మూలా నక్షిత్రము కదా సరస్వతి పూజ ఈ రోజు చేస్తారు. పిల్లలు కు మంచి చదువులు రావాలని కోరిన విద్యలు వారికి రావాలంటే సరస్వతి మాత కరుణకావాలి ,ఈ మాతను కొలచిన సకల విద్యలు ప్రసాధిస్తుంది. ఈమె తెల్లని వస్త్రదారిని అయ్యి. ఒక చేతితో వీణను మీటుతూ పుస్తకదారియై మనకు దర్శనము ఇస్తుంది .ఈమెకి హంసవాహనము. ఈమాత త్రిమూర్తులలో బ్రహ్మదేవుని అర్ద్దంగి. పరాశక్తి మొదట దరించిన ఐదు అవతారలలో సరస్వతి మాత అవతారము ఒకటి. సరస్వతి మాత కేవలం చదువులు ప్రసాధించేది మాత్రమే కాదు సర్వశక్తులు యుక్తులు ప్రసాధిస్తుంది.
సరస్వతీ వందన మంత్రం అధిక జ్ఞానం మరియు విజ్ఞత కోసం వల్లించే ముఖ్యమైన హిందూ మంత్రం.సరస్వతీ దేవి చదువులకి మరియు కళలకి అధిదేవత. భారతదేశంలో సంగీతకారులు నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ మార్గదర్శకత్వం మరియు జ్ఞానం కోసం ఆమెని పూజిస్తారు. సరస్వతీ వందన మంత్రాన్ని ఆమె భక్తులు ప్రతి ఉదయం శుభంకోసం వల్లిస్తారు.కేవలం పాట అనే అర్థం గల వందనానికి ప్రతి ఒక్కరు భిన్న విధాలను పాటిస్తారు. కనుక విద్యార్థిగా నువ్వు భౌతిక జ్ఞానాన్ని కోరుకుంటే, సంగీతకారుడు సరైన తాళాలని మొదలైన వాటిని కోరుకుంటాడు.
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా,వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి".
నవ దుర్గాలలో ఏడవ రోజు "కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు. కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.
కాళరాత్రి :
కాళరాత్రి :
'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ '
ఈమెకి నివేదనగా కదంబం అర్పిస్తారు.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.