Blogger Widgets

Monday, November 18, 2013

భారత జాతీయ జంతువు గా పెద్దపులి

Monday, November 18, 2013

1972 నవంబర్ 18 వ తేదిన భారత జాతీయ జంతువు గా పెద్దపులి'ని స్వీకరించారు. పులిని మన ప్రభుత్వం జాతీయ జంతువుగా ప్రకటించింది.  పులి భారతదేశంతో పాటు బంగ్లాదేశ్‌కి కూడా జాతీయ జంతువు. శాస్ర్తీయనామం పాంథేరా టైగ్రిస్‌. టైగర్‌ అనే పదం గ్రీకు భాషలోని టైగ్రిస్‌ నుండి వచ్చింది. దాని అర్థం బాణం. పాంథేరా అంటే పసుపు జంతువు అని అర్థం. సుమారు 11 అడుగుల పొడవు, 300 కిలోల వరుకు బరువు ఉంటుంది. సుమారు 5 మీటర్ల దూరం వరకు దూకుతుంది. గంటకు 65 కిమీ వేగంతో పరుగెడుతుంది. పులి ఒంటి మీద దాదాపుగా 100 చారలు ఉంటాయి. ఏ రెండు పులుల ఒంటి మీద చారలూ ఒకేలా ఉండవు. గత వందేళ్లలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పులులు మనగాడకు అనేకమైనవి ప్రశ్నార్ధకముగా మార్చేస్తున్నాయి.  పాలకుల నిర్లక్ష్యం ముఖ్యముగా చెప్పుకోవచ్చు.  పెద్దపు లులను భవిష్యత్‌ తరాలు జూలోనే చూసేలా పరిస్థితులు తయారవుతున్నాయి. నాగరిక సమాజం పులుల పాలిట శాపంగా మారుతోంది. శాస్ర్తీయ అధ్యయనాలు, గణాంకాలను చూస్తే చేదు నిజాలు వెల్లడవుతున్నాయి. పెద్ద పులి ఉందంటే ఆ అడవిలో పర్యావరణ సమ తుల్యంపరిఢవిల్లుతుందనేది అటవీ అధికా రుల నమ్మకం. ఒక పులి సంచరించే ప్రాం తం చుట్టుపక్కల మరో పులి సంచరించదు. 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ఒక పులి తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంది. ఫుడ్‌ పిరమిడ్‌లో అగ్రస్థానంలో ఉండే పెద్ద పులి నివసించాలంటే ఆ ప్రాంతంలో చిన్నా, పెద్దా అన్నిరకాల జంతువులుండాలి. మంచి వర్షపాతం ఉండాలి. పచ్చని చెట్లతోకూడిన దట్టమైన అడవి అయ్యి ఉండాలి. ఇది పెద్దపు లి రాజసం. మన దేశంలో రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన జాతి. సైంటిస్టులు రాణా టైగర్‌గా వ్యవహరించే ఈ పులిని మన ప్రభుత్వం జాతీయ జంతువుగా ప్రకటించింది.  పులి (పాన్థెర టైగ్రిస్ )ఫెలిడే కుటుంబానికి చెందినది;పాన్థెరా తరగతికి చెందిన నాలుగు "పెద్ద పిల్లులలో" ఇది ఒకటి. భారతదేశం ప్రపంచంలో కెల్లా అత్యధికంగా అడవులలో నివసించే పులుల జనాభాను కలిగి ఉన్న దేశం. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రకారం, ప్రపంచంలోని 3,500 పులులలో, 1,400 భారత దేశంలోనే ఉన్నాయి.  పూర్వకాలములో ను పులులు ఎక్కువగా వుండేవి ప్రజారక్షణ కారణంగా రాజులు వాటిని వేటాడేవారు.  ఇప్పుడు వాటికే రక్షణ కరువైంది అనటంలో ఎటువంటి సందేహము లేదు.  పులులు ను వేటాడటానికి , స్మగ్లింగ్ చేయటానికి కారణం పులి చర్మం, గోర్లు, దంతాలు చాలా విలువైనవి గా భావిస్తున్నారు  అందుకే ఇవన్ని ,  అంతేకాదు పులిలో ఔషధగుణాలు వున్నాయి అని నమ్ముతారు.  నిజానికి అలాగేమీ లేదు.  అలా ఔషధగుణాలు వున్నట్టు ఎటువంటి శాస్త్రీయమైన ఆదారాలు లేనేలేవు.  అందువల్ల మన జాతియజంతువుకు హానికలగకుండా,  రక్షణ ఏర్పరచాలి.  ప్రభుత్వం వాటి మనుగడను కోల్పోకుండా మంచి చర్యలు తీసుకోవాలి.  

2 comments:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers