Blogger Widgets

శనివారం, డిసెంబర్ 18, 2021

కురియుము కురియుము వర్షము! (ఆళి మళైక్కణ్ణా! పాశురము)

శనివారం, డిసెంబర్ 18, 2021

గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటలతో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు.  ఈ వ్రతమునకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు .  వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు.  మరి ఈ పాసురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము.

ఆళి మళైక్కణ్ణా! పాశురము:

ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము 
గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా!  నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు.  గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను వ్యాపింపచేయును.  సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షదారాలు  లోకమునంతను సుఖింపజేయునట్లును.  మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ ఈ పాశురములో ప్రార్దించుచున్నది.  

కురియుము కురియుము వర్షము!

కురియుము కురియుము వర్షము!
వరలగ జగతికి హర్షము!
ఓయి గంభీర హృదయ!
ఓహో వర్ష నిర్వాహ          ||కురియుము||

మురిసి మార్ఘశిరస్నాన
మును మే మొనరుప తడియక      ||కురియుము||

జలనిధిలో జొరబడి, అట సలిలమెల్ల త్రాగిత్రాగి,
ఫెళఫెళమని గర్జింపుచు, బిరబిర పై కెగసి ఎగసి,
అల కాలోపలక్షిత జగత్కారణుని మూరితి
నలె నీమెయి నీల నీలవర్ణముతో తేలతేల     ||కురియుము||

సుందరపటుబాహువు అరవిందనాభు మేటికరము
పొందిన శ్రీ సుధర్శనము పొలుపున తళతళామెరసి,
క్రందుగ దక్షిణావర్తమగు శ్రీ పాంచజన్యమ్ము
చందమ్మున ఉరిమి, శర్జమట్లు అంపజడుల చిమ్మి           ||కురియుము||

శుక్రవారం, డిసెంబర్ 17, 2021

ఎనలేని సిరులతో నిండును ఈ సీమ (*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి)

శుక్రవారం, డిసెంబర్ 17, 2021

 రెండవ పాశురములో మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా.  మరి వ్రతము ఒక ఫలాపేక్ష తో చేస్తున్నాము కదా! మరి ఆ వ్రత ఫలము ఎలావుండాలి?  ఆ ఫలము ఎలావుండాలో? మూడవ పాశురము లో తెలుపుతారు మన అమ్మ గోదాదేవి .  అయితే ఈ పాశురము విశేషము కలది .  ఈ విశేష పాసురమునకు  చక్కేరపోంగాలిని స్వామివారికి  నివేదించాలి.

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
 నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
 తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
 ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
 పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
 తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
 వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
 నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము
పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను.  బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు.  అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి.  చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను.  అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను.  పాలు పితుకువారు  పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను.  స్థిరమైన  సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.
ఎనలేని సిరులతో నిండును ఈ సీమ 

ఎనలేని సిరులతో నిండును ఈ సీమ 
ఈతిభాధలు కలుగకుండును 
మునుకొని త్రివిక్రముని నామములు పాడి 
మొనసి మా నోమునకు తానా మాడితిమేని || ఎనలేని || 

నెలనెలా మూడువానలు కురియును,
బలిసి ఏపుగా పైరు లెదుగును,
అల పైరుసందులను మీ లెగురును,
కలువల ఎలతేoట్లు  కనుముయూను  || ఎనలేని || 

కడిగి కూర్చుండి పొంకంపు చన్నులను
ఒడిసి, పితుకగ, పట్టి - రెండు చేతులను,
ఎడము లేకుండ పెను జడుల ధారలను
కడవల ఉదార గోక్షీరములు కురియును  || ఎనలేని || 

గురువారం, డిసెంబర్ 16, 2021

వినరమ్మ మననోము తీరు ( వైయత్తు వాళ్ వీర్గాళ్ పాశురము)

గురువారం, డిసెంబర్ 16, 2021

మొదటి పాటలో తామేమి పొందదలచి ఈ వ్రతం చేయదలచుకున్నారో , ఈ వ్రతమునకు సాయపడువారు ఎవరో, ఆ వ్రతమును జేయుటకు తమకు ఏమి అధికారమో వివరించినారు. ఈ దినము ఒక కార్యము చేయ దలచుకున్నప్పుడు ముందుగా తెలుసుకోవలసినవి ఆ మూడే. ఏ ఫలము కాంక్షించి ఈ కార్యము చేయుచున్నామో తెలిసి ఫలము తప్పక పొందదగినదె అని తెలిసిన కాని కార్యము నందే వరికిని ప్రవృత్తి కలగదు. ఆ ఫలము మంచిదే అని తెలిసినా తముచేయగలమా , చేయలేమా , మద్యలో శక్తి లేక మాని నవ్వులపాలగుదురు. దానికి కావలసిన పరికరాలు సమకుర్చుకో గలమో లేమో నిర్నయిమ్చుకోవాలి . ఆ కార్యము చేయుటకు తనకు గల అధికారాన్ని తెలుసుకోవాలి .
ఇవన్నీ సమకుర్చగలది కేవలము కృష్ణుడే అని తెలిసిన నీకు అన్ని సమకురినట్లే.  దీనికి శ్రీ కృష్ణుడే ఉపాయం , శ్రీ కృష్ణుని పాడుటయే ఫలమని విశ్వసించి వానిని కైమ్కరమునదే రుచిగాగల నియామాలుందున ? అసలు నియమాలు పాటించాలా? వారు గొల్లపిల్లలు కదా ? వారికి నియమాలు ఎలాతెలియును?  వీటన్నిటికీ ఒకటే ఉపాయమున్నది. భగవంతునిపై భక్తి , పరిసుద్దమైన మనసు కలిగిన చాలు . కాని భక్తులు భాగాత్స మ్రుద్దికి భగవద్భాక్తులు ఆనందముగా కొన్ని నియమాలు పాటించుదురు .

వైయత్తు వాళ్ వీర్గాళ్ పాశురము:

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్ 

తాత్పర్యము :
శ్రీ కృష్ణుడు అవతరించిన కాలములో పుట్టి దుః ఖమగు ఈ ప్రపంచములో కుడా ఆనందమునే అనుభావిమ్చుచున్న వారలారా ! మేము మావ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు:-
పాలసముద్రములో ద్వనికాకుండా మెల్లగా పడుకోనివున్న ఆ పరమ పురుషుని పాదములకు మంగళము పాడదేము . ఈ వ్రతసమయములో నేతిని కాని పాలను కాని మేము ఆరగింపము . తెల్లవారు జామున స్నానము లు చేసెదము . కంటికి కాటుక పెట్టుకోము . కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరించని పనులు మేము ఆచరించము . ఇతరులకు బాద కలిగించెపనులు మేము చేయము. అసత్యాలాడము. ఎచ్చటా పలుకము.ఙానులకు అధిక ధన ధాన్యాధులు తో సత్కరించుదుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షలను ఉంచుధుము. మీము ఉజ్జీవించు విధముగానీ పర్యాలోచన చేసికొనెదము. దీనిని అంతావిని మీరానదింప కోరుచున్నము.

సిరినోములో  వినరమ్మ మననోము తీరు

వినరమ్మ వినరమ్మ మననోము తీరు
పనిబూని చేసిన మన సిరులు మీరు !

అల పాలకడలి ఊయెల శేషశయ్యపై
అలవోక నిదురించి హరి శ్రీపదాబాల
తలచుకొనుచు, సారె కొలుచుకొనుచు,
తొలవేగుబోక నీరాడవలె చెలులార! || వినరమ్మ ||

వలదు క్రోలగ పాలు, వలదు త్రాపగ నేయి!
వలదు కాటుకపూత మన కన్నుదోయి !
అలరులుకై సేయవలదు క్రొమ్ముడులలో!
లలనలార! నోము నోచినదినాలలో || వినరమ్మ ||

పరామాత్ముడౌ ప్రభువు సరస , పరులపై
దురుసుమాటలు  నోట తొడుగరా దమ్మ!
దరియనీరాదు ఘనులొల్లని పనులను!
జరుపవలె ముదమున దానధర్మములను || వినరమ్మ ||

బుధవారం, డిసెంబర్ 15, 2021

సిరినోము చేసే సమయం వచ్చింది (మార్గళి త్తింగళ్ పాశురము)

బుధవారం, డిసెంబర్ 15, 2021

  ధనుర్మాసం మొదలు  అయ్యింది కదండి. ఈ నెలరోజులు పాశురాలు పాడతాము కదా.  అయితే మరి మొదటి పాశురం గురించి తెలుసుకుందాం.

గోపికలును గోదాదేవి ఈ వ్రతం గురించి ముందుగా వారు మార్గశిరమాసం గురించి ఆ వ్రతం చేయుటకు అనుకూలంగా వుందని కాలాన్ని వారు పొగిడారు.  తరువాత ఈ వ్రతం ఎవరు చేస్తారో దాని వల్లన కలుగు ఫలితం గురించి తెలుసుకున్నారు.  ఆవిషయాన్ని మొదటి పాశురంలో చెప్పదలచారు.  
                                    మొదటి పాశురం లో మనకు  నారాయణ తత్వము కనిపిస్తుంది. 

మార్గళి త్తింగళ్ పాశురము :
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .
పాశురం తాత్పర్యము:  
ఒహ్హో మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజులు  . ఓ! అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ! బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్న సంకల్పమున్నచో రండు. ముందునడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపదరాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించని మనకే , మనమాపేక్షెంచు వ్రతసాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చేయుటను చూచి లోకులందరు సంతోషించునట్లు మీరు అందరూ కూడా చేరి ఈ వ్రతము చేయండి అని భావము.

సిరినోము  చేసే సమయం వచ్చింది 

సిరినోము 

రారమ్మా ఓ అమ్మలారా! రారే మమ్మ!
నీరాడ మనసున్నవారు, మీరూ  మీరూ !
శ్రీరమ్యమైన మన వ్రేపల్లెలోన
చేరి, కన్నియలార! కూరిమి చెలులార !   !!రారమ్మ !!  

ఇది మార్గశిరము , వెన్నెలవేళ , భాసురము !
ఇది పరవాద్య వ్రతారంభ వాసరము !
మదిలోన జగమెల్ల ముదమంది పొగడ ,
కదిసే కంకణ కటక కింకిణులు కదల  !! రారమ్మ !!

మరీమరీ కనికనీ మెరిసేటి కనులతో 
మురిసే యశోదమ్మ ముద్దు సింగపుకొదమ,
కరిమొయిలు మెయిహోయలు  గల అందగాడు,
వరదుడౌ మనరేడు వ్రతమేలువాడు !! రారమ్మా !!

కరమందు కరకువాల్ కాపుగా దాలిచి 
వారాలేటి మేటినందుని నందనుండు 
అరుణశశిబింబనిభ శుభవదనుడు 
సరసిజాక్షుడే నోము కరుణింపగా !! రారమ్మ !!

ధనుర్మాసం మొదలు కాబోతుంది.

 ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాసం వచ్చింది దనుర్మాసం కూడా మొదలు కాబోతుంది. ఎంతో విశేషమైన రోజులు.  ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి పాడిన ౩౦ పాశురాలును పాడతారు  ఇది చాలా విశేషమైననెల. 

అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజులు రోజుకు ఒక పాశురమ్  చదువుతారు . ఇలా 30 రోజులు పాశురములు నివేదిస్తారు.
శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .

మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే  ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి.  తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి  కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది.  మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం.  ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను.
.
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.  

శుక్రవారం, నవంబర్ 12, 2021

శీతాకాలంలో తీసుకోవలసిన చర్మరక్షణ ....మధుమేహులకు ప్రత్యేక శ్రద్ధ ఎలా?(win...

శుక్రవారం, నవంబర్ 12, 2021

                        

శీతాకాలం లో తీసుకోవలసిన చర్మ రక్షణ
మధుమేహులకు ప్రత్యేక శ్రద్ధ ఎలా?
ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ తో మీముందుకు శీతాకాలం చర్మరక్షణ అన్న విషయంతో మీ ముందుకు వచ్చాను.  మధుమేహులు తీసుకోవలసిన ప్రత్యేక రక్షణ ఎలా తీసుకోవాలి మొదలగు విషయాలు చెప్పాను ఈ వీడియో పూర్తిగా చూసి  మీ సలహాలు సూచనలు తెలపండి ధన్యవాధములు. 

బుధవారం, నవంబర్ 10, 2021

షుగర్ డౌన్ అంటే ఏమిటి?అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

బుధవారం, నవంబర్ 10, 2021

ఉన్నట్టుండి ఒక్కసారిగా షుగర్ డౌన్ అయితే వెంటనే మనం ఏమి చెయ్యాలి.  
అసలు షుగర్ డౌన్ అంటే ఏమిటి?
అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

My silk thread jewelry

My silk thread jewelry 


బుధవారం, నవంబర్ 03, 2021

దీపావళి కి డయాబెటిక్ స్పెషల్ 5 రిసిపీస్(Top 5 healthy snacks for diwali)

బుధవారం, నవంబర్ 03, 2021

Hii all welcome to my channel Diabetic Challenger, Today I came with top 5 healthy snacks which are diabetic friendly, sugar free which can be made in less than 30 minutes. Kids with type 1 diabetic can also enjoy the snacks, Plz watch full video and give your valuable likes, and comments thank you. Once again wish you all a Happy Diwali.

సోమవారం, నవంబర్ 01, 2021

దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!

సోమవారం, నవంబర్ 01, 2021

Diwali Crackers

దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
కాని దీపావళికి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.

దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదశి నాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి.
నరకచతుర్దశిని ప్రేతచతుర్దశి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తొలి  జాములో నువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలో నువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో
ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్య్రం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆలోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రకృతి  సామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకం భయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకుంటాముట . స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణాలు ఇవ్వాలి.

ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః

దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించి శ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,

సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే .  
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం.   ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగాఅయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు.    
దీపావళి శుభాకాంక్షలు

ఆదివారం, అక్టోబర్ 31, 2021

అండుకొర్రలు గురించి అన్నివిషయాలు.......(Healthy facts about browntop mil...

ఆదివారం, అక్టోబర్ 31, 2021

శుక్రవారం, అక్టోబర్ 29, 2021

మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకుడదు?

శుక్రవారం, అక్టోబర్ 29, 2021

 మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకుడదు? ఎలా తినాలి మరి 🍚(White rice is good or bad)

ఈరోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన విషయం

గురించి మాట్లాడానండి. అదేమిటంటే మధుమేహులు వైట్ రైస్ ఎందుకు తినకూడదు. తినాలి అనుకుంటే ఎలా వండుకు తింటేమంచిది. అసలు ఏ రైస్ తింటే మంచిది. ఇంకా చాలా టిప్స్ తో ఆరోగ్య విలువలుతో ఎన్నోవిషయాలు చెప్పాను. ఈవీడియో చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి మరి.

శనివారం, అక్టోబర్ 02, 2021

ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్ (Protein Rich Breakfast)

శనివారం, అక్టోబర్ 02, 2021

శుక్రవారం, సెప్టెంబర్ 24, 2021

మధుమేహులు జిం లో థ్రేడ్ మిల్ చేయవచ్చా! ఎప్పుడు చేయచ్చు ? ఎప్పుడు చేయకూడ...

శుక్రవారం, సెప్టెంబర్ 24, 2021

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. మధుమేహులు జిం లో థ్రేడ్ మిల్ చేయవచ్చా! థ్రెడ్ మిల్ ఎలా చేయాలి? ఎంతసేపు చేయాలి?

బుధవారం, ఆగస్టు 25, 2021

దాల్చినచెక్క బాదం పాల టీ ( Cinnamon Almond Milk Tea)

బుధవారం, ఆగస్టు 25, 2021

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. దాల్చినచెక్క బాదం పాల టీ మధుమేహులు టీ తాగవచ్చు. అందువల్ల ఆరోగ్యానికి(healthy) మంచిది (good for health)రుచికరమైన(tasty) దాల్చినచెక్క బాదం పాల (cinnamon badam milk tea)టీ తయారుచేసుకుందాము. Diabetic friendly tea.Very easy and healthy to make and it is lactose free https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

మంగళవారం, జులై 20, 2021

ఎనిమిది ఆహారపదార్ధాలతో మధుమేహులు తీపి తినాలనే కోరికకు స్వస్తి చెప్పేయండి...

మంగళవారం, జులై 20, 2021

బుధవారం, జూన్ 30, 2021

బ్లడ్ గ్లూకోజ్ మీటర్‌తో సమస్యలు 1 నుండి 9 (Errors in blood glucose meter...

బుధవారం, జూన్ 30, 2021

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. మనలో చాలా మందికి ఇంట్లోనే గ్లూకోమీటర్(glucometer) ను వుపయోగించి రక్తంలో షుగర్(Blood sugar testing) ని పరీక్షించుకోవటం తెలుసు. కానీ చాలా మందికి గ్లూకోమీటర్ లో ఒక్కొక్కసారి ఎర్రర్స్(errors) ని చూపిస్తుంది. కానీ అవి ఏమిటి అన్నది తెలియదు. ఈరోజు మనం ఆ errors గురించి తెలుసుకుందాం.(today i our video lets see the errors and solutions for that errors)

సోమవారం, జూన్ 28, 2021

నోరూరించే లో - కార్బ్, లో - కేలరీ ,హై - ప్రోటీన్ క్రీమీ మష్రూం సూప్ (Cre...

సోమవారం, జూన్ 28, 2021

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. మిడ్ మోర్నింగ్ స్నాక్ నోరూరించే లో కార్బ్ - లో కేలరీ - హై ప్రోటీన్ క్రీమీ మష్రూం సూప్ తయారుచేసుకుందాం. https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

ఆదివారం, జూన్ 27, 2021

ఇంట్లోనే వుండి షుగర్ ని టెస్ట్ చేసుకోవటం ఎలా? @ Glucometer. (How to chec...

ఆదివారం, జూన్ 27, 2021


PLZ LIKE,SHARE,SUBSCRIBE MY CHANNEL
sugartest #glucometer #bloodglucoselevels#GlucoseSugarTestMachine#bloodsugar #bloodsugarlevel #bloodsugartest నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఇంట్లోనే వుండి షుగర్ ని టెస్ట్ చేసుకోవటం ఎలా? ఈరోజు మనం సింపిల్ గా ఇంట్లోవుండి షుగర్ ఎలా వుంది అన్నది గ్లూకోమీటర్ వుపయోగించటం ఎలాగో తెలుసుకుందాం.(Testing glucose at home with easy tips with glucometer) https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

శుక్రవారం, జూన్ 25, 2021

మధుమేహులకు మరియు అధికబరువు తగ్గాలి అనుకునేవారికి పనస చపాతి ( Jackfruit R...

శుక్రవారం, జూన్ 25, 2021

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. #diabetes #jackfruit # jackfruit roti # diabetic roti # diabetic chapati #weight loss roti #jackfruitpowder #jackfruitroti #loseweight #diabeticdiet #weightlossdiet నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. ఈరోజు మనం మధుమేహులకు (Diabetes) మరియు అధిక బరువు (over weight) కలిగినవారు బరువు తగ్గటానికి (weight loss) బాగా వుపకరించే రోటి (Roti) చేసుకోబోతున్నాం. అది కూడా చాలా ప్రత్యేకమైన పదార్ధం ఆడ్ చెసి. అదేంటో వీడియోలో చూడండి. https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/ For Jackfruit flour: https://www.amazon.in/Eastern-Jackfru...

గురువారం, జూన్ 24, 2021

బాదం పప్పులోని రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో (The secrets of almonds)

గురువారం, జూన్ 24, 2021

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి (Diabetic Challenger Channel).స్వాగతం. బాదం పప్పులోని రహస్యాలు (The secrets of almonds)ఎన్నో ఎన్నెన్నో బాదాం పప్పుల్లోని రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధుమేహులు తినవచ్చా తినకూడదా(Can Diabetics eat badam.). తింటే ఎలా తినాలి. ఇలాంటి ఇతర ఇతర విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. https://www.facebook.com/sree.vaishnavi https://twitter.com/sreevaishnavi https://www.instagram.com/diabetic_ch... http://laharicom.blogspot.com/

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)