Blogger Widgets

శుక్రవారం, అక్టోబర్ 11, 2013

అమ్మవారు సరస్వతి గా

శుక్రవారం, అక్టోబర్ 11, 2013

మూలా నక్షిత్రము కదా సరస్వతి పూజ ఈ రోజు చేస్తారు. పిల్లలు కు మంచి చదువులు రావాలని కోరిన విద్యలు వారికి రావాలంటే సరస్వతి మాత కరుణకావాలి ,ఈ మాతను కొలచిన సకల విద్యలు ప్రసాధిస్తుంది. ఈమె తెల్లని వస్త్రదారిని అయ్యి. ఒక చేతితో వీణను మీటుతూ పుస్తకదారియై మనకు దర్శనము ఇస్తుంది .ఈమెకి హంసవాహనము. ఈమాత త్రిమూర్తులలో బ్రహ్మదేవుని అర్ద్దంగి. పరాశక్తి మొదట దరించిన ఐదు అవతారలలో సరస్వతి మాత అవతారము ఒకటి. సరస్వతి మాత కేవలం చదువులు ప్రసాధించేది మాత్రమే కాదు సర్వశక్తులు యుక్తులు ప్రసాధిస్తుంది.
సరస్వతీ వందన మంత్రం అధిక జ్ఞానం మరియు విజ్ఞత కోసం వల్లించే ముఖ్యమైన హిందూ మంత్రం.సరస్వతీ దేవి చదువులకి మరియు కళలకి అధిదేవత. భారతదేశంలో సంగీతకారులు నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ మార్గదర్శకత్వం మరియు జ్ఞానం కోసం ఆమెని పూజిస్తారు. సరస్వతీ వందన మంత్రాన్ని ఆమె భక్తులు ప్రతి ఉదయం శుభంకోసం వల్లిస్తారు.కేవలం పాట అనే అర్థం గల వందనానికి ప్రతి ఒక్కరు భిన్న విధాలను పాటిస్తారు. కనుక విద్యార్థిగా నువ్వు భౌతిక జ్ఞానాన్ని కోరుకుంటే, సంగీతకారుడు సరైన తాళాలని మొదలైన వాటిని కోరుకుంటాడు. 
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా,వీణాపాణిగాపుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి".



    కాళరాత్రి
నవ దుర్గాలలో ఏడవ రోజు "కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు. కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.  


కాళరాత్రి :
'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
  వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ' 



ఈమెకి నివేదనగా కదంబం అర్పిస్తారు.

గురువారం, అక్టోబర్ 10, 2013

అమ్మవారు ఆరవరోజు వీణాపాణిగా

గురువారం, అక్టోబర్ 10, 2013

ఆరవరోజు న మూలా నక్షిత్రము కదా సరస్వతి పూజ ఈ రోజు చేస్తారు. పిల్లలు కు మంచి చదువులు రావాలని కోరిన విద్యలు వారికి రావాలంటే సరస్వతి మాత కరుణకావాలి ,ఈ మాతను కొలచిన సకల విద్యలు ప్రసాధిస్తుంది. ఈమె తెల్లని వస్త్రదారిని అయ్యి. ఒక చేతితో వీణను మీటుతూ పుస్తకదారియై మనకు దర్శనము ఇస్తుంది .ఈమెకి హంసవాహనము. ఈమాత త్రిమూర్తులలో బ్రహ్మదేవుని అర్ద్దంగి. పరాశక్తి మొదట దరించిన ఐదు అవతారలలో సరస్వతి మాత అవతారము ఒకటి. సరస్వతి మాత కేవలం చదువులు ప్రసాధించేది మాత్రమే కాదు సర్వశక్తులు యుక్తులు ప్రసాధిస్తుంది.
సరస్వతీ వందన మంత్రం అధిక జ్ఞానం మరియు విజ్ఞత కోసం వల్లించే ముఖ్యమైన హిందూ మంత్రం.సరస్వతీ దేవి చదువులకి మరియు కళలకి అధిదేవత. భారతదేశంలో సంగీతకారులు నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ మార్గదర్శకత్వం మరియు జ్ఞానం కోసం ఆమెని పూజిస్తారు. సరస్వతీ వందన మంత్రాన్ని ఆమె భక్తులు ప్రతి ఉదయం శుభంకోసం వల్లిస్తారు.కేవలం పాట అనే అర్థం గల వందనానికి ప్రతి ఒక్కరు భిన్న విధాలను పాటిస్తారు. కనుక విద్యార్థిగా నువ్వు భౌతిక జ్ఞానాన్ని కోరుకుంటే, సంగీతకారుడు సరైన తాళాలని మొదలైన వాటిని కోరుకుంటాడు. 
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా,వీణాపాణిగాపుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి".



సరస్వతీ వందన మంత్రం:
యా కుందేందు తుషార హార-ధవళా,
యా శుభ్ర-వస్త్రా'వ్రిత
యా వీణా-వర-దండ-మండితకర,
యా శ్వేత పద్మా'సన
యా బ్రహ్మా'చ్యుత శంకరః ప్రభ్రితిభిర్ దేవై-సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేష జాడ్యా-పహా.

తెలుగు లో అనువాదం: 
పద్మము, చంద్రుడు, ఉదయపు పుష్పాల వంటి తెలుపుదనం కలిగినది;
వీణని చేత ధరించి, తెల్లని పద్మాసనం మీద కూర్చున్నది;
బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులతోపాటు దేవతలందరితోను నిత్యం పూజించబడేది;
ఓ తల్లి నా మానసిక జడత్వాన్ని తొలగించు

శుక్లాం బ్రహ్మ విచార సార పరమ మద్యం జగద్వ్యాపిని,
హస్తే స్ఫతిక్ మాలికం కమలం పద్మాసనే సంస్తితం .
వందేతం పరమేశ్వరీ భగవతీ.....
సా మాం పాతు సరస్వతీ భగవతీ బుద్ధి ప్రదం శరదాం.

నవదుర్గలలో ఆరవరోజు  కాత్యాయిని మాత. "కాత్యాయనీ మాత" భాద్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించినది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.
కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులమునందలి గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.  ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును. 
కాత్యాయని దేవి మంత్రం:
చంద్రహాసోజ్వలకరా శార్దులపర వాహనా l 
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినిll 
ఈనాడు ఈమెకు కేసరి బాత్ నివేదన అర్పిస్తారు .

బుధవారం, అక్టోబర్ 09, 2013

అమ్మవారు ఐదవరోజు శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి గా

బుధవారం, అక్టోబర్ 09, 2013

అమ్మవారు ఐదవరోజు లలితా త్రిపురసుందరి దేవి గా మనకు దర్శనము ఇస్తారు.ఈమెకి అల్లంగారెలు నెవేద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరినకోరికలు తీర్చేమాత. ఈ రోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి అలకారంలో దర్శనమిస్తోంది.

శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మత్సింహాసనేశ్వరి

చిదగ్ని కుండసంభూత దేవకార్య సముద్యత  
అంటూ మొదలవుతుంది శ్రీ లలితా సహస్రనామం.సర్వలోకాలకు అమ్మ అయిన ఆ జగన్మాత,అన్ని లోకాలకు అధికారిణి అయిన లలిత అమ్మవారి అవతారం గురించి బ్రహ్మాండపూరాణంలో కనిపిస్తుంది.భండాసురడనే రాక్షసుడు దేవతలను వేధించే సమయంలో వాడిని అంతం చేయడానికి ఆ ఆదిపరాశక్తి అవతారించవలసిన పరిస్థితి ఏర్పడింది."అమ్మ" అవతారించాలని శివుడు యజ్ఞం ఆరంభించాడు.అందులో సమస్త విశ్వాన్ని,14 భువనాలను,7సముద్రాలను అన్నిటిని ఆహుతులుగా వేశాడు.తరువాత దేవతలందరూ తమను తాము ఆ యజ్ఞంలో అర్పించుకున్నారు.అప్పుడు ఆ చిదగ్నికుండంలో నుండి అమ్మ దేవతల రక్షణకు అవతరించిందని,దేవతా స్త్రీ సైన్యాన్ని వెంటపెట్టుకొని వెళ్ళి వాడిని సంహరించిందని తెలుస్తొంది.  మన నిత్య జీవితంలో ప్రతి ఆటంకానికి ఈ లలితా సహస్రనామ స్తొత్రంలో నామాలు పరిష్కారాలగా చెప్పబడ్డాయి.  లలితా సహస్రనామ స్తోత్రం లో వర్ణించినట్లుగా సచామర రమావాణీ విరాజితా అన్నట్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటు నిలుచుని, లలితా పరాభట్టారికని వింజామరలతో సేవిస్తున్నట్లుగా అలం కరిస్తారు. మధ్యలోనున్న లలితాదేవి చిరునవ్వులు చిందిస్తూ, చేతిలో చెరకుగడను ధరించి, శివుడి వక్షస్థలం మీద కూర్చుని, అపురూప లావణ్యంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది.
 శ్రీ లలితా త్రిపురసుందరీదేవిని ఈ క్రింది శ్లోకంతో ధ్యానించాలి.

ప్రాత:స్మరామి లలితా వదనారావిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాసమ్‌
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యాం 
మందస్మితం మృగమదోజ్జ్వల ఫాలదేశమ్‌
ఓం శ్రీ లలితా త్రిపురసుందరీ దేవతాయైనమ: 



శ్రీ లలితా హారతి

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా, శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

జగముల చిరు నగముల పరిపాలించే జననీ,
అనయము మము కనికరమున కాపాడే జననీ,మనసే నీ వసమై, స్మరణే జీవనమై,
మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ హారతి. 
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా.

అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి,
రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి,
సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి. 

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా,
శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద.

'స్కందమాత 

కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత నవ దుర్గ లో ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. మూడు కనులు కలిగి వుంటుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.
'స్కందమాత స్తుతి



'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ
'

ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ . శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు.

మంగళవారం, అక్టోబర్ 08, 2013

అమ్మవారు శ్రీ మహాలక్ష్మిదేవి గా

మంగళవారం, అక్టోబర్ 08, 2013

శ్రీ మహాలక్ష్మి దేవి: దసరా నవరాత్రులలో నాల్గవరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనము ఇస్తారు.లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి. అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.  సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది(అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన (ప్రజానాం భవసి )సుక్తములో వివరించారు. శ్రీలక్ష్మి గురించి. దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.



శ్రీ సూక్తం
హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద-ప్రబోధినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్
పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

ఆదిత్యవర్ణే తపసో థిజాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మిన్ కీర్తిమృద్ధిం దదాదు మే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీ”మ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్

మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్

ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణా”మ్ హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలా”మ్ పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీ”మ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వా”న్, విందేయం పురుషానహమ్

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయా”త్
~ ఓం శాంతిః శాంతిః శాంతిః ~ 

మహాలక్ష్మిదేవికి క్షీరాన్నము నైవద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరిన కోరికలు తీర్చేమాత.

కూష్మాంఢ : 
నాలుగవ రోజు నవదుర్గలలో కూష్మాండమాతగా  అలంకరిస్తారు. ఈమె మంచిగా దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము నందలి సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.  'అష్టభుజాదేవి' అని కూడ అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.  భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.


కూష్మాంఢ దేవి స్తుతి: 

'సురాసంపూర్ణ కలశం రుధిరాపుత్రమేవచ
దధనా హస్త పద్మాభ్యం కూష్మాండా శుభదాస్తుమ్ '
 ఈ రోజు అమ్మవారికి చేసే అన్నం ప్రసాదాన్ని నూనెతో కాక నేతితో పోపు పెట్టి నేతి అన్నం నైవేద్యం పెడతారు .

సోమవారం, అక్టోబర్ 07, 2013

అమ్మవారు అన్నపూర్ణాదేవిగా

సోమవారం, అక్టోబర్ 07, 2013

దసరా నవరాత్రులలో అమ్మవారు మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దర్శనము ఇస్తారు. నవదుర్గాలలో చంద్రఘంటాదేవి గా దర్శనము ఇస్తారు.

అన్నపూర్ణ దేవి : 

అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది. 
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.  
ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. " హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.
అన్నపూర్ణ స్తోత్రం 

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాభఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నాలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

చంద్రార్కానలకోటికోటిసదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

క్షత్రత్రాణకరీ సదా శివకరీ మాతా కృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదా శివకరీ విశ్వేశ్వర శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి,
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవ శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్‌

ఇతిః శ్రీ అన్నపూర్ణాష్టకం సంపూర్ణమ్
చంద్రఘంటాదేవి
ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.
ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.
చంద్రఘంటాదేవి స్తుతి :
ఓం చంద్రఘంట చండి రక్షాకరో  
ఓం భయహరిని  మయ్య  రక్షాకరో
ఓం నవ దుర్గ నమః 
ఓం జగజనని నమః 

అమ్మవారికి దధ్యోదనము, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి.

ఆదివారం, అక్టోబర్ 06, 2013

రెండవరోజు అమ్మవారు గాయిత్రిదేవిగా

ఆదివారం, అక్టోబర్ 06, 2013

దసరా నవరాత్రులలో రెండవరోజు అమ్మవారు గాయిత్రిదేవిగా దర్శనం ఇస్తారు.  ఈమెనే నవదుర్గలలో బ్రహ్మచారినిగా కూడా అంటారు.  సకల వేద స్వరూపం గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది.
                                   ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః 

యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం
శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే 


గాయత్రీ మాత స్తోత్రం:
నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేzక్షరీ |
అజరేzమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || ౧ ||
నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేzమలే |
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోzస్తు తే || ౨ ||
అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |
నిత్యానందే మహామాయే పరేశానీ నమోzస్తు తే || ౩ ||
త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా |
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || ౪ ||
పూషాzర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః |
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాzప్సరసాం గణాః || ౫ ||
రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ |
ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ || ౬ ||
త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః |
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || ౭ ||
త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ |
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ || ౮ ||
తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా |
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే || ౯ ||
చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |
స్వాహాకారేzగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || ౧౦ ||
నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ |
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || ౧౧ ||
అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ |
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || ౧౨ ||

బ్రహ్మచారిణి 
నవదుర్గాలలో ఈమెను బ్రహ్మచారిణి అని అందురు.  'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.
గాయిత్రిదేవికి పసుపు రంగు తో చేసిన పులిహోర,  పులగము  నివేదనగా అర్పిస్తారు.

శనివారం, అక్టోబర్ 05, 2013

బాలాత్రిపురసుందరి

శనివారం, అక్టోబర్ 05, 2013

బాలాత్రిపురసుందరి:  నేటిదినమును బాలాత్రిపురసుందరి అవతారములో అమ్మవారిని పూజించవచ్చు.ఈరోజు చిన్నపిల్లలకు పసుపురాసి పూజచేసి వారిలో అమ్మవారిని చిన్నపిల్లగా చూస్తారు.  ఈ బాలాత్రిపురసుందరి దేవికి పాయసం నివేదనగా అర్పిస్తారు. 
స్తోత్రం :
కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
నితంబజిత భూధరాం సురనితంబినీసేవితాం
నవాంబురుహలోచనాం అభినవాంబుధశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కదంబవనవాసినీం కనకవల్లకీ ధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీం
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘననీలయా కవచితావయం లీలయా

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయన వాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే

స్మరప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మధువిధూర్ణనేత్రాంచలాం
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

సకుంకుమవిలేపనామలకచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం
అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికాం

పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీరచర్చారతాం
ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీ
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికాం


శైలపుత్రి: సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి. 

శుక్రవారం, అక్టోబర్ 04, 2013

“అయ్యవారికి చాలు అయిదు వరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” .

శుక్రవారం, అక్టోబర్ 04, 2013

ఆంధ్రప్రదేశ్‌లో దసరా పండుగకు సాహిత్యానికి సామీప్యత వుంది. ఉపాధ్యాయులు కలసి ఈ పండుగ రోజులలో  పిల్లలచేత రంగు రంగు కాగితాలు, రంగురంగు పువ్వులుతో  చుట్టిన విల్లంబులు చేయించి బాణం చివరిభాగాన పూమడతలో బుక్కాపూలు ఉంచి వారిని వారి వారి ఇండ్లకు తీసుకొని వెళుతూ! బుక్కాలు చల్లిస్తూ అయ్యవారికి చాలు ఐదువరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు.... అంటు పాటలు పాడిస్తూ వుండే వారు.  వారు ఇచ్చే చిరుకానుకలు ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవారు. ఈ పండుగతో ఉపాధ్యాయులకు, శిష్యులకు గల అన్యోన్యతను వ్యక్తపరిచే సందడి కూడా తెలుగు నాట ఒక ప్పుడు ప్రచురంగా ఉండేది.
దసరా పండుగల సందర్భంలో భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో అమలులో వున్న ఆచారాల్లో కొట్టవచ్చేటట్లు కనిపించేవి తమిళ నాడులో ఆడపిల్లల బొమ్మల కొలువు, ఆంధ్రదే శాన బడిపిల్లల విల్లంబుల ధారణ పేర్కొనదగినవి.
గిలకలు పట్టడం.  బడిపిల్లలు దసరా రోజులలో విల్లంబులు ధరించడం యుద్ధానికి కాదు, గురుదక్షిణ కొరకు. వీరి ఈ విల్లు అంబు ధరించటాన్ని గోదావరి ప్రాంతంలో గిలకలు పట్టడం అంటారు. గిలకలు పట్టి విద్యార్థులు ఇంటింటికి తిరిగి గురుదక్షిణ స్వీకరిస్తారు.   దసరా పద్యాలు సరసులైన బిడ్డల తండ్రులపై పూలబాణాలువేస్తూ తమ ఆయుధాలకు నివే దన తెమ్మంటూ, పప్పుబెల్లాలిమ్మంటూ, తమ్ము విద్యావంతులుగా చేసిన గురువులకు కట్నా లిమ్మంటూ, అదే పాటగా, అదే ఆటగా గ్రామం అంతా కలకల విరిసే చిన్న బొట్టెల సందడితో పలు పలుకులు పలుకుతూ ఉండేది. ఎక్కడ విన్నా పసిపాపల పాటలే. ఎక్కడ విన్నా జయ జయ ధ్వానాలే. ఇవి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమిదాకా వినిపించేవి.  మనకు ఎన్ని పండగలో కదా! వాటిలో ఈ దసరా పండగ కొంచెం డిఫరెంట్ గా వుంటుంది .  బలే సరదాక సంతోషంగా వుంటుంది. ఎన్ని పండుగలు ఉన్నా దసరా పండుగ వస్తుందంటే చాలా సంతోషంగా వుంటుంది. ఎందుకంటే ఇప్పుడే కదా మాకు సెలవులు ఎక్కువగా వస్తాయి అందుకే.  మా అమ్మగారు వాళ్ళు ఈ దసరా పండగకి వాళ్ళ అమ్మమ్మా, ఊళ్ళకి వెళ్ళేవారట. అక్కడ ఆ ఊళ్ళల్లో దసరాలు బానే చేసేవారు. పొద్దున్నే, విల్లంబులు ధరించి దసరా పద్యాలు పాడుతూ ఉపాధ్యాయుల వెంట పిల్లలు హడావుడీ చేస్తే, పులి వేషాలు, పులి డాన్సు, హరికధలు, బుర్రకధలు, కోలాటాలతో సాయంత్రము వరకు చాలా బాగా జరిగేవిట. అలాంటి పండగ విధానం మా అమ్మకూడా చూసింది నేనే చూడలేకపోయాను.  ఎందుకంటే అలాంటివి ఇప్పుడు లేవుకదా.  అవి విన్టువుంటే బలే అనిపిస్తోంది నాకు.  మనకు దసరా సందడే తెలియదు మరి.  ఇక అప్పటి రోజుల్లో పిల్లలు పాడిన దసరా పద్యాలు మరియు  పాటలు అమ్మమ్మ నాకు రాసి ఇచ్చింది అవి మీకు కూడా share చేస్తాను చూడండి.   మీకు నాలా తెలియకపోతే తెలుసుకోండి.  
ఒకవేళ మీకు తెలుసా ఒకసారి ఆ రోజులు ను ఒకసారి గుర్తు చేసుకొని.  
అప్పటి మీ అనుభవాలు నాపోస్ట్ లో కామెంట్ రూపంలో బ్లాగ్ మిత్రులతో షేర్ చేయండి.   

దసరా పద్య మరియు పాటలు.


అనయంబు మేము విద్యాభ్యాసమునకు
అయ్యవారిని చాల ఆశ్రయించితిమి
నానాటినిని మహానవమి యేతెంచు
ఈడుజోడగువార మెల్ల బాలురము
గురునకు దక్షిణల్ కోరి యీదలచి
వెరవు తొడుత మిమ్ము వేడవచ్చితిమి
పాటించి మా ముద్దు పాటలు వినుడు
మేటి కానుకలిచ్చి మెప్పు పొందరయ్య.
 
ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి
సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగాను
పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు
కొబ్బరి కురిడీలు కుండబెల్లంబు
ఏ దయా మీ దయా మా మీద లేదా?
ఇంతసేపుంచుట ఇది మీకు తగునా?
దసరాకు వస్తిమని విసవిసల్పడక
రేపురా మాపురా మళ్ళి రమ్మనక
చేతిలో లేదనక, ఇవ్వలేమనక
ఇప్పుడే లేదనక, అప్పివ్వరనక
ఇరుగుపొరుగువారు ఇస్తారు సుమ్మీ
శీఘ్రముగా పంపుడీ శ్రీమంతులారా!
 
జయీభవా విజయీ భవా
రాజాధిరాజ శ్రీరాజ మహారాజ
రాజ తేజోనిధి రాజ కందర్ప
రాజ కంఠీరవా రాజ మార్తాండ
రాజ రత్నాకరా రాజకుల తిలక
రాజ విద్వత్సభా రంజన మనోజ
రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస
సుజన మనోధీశ సూర్యప్రకాశ
నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ
ప్రకటిత రిపుభంగ పరమాత్మ రంగ
వర శిరోమాణిక్య వాణీ సద్వాక్య
పరహిత మది చిత్ర పావన చరిత్ర
ఉభయ విద్యాధుర్య ఉద్యోగధుర్య
వివిధ సద్గుణధామ విభవాభిరామ
జయీ భవా దిగ్విజయీ భవా


 “అయ్యవారికి చాలు అయిదు వరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” . 
అని పాటలు  పాడుకుంటూ బడి పిల్లలు వాళ్ళ ఉపాద్యాయులతో వారి ఇంటికి వెళ్లి పద్యాలూ పాటలు పాడేవారు.  అప్పుడు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వారికి  పప్పు బెల్లాలు, మరమరాలు కలిపి ఇచ్చేవారు.   కొందరు వారికి గిఫ్ట్స్, బుక్స్ మొదలగున్నవి ఇచ్చేవారట.   

ఈ దసరా పండగ ఉత్సవాలలో నేటికి ఆచరించుచున్నది ఒకటి మాత్రం వుంది అది ఏమిటి అంటే అదే "శ్రీ రామ చంద్ర లీల ఉత్సవాలు" పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి "రాక్షస పీడ వదిలందని" భావిస్తూ బాణాసంచాలతో వారి బొమ్మలను తగుల పెడతారు.  
అంతే కాదు మన ఇళ్ళల్లో ఈ పదిరోజులు బొమ్మల కొలువు పెడతారు.  పెరంటాళ్ళను పిలిచి వారికి వాయనాలు ఇస్తారు.  మరికొంతమంది లలితా సహస్త్రపారాయణ జరుపుతున్నారు.  పండగ పాటలు పాడుకోవటానికి మనకు అస్సలు సమయమె వుండటంలేదు.  కనీసం మన సంస్కృతి సాంప్రదయాలైనా తెలుసుకుంటున్నాం కదా దానికి మనం ఎంతో సంతోషించాలి.   

సోమవారం, సెప్టెంబర్ 30, 2013

ఊరకే దొరకునా

సోమవారం, సెప్టెంబర్ 30, 2013


ప|| ఊరకే దొరకునా వున్నతోన్నత సుఖము | సారంబు దెలిసెగా జయము చేకొనుట ||

చ|| తలపులోని చింత దాటినప్పుదు గదా | అలరిదైవంబు ప్రత్యక్షమౌట |
కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా | తలకొన్న మోక్షంబు తనకు చేకొనుట ||

చ|| కర్మంబు కసటువో గడిగినప్పుడు గదా | నిర్మల జ్ఞానంబు నెరవేరుట |
మర్మంబు శ్రీహరి నీమరగు జొచ్చినగదా | కూర్మి దనజన్మమెక్కుడు కెక్కుడౌట ||

చ|| తనశాంత మాత్మలో దగలినప్పుడు గదా | పనిగొన్న తనచదువు ఫలియించుట |
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు | తనకు నబ్బినగదా దరిచేరిమనుట ||

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)