గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటలతో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు. ఈ వ్రతమునకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు . వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు. మరి ఈ పాసురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము.
ఆళి మళైక్కణ్ణా! పాశురము:
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము
గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా! నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు. గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను వ్యాపింపచేయును. సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షదారాలు లోకమునంతను సుఖింపజేయునట్లును. మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ ఈ పాశురములో ప్రార్దించుచున్నది. కురియుము కురియుము వర్షము!
కురియుము కురియుము వర్షము!
వరలగ జగతికి హర్షము!
ఓయి గంభీర హృదయ!
ఓహో వర్ష నిర్వాహ ||కురియుము||
మురిసి మార్ఘశిరస్నాన
మును మే మొనరుప తడియక ||కురియుము||
జలనిధిలో జొరబడి, అట సలిలమెల్ల త్రాగిత్రాగి,
ఫెళఫెళమని గర్జింపుచు, బిరబిర పై కెగసి ఎగసి,
అల కాలోపలక్షిత జగత్కారణుని మూరితి
నలె నీమెయి నీల నీలవర్ణముతో తేలతేల ||కురియుము||
సుందరపటుబాహువు అరవిందనాభు మేటికరము
పొందిన శ్రీ సుధర్శనము పొలుపున తళతళామెరసి,
క్రందుగ దక్షిణావర్తమగు శ్రీ పాంచజన్యమ్ము
చందమ్మున ఉరిమి, శర్జమట్లు అంపజడుల చిమ్మి ||కురియుము||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.