దసరా నవరాత్రులలో రెండవరోజు అమ్మవారు గాయిత్రిదేవిగా దర్శనం ఇస్తారు. ఈమెనే నవదుర్గలలో బ్రహ్మచారినిగా కూడా అంటారు. సకల వేద స్వరూపం గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది.
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః
యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం
శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే
గాయత్రీ మాత స్తోత్రం:
నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేzక్షరీ |
అజరేzమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || ౧ ||
నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేzమలే |
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోzస్తు తే || ౨ ||
అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |
నిత్యానందే మహామాయే పరేశానీ నమోzస్తు తే || ౩ ||
త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా |
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || ౪ ||
పూషాzర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః |
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాzప్సరసాం గణాః || ౫ ||
రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ |
ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ || ౬ ||
త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః |
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || ౭ ||
త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ |
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ || ౮ ||
తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా |
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే || ౯ ||
చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |
స్వాహాకారేzగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || ౧౦ ||
నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ |
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || ౧౧ ||
అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ |
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || ౧౨ ||
బ్రహ్మచారిణి
నవదుర్గాలలో ఈమెను బ్రహ్మచారిణి అని అందురు. 'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.
గాయిత్రిదేవికి పసుపు రంగు తో చేసిన పులిహోర, పులగము నివేదనగా అర్పిస్తారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.