో రకాల యుద్ధ పరికరాలను రూపొందించారు. రకరకాల ఆయుధాలను తయారు చేసాడు. ఈయన వీధులు,కాలవలు,చర్చిలు,గుర్రపు శాలలు, రాజ ప్రసాదారు- ఎలా ఉండాలో చెబుతూ వాటికి ప్లానులు వేసేవాడు. అంతేకాదు 1495 లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన "లాస్ట్ సప్పర్" చిత్రాన్ని మొదలుపెట్టి 1497 లో పూర్తి చేశాడు.
లాస్ట్ సప్పర్
1499 లో డావిన్సి వెనిస్ నగరం చేరుకున్నాదు. అప్పుడు టర్కీతో యుద్ధం జరుగుతూ ఉండింది. ఆ యుద్ధ సమయంలో ప్రత్యర్థులను కొట్టడానికి కావలసిన సామాగ్రి గురించి, ఆత్మ రక్షణ కోసం ఉపయోగించవలసిన వస్తువుల గురించి, డావిన్సి ఎంతో విశదంగా తెలిపారు. కాని ఆయన ఆలోచనలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ఆచరణలో పెట్టలేదు. ఖర్చు విషయం తప్పిస్తే ఈయన చెప్పినవాటికి ఏవీ సాటి రావని చెప్పవచ్చు. డావిన్సి 1500 లో మళ్ళీ ఫ్లోరెన్స చేరుకున్నాడు. 1503 లో విశ్వ విఖ్యాతమైన "మొనాలిసా" పెయింటింగ్ మొదలుపెట్టాడు. ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది. ఆ పెయింటింగ్ కు ఆధారమైన్ మోడల్ అమ్మాయి ప్రతీరోజు వస్తు వెళ్తూ వుండేది. ఈ పెయింటింగ్ కు పూర్తి అయ్యాక ఆ చిత్ర్ం లోని అమ్మాయి నవ్వు అతి విచిత్రంగా ఉంది. డావిన్సిని సైతము కట్టి పడేసింది.ఈ నవ్వు మాయాజాలం లా పనిచేసి కోట్లాది మందిని ఆకర్షించగలిగింది.ప్రస్తుతం ఈ పెయింటింగ్. ఫ్రాన్స్ లోని లౌవ్రె మ్యూజియంలో ఉంది. "మోనాలిసా" తో సుప్రసిద్ధుడయ్యాక డావిన్సి మిలాన్ చేరుకుని 1506-1513 మధ్య కాలంలో "ది వర్జిన్ విత్ చైల్డ్", "పెయింట్ ఆన్నె" వర్ణ చిత్రాలను లోక ప్రియంగా రూపొందించాడు. 1513 లో రోమ్ చేరుకున్నాక ఫ్రాన్సిస్ మహారాజు ప్రత్యేక అతిధిగా శేష జీవితం గడిపాడు.
ఎగిరే యంత్రము
ఎగిరే యంత్రాలను గురించి ఆలోచించి డావిన్సి ఎన్నో రకాల నమూనాలను తయారుచేసాడు. హెలికాప్టర్ వంటివి తయారుచేశాడు.మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశాడు. నీటి గడియారాన్ని అందించాడు.బరువైన వాటిని తేలికగా తొలగించే "క్రేన్" లను డావిన్సి ఆకాలం లోనే యేర్పాటు చేశాడు. 1519 లో మరణించాడు.
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారత దేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట.ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. పంజాబ్రాష్ట్రంలోనిఅమృత్సర్లోగలస్వర్ణ దేవాలయంపక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20 వేలమంది ప్రజలు సమావేశమయ్యారు. అదివైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశమవడానికి ముఖ్య కారణం, ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం మరియు అనేక విమర్శలకు గురైనరౌలట్ చట్టంక్రింద సత్యపాల్, మరియు సైఫుద్ధీన్ కిచ్లూ లను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడం.
వివిధ విభాగాలకు చెందిన 90 మంది సైనికులు (ఇండియన్ ఆర్మీ), వారితో బాటు రెండు సురక్షిత వాహనాలు (armoured cars) అక్కడికి వచ్చాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలా బాగ్ అన్ని ప్రక్కలా ఇండ్లతోను, పెద్ద భవనాలతోను చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలావాటికి తాళాలు వేసిఉన్నాయి.
కాల్పుల కారణంగా వందలమంది మరణించారు. గాయపడినవారి సంఖ్య వేలల్లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 379 మంది (337 పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు) మరణించారు మరియు 200 మంది గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నంపైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. అయితే అధికారిక గణాంకాలు సరికాదని వాదనలున్నాయి. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడినవారని ఆసుపత్రులకు తీసికొని వెళ్ళడం సాధ్యం కాలేదు.
తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరుపవలసి వచ్చింది. డయ్యర్‌కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వయర్ ఇచ్చిన టెలిగ్రాములో "నీ చర్య సరైనదే. దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్ధిస్తున్నాడు" అని వ్రాసి ఉంది.
ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో "హంటర్ కమిషన్" ఏర్పరచారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ - తనకు ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసిందనీ, దానిని నిలపడానికి తానేవిధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ - చెప్పాడు.
"బహుశా కాల్పులు జరుపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కాని వాళ్ళంతా మళ్ళీ తిరిగివచ్చి నన్ను అవహేళన చేసేవారు. నేను చేతగానివాడినయ్యుండేవాడిని." — (హంటర్ కమిషన్ సమక్షంలో డయ్యర్ స్పందన)
అంతే గాకుండా ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కాని ఇరుకైన సందులలోకి సాయుధ వాహనాలు వెళ్ళడం కుదరలేదని చెప్పాడు. జనం చెల్లా చెదురైనా గాని కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పులవల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం తన బాధ్యత కాదు గనుక అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని, ఆసుపత్రులు తెరచి ఉన్నందున వారే వెళ్ళవచ్చునని కూడా అన్నాడు.
1920లో హంటర్ కమిషన్ రిపోర్టు వెలువడింది. డయ్యర్‌ను క్రింది పదవికి మార్చారు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి ఉండడం వలన తరువాత అతనిని వైద్య సదుపాయాలున్న ఓడలో ఇంగ్లాండుకు పంపేశారు. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మరొక భారత సైనిక తిరుగుబాటును అణచివేసినందుకు అతనిని ప్రశంసించారు. బ్రిటిష్ పార్లమెంటులో అతని చర్యను నిరశిస్తూ తీర్మానాలు చేశారు. ఇది చాలా దారుణమైన, అసాధారణమైన చర్య అని చర్చిల్ అభివర్ణించాడు. 1920లో డయ్యర్ పదవికి రాజీనామా చేశాడు.
1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923లో ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్‌ల నుండి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్మారక చిహ్నం.
1796 ఏప్రిల్ 13న భారత దేశం నుండి పంపినఏనుగుఅమెరికా చేరినది. అప్పటివరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూడలేదు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది అది తెలిసాక. మనకు అయితే బాగా తెలుసు మన చిన్నప్పట్టి నుండి మనకు ఏనుగు కదలు పాటలు నేర్పేవారు. నాకు ఇప్పటికి గుర్తువున్న ఏనుగు పాట
ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరేళ్ళింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు మా ఊరోచ్చింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు ఏ ఊరేళ్ళింది ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు మా ఊరోచ్చింది ఏనుగు
ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడూ ఏంతో చక్కని దేవుడు
ఏనుగు మీద రాముడూ ఏంతో చక్కని దేవుడు
మన హిందు పురాణగాధలలో విఘ్నాలు తొలిగించే శక్తి ఉన్న ఒకే ఒక దేవతామూర్తి వినాయకుడుతలఖండించినశివుడుఏనుగు తలను తెచ్చి అతికించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. గజేంద్ర మోక్షములో మహా విష్ణువు సుదర్శన చక్రం తోమొసలినిసంహరించి గజేంద్రున్ని రక్షిస్తాడు. క్షీరసాగర మథనంలోపుట్టినఐరావతంఅనే తెల్లని ఏనుగు, ఇంద్రుని యొక్క వాహనముగా వుంది.
అష్ట లక్ష్మిలలో గజలక్ష్మి ఒకరు. ఏనుగుఒక భారీ శరీరం, తొండం కలిగిన జంతువు. ప్రస్తుతం భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి ఏనుగే పెద్దది. దీని గర్భావధి కాలం 22 నెలలు. ఏనుగు 70 సంవత్సరాలు కంటే ఎక్కువగా జీవిస్తుంది. ఏనుగులు రెండు రకాలు: ఆఫ్రికా ఏనుగుమరియు ఆసియా ఏనుగు. హిందువులు ఏనుగును వివిధరకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాఖాహారులు మరియు బాగా తెలివైనవి. ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చికచేసుకున్నారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి ఉపయోగిస్తారు. ఇలాంటి పనులను ముఖ్యంగా ఆడ ఏనుగుల నుపయోగించేవారు. యుద్ధాలలో ఏనుగులను భారతదేశంలోను, తర్వాత పర్షియాలోను ఉపయోగించారు. వీటికోసం ముఖ్యంగా మగ ఏనుగులను మాత్రమే పనికొస్తాయి. భారీ పనులకోసం, వృక్షాలను కూల్చడానికి, పెద్దపెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధఖైదీలను వీటి పాదాలక్రింద తొక్కించడానికి వాడేవారు.మహారాజులుఅడవులలో క్రూరమృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడటం కోసం ఏనుగులమీద వెళ్ళేవారు. కొన్ని దేవాలయాలలో ఊరేగింపులలో ఏనుగుల్ని ఉపయోగిస్తారు.
ప్రపంచవ్యాప్తంగాజంతుప్రదర్శనశాలలలో మరియుసర్కస్లలో ఏనుగులు ప్రధాన ఆకర్షణలు. గజారోహణం,లతో మహారాజులు ఆనాటి గొప్ప కవిపండితులను సన్మానించేవారు.
మనం చాలా సులువుగా మనకు నచ్చిన ధ్వనిని రికార్డ్ చేయగలుగుతున్నాం. అలా రికార్డ్ చేయటానికి ఈనాడు అయితే అనేకనేక పరికరాలు అందుబాటులో వున్నాయి. మన చేతిలో నిరంతరం వుండే మొబైల్ నుండి కూడా ధ్వనిని రికార్డ్ చేసేస్తాం. అంతకు ముందు టేప్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేసేవారు. వీటి అన్నిటికంటే ముందు అసలు ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను ఎప్పుడు నుండి ఎలాంటి పరికరం ద్వారా రికార్డ్ చేసేవారంటే ! 1860 వ సంవత్సరం ఏప్రిల్ 9 న ధ్వని రికార్డు చేసుకునే యంత్రం ను కనుగొన్నారు. దాని పేరు ఫొనాటోగ్రాఫ్ యంత్రం ( Phonautograph ).
దీనిని మొట్ట మొదట ఫ్రెంచ్ మెన్ Édouard-Léon Scott de Martinville కనుక్కోనాడు. దానిమీద పూర్తి అధికారాలు మార్చి 25 1857 లో పొందాడు. ఇతను ఫ్రెంచ్ ప్రింటర్ మరియు పుస్తకాలు అమ్మకం వ్యాపారం చేస్తూవుండేవాడు. వృత్తిరీత్యా అతను ఒక ప్రింటర్, అతను ఎల్లప్పుడూ కొత్త కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు గురించి చదువుతూవుండేవాడు మరియు అతను ప్రయోగాలు కూడా చేసేవాడు . స్కాట్ డి MARTINVILLE కాంతి మరియు ఫోటో కోసం ఫోటోగ్రఫీ అప్పటి కొత్త టెక్నాలజీ ద్వారా అతనికి ఆలోచన వచ్చింది. ఒక విధంగా ఆలోచించి మనిషి యొక్క ప్రసంగం యొక్క ధ్వనిని రికార్డింగ్ చెయ్యాలి అనే ఆసక్తి కలిగింది.
1853 నుండి ఆయన స్వర శబ్దాలు లిప్యంతరీకరణ యంత్రాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఒక భౌతిక పాఠ్య పుస్తకం లోని మానవుని శారిర శాస్త్రంలో చెవి అంతర్బాగం డ్రాయింగ్లు వున్నాయి . అతను కర్ణ భేరిని చూసి దాని మాదిరిగా, ఒక దీపపు మసితో కవర్ అయిన ఒక కాగితం, చెక్క లేదా గాజు ఉపరితలంపై వత్తుతారు ప్రతిపాదిత ఒక stylus తో చిన్న ఎముక కోసం లేవేర్ యొక్క ఒక ధారావాహిక కొరకు సాగే పొర చొప్పిస్తూ ఒక యాంత్రిక పరికరం ను తయారు చేసారు. జనవరి 1857 26 న, అతను ఫ్రెంచ్ అకాడమీకి తన సీల్ చేయబడిన కవర్లో డిజైన్ అందించాడు.
Phonautograph ను తయారు చేయటానికి ఒక దీపం నలుపు పూత, చేతితో త్రిప్పే క్రాంక్ సిలిండర్పై ఒక చిత్రం చెక్కబడివుంది. ఇది ఒక గట్టి bristle తో కంపింపచేసే ఇది ఒక డయాఫ్రమ్ జత, ధ్వని సేకరించడానికి ఒక కొమ్ము ఉపయోగించారు . స్కాట్ ధ్వని వాయిద్యం మేకర్ రుడోల్ఫ్ కోనిగ్ సహాయంతో పలు పరికరాలను నిర్మించారు. 1877 యొక్క ఎడిసన్ యొక్క ఆవిష్కరణ కాకుండా, ఫోనోగ్రాఫ్, Phonautograph మాత్రమే ధ్వని మరియు దృశ్య చిత్రాలు రూపొందించినవారు. కానీ దానిని రికార్డింగ్ ఆడడానికి వీలు లేదు. స్కాట్ డి MARTINVILLE యొక్క పరికరం మాత్రమే ధ్వని తరంగాల శాస్త్రీయ పరిశోధనలు కోసం ఉపయోగించారు.
స్కాట్ డి MARTINVILLE ధ్వని రికార్డర్ ను మాత్రమె శాస్త్రీయ ప్రయోగాల కోసం ప్రయోగశాల లో ఉపయోగించేవారు. అంతే కాదు phonautographs అమ్మకములను కూడా చేయగలిగారు . ఇది అచ్చు శబ్దాలు యొక్క అధ్యయనానికి ఉపయోగపడుతుంది అని నిరూపించాడు.
శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం.
అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.
శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.
భారతదేశములో ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని విగ్రహరూపంతో ఆలయము లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత ఏమిటో తెలుసుకుందాం!ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షసులకు , దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఎల్లప్పుడూ రామనామ సంకీర్తనా పరుడు హనుమంతడు .
ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను.
ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్నిగ్రహించి స్వామిభక్తి పరాయణుడై వ్యాకరణం పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు. కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో కదా !.హనుమతుని గురించి చెప్పుకుంటూ పోతే మనకు కాలం తెలియదు. సరే ఇక మన బ్లాగ్ మిత్రులు అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
ఏప్రిల్ 1 ని మనం ఏప్రిల్ ఫూల్ రోజు గా జరుపుకుంటాం. దీనికి ఒక కధ వుంది. అది ఏమిటంటే పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్ లో కూడ సంవత్సరాది మార్చి నెల మధ్యలోనే జరుపుకునేవారు. యూరప్ లో ఈ నూతన సంవత్సరపు ఉత్సవాలు మరియు వసంత కాలపు ఉత్సవాలు కలిపి ఓ పది రోజుల పాటు వరసగా జరుపుకునేవారు. ఏప్రిల్ 1 రాగానే ఈ ఉత్సవాలు ముగిసే సందర్భంలో ఒకరికొకరు బహుమానాలు ఇచ్చి పుచ్చుకునేవారు. ఇలా ఎప్పుడూ ఘనంగా జరుపుకునేవారు. అలావుండగా అప్పటి ఫ్రాంసు దేశపు రాజు సంవత్సరాదిని మార్చి మధ్య నుండి జనవరి 1 వ తారీఖుకి మార్చుతూ ఒక నోటీసు జారీ చేసాడు. ఆ రోజులలో వార్తాపత్రికలు, రేడియోలు, టీవీలు, కంప్యూటర్స్ లేవు. వారు అప్పట్లో దండోరా వేయించి వుంటారు. కాని రాజు గారి నోటీసు అందరికీ చేరలేదు. అందిన వాళ్ళు కూడ పాత అలవాట్లని వారు మార్చుకోలేకపోయారు. కనుక రాజధానిలో సంవత్సరాది జనవరి ఒకటిన జరిగిపోయినా కానీ దేశపు మూలల్లో మాత్రము ఏప్రిల్ 1 న బహుమానాలు ఇచ్చుకోవటంమానలేదు. అందుకని వాళ్ళని ఎగతాళిగా ఏప్రిల్ ఫూల్స్ అనేవారు. పాత అలవాట్లు మనలేక వారు జరుపుకుంటున్నారు కదా. అందుకని ఇప్పటికీ అల్లరిగా బహుమానాలు ఇచ్చుకోవటం, మరియు ఒకరిని ఒకరు ఫూల్స్ చేసుకుంటున్నారు. అందుకే ఏప్రిల్ 1 ని ఫూల్స్ డే గా జరుపుకుంటున్నారు. చాలా సరదాకా వుంటుంది. ఫూల్స్ అయ్యినవారు బాధపడకుండా సరదాగా తీసుకొని ఎంజాయ్ చేయచ్చు. ఫూల్స్ డే బాగుంది కదండి.