ఆరవరోజు న మూలా నక్షిత్రము కదా సరస్వతి పూజ ఈ రోజు చేస్తారు. పిల్లలు కు మంచి చదువులు రావాలని కోరిన విద్యలు వారికి రావాలంటే సరస్వతి మాత కరుణకావాలి ,ఈ మాతను కొలచిన సకల విద్యలు ప్రసాధిస్తుంది. ఈమె తెల్లని వస్త్రదారిని అయ్యి. ఒక చేతితో వీణను మీటుతూ పుస్తకదారియై మనకు దర్శనము ఇస్తుంది .ఈమెకి హంసవాహనము. ఈమాత త్రిమూర్తులలో బ్రహ్మదేవుని అర్ద్దంగి. పరాశక్తి మొదట దరించిన ఐదు అవతారలలో సరస్వతి మాత అవతారము ఒకటి. సరస్వతి మాత కేవలం చదువులు ప్రసాధించేది మాత్రమే కాదు సర్వశక్తులు యుక్తులు ప్రసాధిస్తుంది.
సరస్వతీ వందన మంత్రం అధిక జ్ఞానం మరియు విజ్ఞత కోసం వల్లించే ముఖ్యమైన హిందూ మంత్రం.సరస్వతీ దేవి చదువులకి మరియు కళలకి అధిదేవత. భారతదేశంలో సంగీతకారులు నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ మార్గదర్శకత్వం మరియు జ్ఞానం కోసం ఆమెని పూజిస్తారు. సరస్వతీ వందన మంత్రాన్ని ఆమె భక్తులు ప్రతి ఉదయం శుభంకోసం వల్లిస్తారు.కేవలం పాట అనే అర్థం గల వందనానికి ప్రతి ఒక్కరు భిన్న విధాలను పాటిస్తారు. కనుక విద్యార్థిగా నువ్వు భౌతిక జ్ఞానాన్ని కోరుకుంటే, సంగీతకారుడు సరైన తాళాలని మొదలైన వాటిని కోరుకుంటాడు.
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా,వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి".
సరస్వతీ వందన మంత్రం:
యా కుందేందు తుషార హార-ధవళా,
యా శుభ్ర-వస్త్రా'వ్రిత
యా శుభ్ర-వస్త్రా'వ్రిత
యా వీణా-వర-దండ-మండితకర,
యా శ్వేత పద్మా'సన
యా బ్రహ్మా'చ్యుత శంకరః ప్రభ్రితిభిర్ దేవై-సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేష జాడ్యా-పహా.
తెలుగు లో అనువాదం:
పద్మము, చంద్రుడు, ఉదయపు పుష్పాల వంటి తెలుపుదనం కలిగినది;
వీణని చేత ధరించి, తెల్లని పద్మాసనం మీద కూర్చున్నది;
బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులతోపాటు దేవతలందరితోను నిత్యం పూజించబడేది;
ఓ తల్లి నా మానసిక జడత్వాన్ని తొలగించు
శుక్లాం బ్రహ్మ విచార సార పరమ మద్యం జగద్వ్యాపిని,
హస్తే స్ఫతిక్ మాలికం కమలం పద్మాసనే సంస్తితం .
వందేతం పరమేశ్వరీ భగవతీ.....
సా మాం పాతు సరస్వతీ భగవతీ బుద్ధి ప్రదం శరదాం.
కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులమునందలి గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన. ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.
కాత్యాయని దేవి మంత్రం:
చంద్రహాసోజ్వలకరా శార్దులపర వాహనా l
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినిll
ఈనాడు ఈమెకు కేసరి బాత్ నివేదన అర్పిస్తారు .
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.