గంగా శంకాశ కావేరీ శ్రీరంగేశ మనోహరీ కళ్యాణకారి కలుషారీ
నమస్తేస్తు సుధాఝరీ ఆ ..............ఆ...............
శ్రీరంగరంగనాధునీ దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
నీలవేణిలో నీతిముత్యాలు..........కృష్ణవేణిలో అలలగీతాలు
నీలవేణిలో నీతిముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణ గీతలే పాడగా || శ్రీరంగరంగ ||
కృష్ణాతీరాన అమరావతిలో శిల్పకళావాణి పలికిన శ్రుతిలో
అలలైపొంగేనూ జీవన గీతం కలలే పలికించు మధుసంగీతం
చల్లగా గాలి పల్లకీలోన పాట ఊరేగగా
వెల్లువై గుండె పల్లె పదమల్లి పల్లవే పాడగా
శ్రీ త్యాగరాజ కీర్తనైసాగె తీయనీ జీవితం || శ్రీరంగరంగ ||
గంగను మరపించు ఈ కృష్ణవేణి వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణీ
పాపాల హరియించు పావన జలమూ పచ్చగ ఈ నెల పండించు ఫలమూ
ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా
సిరులెన్నో పండి ఈ భువీ స్వర్గ లోకమై మారగా
కల్లకపటమే కానరానీ ఈ పల్లె సీమలో || శ్రీరంగరంగ ||
శ్రీరంగరంగనాధునీ దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే..................
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.