Blogger Widgets

ఆదివారం, డిసెంబర్ 18, 2011

తిరుప్పావై ఛతుర్థ పాశురము

ఆదివారం, డిసెంబర్ 18, 2011

గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటల తో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముంకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు.  ఈ వ్రతము నకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు .  వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు.  మరి ఈ పాసురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము.
పాశురము 
   ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్ 


ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:  గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా!  నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు.  గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను వ్యాపింపచేయును.  సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షదారాలు  లోకమునంతను సుఖింపజేయునట్లును.  మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ ఈ పాశురములో ప్రార్దించుచున్నది.  


విశేషార్ధము:
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్:
ఈ గోపికలు వర్షాధిదేవుడగు పర్జన్యుని సంభోదించుచున్నారు.  ఆళి=సముద్రము వలె గంభీర్య వైశాల్యములు కలవాడు పర్జనుడు అని భావము.
ఆళి ఉళ్ పుక్కు:
సముద్రము మద్యలోనికి ప్రవేసించి,  సముద్రములో నీరు త్రాగుటకు పైపై ఒడ్డున తాగరాదు.  చిన్నచిన్న గుంటలు, పడియలలో, చెరువులలో, నదులలో నీరు త్రాగరాదు.  సముద్రములో మధ్యకు పోయి అగాధముగా నుండు చోట లోనికి చొచ్చి నీటిని త్రాగవలె.
ముగందు కొడు:
పూర్తిగా సముద్రజలమును త్రాగీ- గోపికలు మేఘముతో సముద్రపు నడిబొడ్డున చొచ్చి జలమునంతా ఇసుకతగిలే వరకు నీటిని త్రాగామంటున్నారు.
ఆర్తు  ఏఱి:
గర్జించి మిన్నంది.  ఓ మేఘమా ! నీవు సముద్రజలమును తృప్తిగా తాగిన తరువాత ఒక్కసారిగా గర్జించాలి.  మనము బోజనము చేసినతరువాత త్రేనుపు వస్తుంది అటువంటి శబ్ధము.
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు:
కాలమునకు కారణమైన బ్రహ్మతత్వముయొక్క రూపమువలె నీ శరీరమును నల్లగా చేయవలె. 
 "బ్రహ్మవేద బ్రహ్మైవభవతి" బ్రహ్మ నెరిగినవాడు బ్రహ్మ స్వరూపమునే పాడుతాడు అని ఉపనిషత్తు చెప్పుతుంది.
జలము త్రాగిన మేఘము నీలముగా మారును అది చల్లగా వుండును.
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని:
విశాలమగు సుందరమగు బాహువులుగల పద్మనాభుని చేతిలోని చక్రమువలె మెరిసి, వర్షించవలె.  ఆకాశమున అధిరోహించిన మేఘము నల్లగా వుంది వర్షించుటకు ముందు మెరయును.  ఆ మెరుపు పద్మనాబుని చేతిలోని చేక్రపు మెరపువలె ఉండాలి.  పరమాత్మ బాహువులు విశాలములు సుందరములు అనిచేప్తున్నారు.
 వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు:
దక్షణావర్త  శంఖము వలె నిలిచి గర్జించి. మేఘము మేరయుట ఘర్జించుట సహజమే.  కానీ మన గోపికలు శ్రీ మన్నారాయుణుని చేతిలోని చక్రంవలె  మెరవాలిట.   శంఖమువలె గర్జించవలెను అని వారి కోరిక.
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ :

శారంగమను విల్లు బాణములను వర్షించునట్టు వర్షము వర్షించాలి అని భావము.
నాంగళుమ్ మార్గళి నీరాడ మగిళుందేలోర్ :
ఆ వర్షానికి మేము ఆనందముగా మార్గశిర స్నానము చేయాలి అని అనుకుంటున్నారు.




జై శ్రీమన్నారాయణ్

శనివారం, డిసెంబర్ 17, 2011

తిరుప్పావై తృతీయ పాశురము

శనివారం, డిసెంబర్ 17, 2011

రెండవ పాశురములో మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా.  మరి వ్రతము ఒక ఫలాపేక్ష తో చేస్తున్నాము కదా మరి ఆ వ్రత ఫలము ఎలావుండాలి మరి. ఆ ఫలము ఎలావుండాలో మూడవ పాశురము లో తెలుపుతారు మన అమ్మ.  అయితే ఈ పాశురము విశేషము కలది  అయితే చక్కేరపోంగాలి నివేదించాలి స్వామికి. మరి ఆ పాశురము ఇదిగో.....   
పాశురం:
  ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
 నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
 తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
 ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
 పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
 తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
 వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
 నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్



తాత్పర్యము:   పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను.  బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు.  అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి.  చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను.  అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను.  పాలు పితుకువారు  పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను.  స్థిరమైన  సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.

విశేషార్ధము:  
1 ) ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి:
పెరిగి లోకములు కొలిచిన ఉత్తముని పేరు పాడి మేము ఈ వ్రతమునకు స్నానమాచరించుతుము.  పుట్టుట-ఉండుట-పెరుగుట-మారుట-తరగుట-లేకుండుట అనునవి ఆరు ప్రకృతి వికారాలు అలాంటి వికారాలు లేని స్వామీ మనకోసం వచ్చి పెరిగాడని గోపికలు సంతోషించారు.
2 )నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్:
మేము మావ్రతమునకు అని, మిష పెట్టి స్నానము చేసినచో లోకమంతయు సుఖముగా వుండును.  మేము-మావ్రతము గొప్పవని చెప్పుకుంటున్నారు.
3 ) తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు:
ఎటువంటి బాదలు లేకుండా దేశమంతా నెలకు మూడు వానలు పాడుటను.   ఈవ్రతం వల్లన లోకములో పాడి పంట సమృద్దిగా వుండును.
4 ) ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ: 
పెరిగిన పెద్దపెద్ద వరిచేనులో చేపలు త్రుళ్ళిపడును.  చేను పెద్దగా పెరుగుట, అడుగున నీరు సమృద్దిగా ఉండుట, పంటకు విశిష్టత.  అట్టివిశిష్టత ఈ వ్రతము వాళ్ళ కలుగును అని భావం.
5 )పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప:
పూచినా కలువ పువ్వులలో లేదా సుందరమైన కలువపూలలో అందమయిన తుమ్మెదలు ఒకదానితో ఒకటి కలహించుకోనుచూ నిద్రిస్తున్నవి.   వారి చేనులో నీరు అధికముగా వుండుట వాళ్ళ కాలువలు ఎక్కువున్నాయి.  వాటిలోని మకరందము కోసం తుమ్మెదలు వస్తున్నాయి.  అంటే వారి ఊరిలో పాడియోక్క వైబోగం చెప్తున్నారు.
6 )తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ:
ఎటువంటి జంకూలేకుండా కోట్టములోకి వెళ్లి కుర్చోనిన బాగా బలసిన చనుకట్లు పట్టి పాలు పిండగా  అక్కడ ఆవులు కుండలు కుండలు పాలు ఇస్తున్నాయి.  ఆ రేపల్లేలో గోవులు సమృద్దిగా వున్నవి అని.
7 )క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్ 
    నీంగాద శెల్వం నిఱైందే:
కుండలు నిండునట్లు పాలను ఇస్తున్న ఉదారములగు పశువులు, తరగని సంపద, నిండియుండును.

జై శ్రీమన్నారాయణ్

Flights of Inspiration.

ఇది అంతా ఏమిటనుకుంటుంన్నారా మనము  ప్రపంచంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి flights లో వెళ్ళిపోతున్నాము.  మొట్టమొదట ఆకాశంలో ఎగిరే విమానాన్ని Wright Brothers కనుక్కున్నారని అందరికి తెలుసు.  మరి ఆ విమానాన్ని తయారు చేయటానికి వారు చాలా కష్ష్టపడ్డారో చెప్పలేము.  వారు కృషి వుంటే సాధించలేనిది లేదు అని నిరూపించారు. 
వారు తయారుచేసిన మొదటి విమానం యొక్క డిజైన్. పక్షి ఎగురుటను inspiration గా వారు తీసుకుని డిజైన్ చేసారు.  క్రింద డ్రాయింగ్ 1903 ఫ్లైయర్ ది అని గుర్తించిన రేఖాచిత్రం ఇది. ఇది గోధుమ రంగు కాగితంపై పెన్సిల్ ఉపయోగించి రైట్ బ్రదర్స్ ద్వారా డ్రా చేయబడినది.  కాగితంపై మూడు అభిప్రాయాలుఉన్నాయి. టాప్ వీక్షణ ఫ్లైయర్ లోకి డౌన్ గురించి ఒక "bird's-eye" లా వుంటుంది. ( ఫ్లైట్ లోమొదటి చూసిన మానవులు మీద పక్షి యొక్క ప్రతిచర్య ఇమాజిన్!)  వారు ఆ ఫ్లైట్ కు ఏమి ఉపయోగిమ్చారంటే వాటి సైజెస్ ఇవే.


No blueprint or other drawing of the 1903 Flyer exists.
Some technical specifications for the Flyer:
1 )Gasoline-powered engine weighed 179 pounds, delivered 12 horsepower 
2 propellers, each 8.5 feet in diameter 
2 )ropeller made of 3 layers of 1 1/8 inch spruce, glued together, shaped with hatchet and drawshave .
3  )Wingspan = 40 feet, 4 inches .
4 )Chord = 6 feet, 6 inches .
5 )Wing camber = 1:20 .
6 )Total wing area = 510 square feet .
7 )Horizontal forward rudder = 48 square feet .
8 )Distance from nose to tail = 21 feet, 1 inch .
9 )Unmanned weight = 605 pounds (including engine, propellers, and chain drive)
10 )Wing skeleton covered with white French sateen fabric .
11 )Propeller shafts made of steel .


ఇవి ఉపయోగించి 1902 డిసెంబర్ 17 న Wright Brothers నింగిలో ఎగురవేసి వారి కలను నిజం చేసుకున్నారు.  నిజంగా ఆనాడు వారికి అది కల కానీ నేడు మనకు వేరేదేశాలకు వెళ్ళాలి అంటే మనకు అవసరంగా వుంది. నిజంగా వారు చాలా గ్రేట్.
 Heads  of  to  Wright  brothers .

శుక్రవారం, డిసెంబర్ 16, 2011

ప్రత్యేక పాశురము-ప్రత్యేక నివేదన

శుక్రవారం, డిసెంబర్ 16, 2011


ధనుర్మాసవ్రతము ప్రతీదినము పొంగలి నివేదన అర్పిస్తాము.  కానీ కొన్ని ప్రత్యేక పాశురము లకు ప్రత్యేక నివేదన గోదాసహిత రంగనాదునకు అర్పించాలి.  మరి ఆ ప్రత్యేక పాసురాలు వాటికి అర్పించవలసిన నివేదనలు ఏమిటంటే.....

రోజు  పాశురము ప్రసాదము
మూడవ పాశురము ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి చక్కరపొంగాలి
ఏడవ పాశురము కీశు కీశెన్ఱెంగుం  పులిహోర
పన్నెండవ పాశురము కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి చక్కరపొంగాలి
పదహారవ  పాశురము నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ పులిహోర, దద్యోజనము, చక్కెరపొంగలి 
పద్దెనిమిదవ పాశురము ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్  చక్కరపొంగాలి
ఇరవైరెండవ పాశురము అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన చక్కరపొంగాలి
ఇరవైమూడవ పాశురము మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం పులిహోర, దద్యోజనము
ఇరవైనాల్గవ పాశురము అన్ఱివ్వులగమ్ అళందాయ్ అడి పోత్తి దద్యోజనము
ఇరవైఏడవ పాశురము కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై పాయసము, పులిహోర, దద్యోజనము
ఇరవైఎనిమిదవ పాశురము కఱవైగళ్ పిన్ శెన్ఱు కానం    దద్యోజనము
ఇరవైతొమ్మిదవ పాశురము శిత్తం శిఱుకాలే వందున్నై  పులిహోర, దద్యోజనము, చక్కెరపొంగలి
ముప్పైవ పాశురము వఙ్గక్కడల్ కడైంద అప్పము,పులిహోర,దద్యోజనము,చక్కెరపొంగల 

తిరుప్పావై ద్వితీయ పాశురము

దనుర్మాసవ్రతము ముప్పై రోజుల వ్రతము కదా అయితే గోపికలు మొదటిపాసురములో వారికి ఏమికావాలో ఎలాచేయాలో అల్లోచించారు.  వారు భగవత్ప్రాప్తి కావాలని వ్రతము ప్రారంభించారు అని తెలుస్తోంది.  మరి రెండవ పాసురములో వారు ఏమిచేస్తున్నారో తెలుసుకుందామా.
పాశురము 
  వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
 


తాత్పర్యము:  భగవంతుని దర్శించుటకు వెళ్ళేవారు భాగాత్ప్రాప్తి కోసం కొన్ని నియమాలు పాటించాలని.  శ్రీ కృష్ణుడు అవతరించిన ఈ లోకములో పుట్టి దు:ఖమైన ఈ లోకములో కూడా భగవదనుగ్రహముచే ఆనందము అనుభవించుచుతున్న వారలారా!  మేము మా వ్రతమునకు ఏర్పరచుకోనిన నియామాలు వినండి.  పాలసముద్రములో పడుకొని నిద్రించుతున్న పరమాత్మ యొక్క పాదపద్మాలకు మంగళము పాడతాము.  మేము ఈవ్రతము చేసినంతన కాలమున నీటిని కానీ పాలను కాని అనుభవించము.  తెల్లవారుజాముననే నిదురలేచి చల్లనినీటినే స్నానము చేసెదము.  కళ్ళకు కాటుకను అలంకరించము.  తలకు పరిమలబరితమగు పూలదండలను ధరించము.  మా పెద్దలు విడిచిపెట్టిన చేడుపనులు మేము ఆచరించము.  ఇతరులకు బాధ కలిగే మాటలు కానీ, అసత్యాలను కాని ఎప్పుడూమాటాడము.  ఇతరులకు హాని uకలిగించము.  ఇతరులకు హానిలాగే ఆలోచనలు చేయము.  ఙ్ఞానసంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులచే ఎక్కువ సత్కారిచుదుము.  బ్రహ్మచారులకు బిక్షుకలుకు బిక్షపెట్టేదము.  భగవంతుని కళ్యాణ గుణాలను కీర్తించేదము.  గురువు ను పరబ్రహ్మగా భావించాలని మన పెద్దలు చెప్పారు కదా అందుకే గురువులను పూజించి ఆచార్య కృపపోందేదము.  వ్రతనీయమాలు ఏ రీతిగా చెప్పబడినవో ఆవిధంగా పాటిద్దాం అనుకున్నారు. శ్రీ కృష్ణుని పొందుదాము.


విశేషార్ధము :
1 .  వైయత్తు వాళ్ వీర్గాళ్!  :-
ఈ లోకములో ఆనందము అనుభవించువారలారా!  అని సంబోధించుచున్నారు.
2 . నాముం నం పావైక్కు చ్చెయ్యుఙ్గిరిశైగళ్ కేళీరో!  :-
మేము మా వ్రాతములో చేయు క్రియలను వినుడు.
3 . పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి  :-
పాలసముద్రములో మెల్లగా పాడుకొనిన పరమపురుషుని పాదములకు మంగళము పాడి.
4 . నెయ్యుణ్ణోం పాలుణ్ణోం  :-
నేతులారగించము- పాలు తాగము.
5 .  నాట్కాలే నీరాడి  :-
తెల్లవారుజ్హాముననే స్నానము చేయవలెను.
6 . మైయిట్టెళుదోం  :-
కాటుకను మాకళ్ళకు అలంకరించము.
7 .   మలరిట్టు నాం ముడియోమ్  :-
మేము మాకోప్పులలో పూలు ధరించము.
8 . శెయ్యాదన శెయ్యోం  :-
"మా పెద్దలు చేయని పనులను మేమూ చేయము"
9 .  తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్  :-
ఇతరులకు అనర్ధమును కల్గించు తప్పు మాటలను పలుకము.
10 .  ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి  :-
దానమును, భిక్షమును చాలు అన్నంతవరకు  ఇచ్చి  అయ్యో! ఏమియు చేయలేకపోతిమే అని విచారింతుము.
11 . ఉయ్యుమాఱెణ్ణి యుగందు :-
పైన విధంగా ఉజ్జీవించు విధములను పరిశీలించి సంతోషించి ఈ వ్రత నీయమాలను వినండి.




జై శ్రీమన్నారాయణ్

గురువారం, డిసెంబర్ 15, 2011

తిరుప్పావై ప్రధమ పాశురము

గురువారం, డిసెంబర్ 15, 2011

ఈ ధనుర్మాసం వ్రతం చాలా శ్రేష్టమైనది.  ఈ నెలరోజులు సూర్యోదయానికి మునుపే నిద్ర లేచి భగవంతుని ఆరాధించాలి.
ఈ వ్రతాన్ని త్రేతాయుగంలో భరతుడు ఆచరించాడు.  ద్వాపరయుగంలో గోపికలు శ్రీ కృష్ణుని భర్తగా కోరి ఈ నెలరోజులు కాత్యాయనీదేవి వ్రతం చేస్తారు.  ఈ వ్రతము మనము కూడా చేద్దాం.  అయితే మొదటి రోజు పాశురం గురించి మనం తెలుసుకుందాం   చుక్కలు పెట్టిన పాసురము నాకు విశేష నివేదన స్వామివారికి అర్పించాలి .

*మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
  నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
  శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
  కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
  ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
  కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
  నారాయణనే నమక్కే పఱైతరువాన్
  పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
 

తాత్పర్యము:   ఆహా మనము అవలంభించిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయము వచ్చింది కదా.
ఈ మార్గశిరమాసమును శ్రీ కృష్ణులు వారు  మాసములలో మార్గశిరమాసము తన స్వరూపముగా భగవద్గీతలో చెప్పారు.  మార్గశిరమాసము అనగా మనము అవలంభించిన మార్గమునకు శిరస్సు అని ( అతి ప్రదానమైన సమయము అని భావము)  " వాసుదేవతరుచ్చాయానాతిశీతానఘర్మదా" అంటే శ్రీ కృష్ణుడనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చల్లనిదీ కాదు, ఎక్కువ వేడిదీ కాదు అని అర్ధము.  వాసుదేవస్వరూపమైన మార్గశిరమాసము కూడా సమశీతోష్ణముగా వుండు కాలము.  మనము మేలుకొనే సమయము బ్రాహ్మీముహూర్తము మరియు ఈ మార్గశిరమాసములో పైరులు పండి పెరిగి ఉండే కాలము.  అతి మనోహరముగా వుంది వెన్నెలను వెదజల్లు శుక్లపక్షము.  పవిత్రమైన దినము వ్రతము ప్రారంభించమని మనకు కాలమును ప్రకాసించుటలోని భావము.
భాగవత్సమాగమమును కోరి భగవంతుని సంతోషపెట్టుటకై పనులోనర్చునట్టి సమయము సంప్రాప్తించుటచే ఉత్తమోత్తమ సమయము అని ఆహ్లాదమును వెల్లిబుచ్చుట యందలి తాత్పర్యము.  చెలికత్తెలను మేల్కొని స్నానముచేసి, రండని పిలుచునపుడు "  ప్రకృతి మండలము అందనంత అనుభవించువారలారా! అని ఆండాళ్ళు సంబోధించింది.  ఈ పిలుపులో ఒక సుందరమైన భావము కలదు.  పమపదమున నివాసము కంటే గోకుమను ప్రకృతిమండలమున నివసించుటచే భగవంతునితో కలసి మెలసి మహానందము అనుభవించుట మహాభాగ్యముగా లభించును.  అందుచే పరమపదమును ఎవగించుకోనుట సంభోధనలోని సౌందర్యముగా గ్రహింపదగును.



ధనుర్మాస వ్రతం



రేపటి నుండి ధనుర్మాసం కదండి. సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - "ధనుర్మాసం". వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు.ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దద్యోదనమును సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచవలెను. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు. సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది.
ధనుర్మాస వ్రతంప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరశి మొదలు పన్నెండురాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి.


 ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం్ చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి.  తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ,సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ 'చెక్కర పొంగలి' ని గానీ, భియ్యం, పెసరపప్పు కలిపి వండిన 'పులగం'ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ 'దద్యోదనం' నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూపదీప, దక్షిణతాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించడం చేయాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని


"మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రదతవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||"


అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ -"ఇందిరా ప్రతి గృహ్ణాతు" అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. 
ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాలపాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితాభిప్రయం.కాత్యాయనీవ్రతంఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహంకాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.వ్రత విధానంధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యంసమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి.

ధనుర్మాసం లో పాడవలసిన పాసురాలు ఇవి.  మా పిన్నిగారు రామ లక్ష్మిగారు పాడిన తిరుప్పావై పాసురాలు మీ ముందువుంచుతున్నాను. 





అనేక దీక్షలు, వ్రతాలుతో ఏదోఒక పద్దతిలో జీవితాన్ని మరింత సమర్దవంతముగా నడుపుకోవటానికి , జీవితాన్ని అర్ధవంతముగా తీర్చిదిద్దుకోవటానికి అందరు ప్రయత్నమూ చేస్తారు.
అందుకో ఒకటి వైదిక సాధనాలను సమన్వయము చేస్తూ గోదాదేవి నడచిన మార్గమే మార్గశిరం.  ఈ మార్గశిరమాసాన్ని తానుగా శ్రీ కృష్నులవారు చెప్పారు.  అతన్ని పొందేమార్గమే మార్గశిరవ్రతము.  


గోదాదేవి మనకందించిన ఈ ధనుర్మాసవ్రతము ప్రాపంచిక ఫలితాలైన వర్షాలను, పాడిని, పంటను,సంవృద్ది చేస్తుంది.  సంపదలను ఇస్తుంది.  సత్పరిపాలకులను ప్రవర్తింపచేస్తుంది.  దేసప్రగతికి, ప్రజాశ్రేయస్సుకు సోపానాలను దిద్దగలిగే పాలకులును తయారు చేస్తుంది.  వాతావరణాన్ని సానుకూల పరుస్తుంది.  శాంతియుతంగా పరస్పర ప్రేమానురాగాలు పెరిగి సోదరభావం వెల్లివిరిసేలా చేస్తుంది.  పిల్లలలోసత్ప్రవర్తన, క్రమశిక్షణ అలవారుస్తుంది. ఇదే దనుర్మాసవ్రతం.
  ఈ ధనుర్మాసం పూజ అందరు బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాను.

సూక్తి:  నీవు ఎంత చిన్న ధర్మము ఆచరించినా అది ఎంత గొప్ప ఆపదనుండైనా రక్షిస్తుంది.
సర్వేజనాః సుఖినోభవంతు.  సమస్త సంమంగాళాని భవంతు.

జై శ్రీమన్నారాయణ్

బుధవారం, డిసెంబర్ 14, 2011

తొల్లింటి వలె గావు తుమ్మెదా

బుధవారం, డిసెంబర్ 14, 2011

తొల్లింటి వలె గావు తుమ్మెదా యింక వొల్లవుగా మమ్మువో తుమ్మెదా

తోరంపు రచనల తుమ్మెదా కడు దూరేవు గొందులే తుమ్మెదా
దూరినా నెఱుగవు తుమ్మెదా మమ్ము వోరగా చూడకు వో తుమ్మెదా

తొలి ప్రాయపు మిండ తుమ్మెదా కడు తొలిచేవు చేగలే తుమ్మెదా
తొలకరి మెరుగువే తుమ్మెదా ఇంక ఉలికేవు మముగని వో తుమ్మెదా

దొరవు వేంకటగిరి తుమ్మెదా మా తురుమేల చెనకేవు తుమ్మెదా
దొరకెనీ చనవులు తుమ్మెదా ఇంక ఒరులెఱింగిరి గదవో తుమ్మెదా

మంగళవారం, డిసెంబర్ 13, 2011

సత్యానికి-అసత్యానికి

మంగళవారం, డిసెంబర్ 13, 2011

సత్యానికి అసత్యానికి దూరం ఎంత?


మీరు ఈ కద చదివే ముందు ఒకసారి జవాబు ఒకసారి అల్లోచించండి.
ఒకానొకరోజు రాత్రి నిద్రలో అక్బర్ గారికి ఒక డౌట్ వచ్చింది.  ఆ డౌట్ ఏమిటంటే  సత్యానికి అసత్యానికి దూరం ఎంతా అని ? ఎంత ఆలోచించినా జవాబు దొరకలేదు.  అప్పుడు అక్బర్ రేపు దివాణం లో నా ప్రజలను అడుగుదాం అనుకున్నాడు.  మరుసటి రోజు దివాణంలో అక్బర్ తన డౌట్ ని అడిగాడు.  సత్యానికి అసత్యానికి దూరం ఎంత అని అప్పుడు ఎవరు చెప్పలేకపోయారు అందరూ ఆలోచనలో పడ్డారు.  రోజు కొంత సమయం తరువాత అక్కడే వున్నా బీర్బల్ మంత్రిని అడిగారు.  బీర్బల్ గారు మీరు అయినా చెప్పండి అని అడుగగా గబుక్కున నాలుగు వేళ్ళు దూరం అన్నారు.  అదేంటి వివరంగా చెప్పండి అనగా బీర్బల్ గారు ఇలా అన్నారు.
కన్నుతో చూసేదే సత్యం.   మరి చూడకుండా చెవితో వినేదే అసత్యం.  మరి కన్నుకు చెవికి మద్య దూరం నాల్గు వేళ్ళు అంత దూరం మహారాజ అని చెప్పాడు బీర్బల్.
కధ చాలాబాగుంది కదా.

సోమవారం, డిసెంబర్ 12, 2011

పరశురాముని జయంతి

సోమవారం, డిసెంబర్ 12, 2011

ఈరోజు పరశురాముని జయంతి.  ఆయన జయంతి సందర్బంగా పరశురాముని గురించి కొంత తెలుసుకుందాము.  పరసురాముడు  విష్ణువు యొక్క ఒక అవతారం.  ముఖ్యంగా విష్ణువు యోక్క దశావతారాలలో పరశురామ అవతారం  ఆరవది .  పరసురాముడు ఋషి జమదగ్ని కుమారుడు. అతను పరమ శివుని గురించి తపస్సు చేసాడు. అప్పుడు అతనికి ఒక గొడ్డలి ఆయుధంగా  లభించింది .
ఒకసారి, కార్తవీర్య-అర్జున పేరు గల ఒక రాజు అటవీ లో ఒక వేట యాత్రసమయంలో అతని సైన్యం తో కలిసి జమదగ్ని యొక్క ఆశ్రమమును  సందర్శించారు. జమదగ్ని  తన దివ్య ఆవు సహాయంతో తన అతిధికి  మరియు అతని విస్తారమైన సైన్యంనకు ఆహారం మరియు తగిన  ఏర్పాటులు చేసారు. ఇలా చేయటం చూసి రాజు మొదట  ఆశ్చర్యపడి, తరువాత ఆ రాజుకు  అత్యాశగా  మారింది.  అప్పుడు ఆ రాజు అతనికి ఆ ఆవును ఇమ్మని కోరుకున్నాడు. జమదగ్ని  ఆవు తమకు  అవసరం లేదని చెపుతూనే, ఆవును ఇవ్వటానికి నిరాకరించారు.

రాజు తన సైనికులును  పంపి మరియు బలవంతంగా తన నగరానికి దూరంగా ఆవును తీసుకువెళ్ళారు . ఇది   పరశురామడికి తెలిసి ఆయొక్క ప్రదేశానికి వెళ్ళాడు. అతని సైన్యంను  నాశనం చేసి చివరకు తన గొడ్డలి తో రాజును  హత్య చేసారు. ప్రతీకారంగా, కార్తవీర్య-అర్జునుడు యొక్క కుమారులు ధ్యానంలో వున్నసమయంలో పరశురామ తండ్రి జమదగ్ని ని  హత్య చేస్తారు.  పరశురామ  తన తండ్రి మరణం వినగానే చాలా కోపంతో వచ్చింది.  అప్పుడు  అతని తండ్రి హత్యకు పగ తీర్చుకోవడానికి, అతను మాత్రమే కార్తవీర్య-అర్జున కుమారులును  హత్య చేసాడు.  అంతే కాకుండా మొత్తం రాజ వంశం మొత్తం నాశనం చేసాడు. ఈ విధంగా ఆయన మొత్తం భూమిని  స్వాధీనం చేసుకున్న తరువాత తన తండ్రిగారి  ఆఖరి కర్మలు చేస్తూ తర్వాత కశ్యప  వరకు స్వచ్ఛంద వున్నారు .పరశురాముడు  ఎనిమిది మంది చిరంజీవులలో  ఒక్కరు.
ఒక పురాణాల ప్రకారం, పరశురామ  శివ సందర్శించడానికి వెళ్ళినప్పుడు, అతను వినాయకుడి ద్వారా అడ్డగింప బడి లోనికి వెళ్ళుటకు నిరాకరించబడినాడు. పరశురామ  అతని గొడ్డలి విసిరాడు, మరియు తన తండ్రి ఇచ్చిన  ఆయుధము అని, వినాయకుడి  దాన్ని స్వీకరించదాల్చాడు  అప్పుడు తన దంతము  ఒకటి విరిగినది.  అప్పుడే వినాయకునికి ఏకదంతుడు అని పేరు వచ్చింది.
  
విష్ణువు రాముడుగా  (రామాయణం లో హీరో ) అవతరించారు.  అప్పుడు , పరశురామ  తన అవతార-కార్యము ముగింపు జరిగవలసి వుంది.  అయితే అతను ఒక చిరంజీవి అవ్వటం వల్ల రామునికి  లొంగిపోయారు. అప్పడు పరాసురామ తపస్సుకు వెళ్ళిపోయారు.  ఒక పర్వతము మీద తపస్సు చేసుకుంటున్నారు.  ఇప్పటికీ ఆ పర్వతము మహేంద్ర గా చెప్పబడుతుంది.  తపస్సు లో తన జీవితసమయం గడుపుతారుఇది పరశురామ  తదుపరి మన్వంతర  లో సప్తర్షులు లో ఒకకరుగా వున్నారు.

ఆదివారం, డిసెంబర్ 11, 2011

రాబర్ట్ కోచ్

ఆదివారం, డిసెంబర్ 11, 2011

హెన్రిచ్ హెర్మన్ రాబర్ట్ కోచ్ 
హెన్రిచ్ హెర్మన్ రాబర్ట్ కోచ్  11 డిసెంబర్ 1843 న జన్మించినారు.   ఒక German వైద్యుడు. అతను వియుక్త బసిల్లుస్ అన్త్రసిస్  (Bacillus Anthracis ) 1877 న , క్షయ బాసిలుస్తో  (Tuberculosis bacillus )1882 న  మరియు విబ్రియో కలరే (Vibrio cholerae )న 1883న కనుక్కొన్నారు.  ఇవి బాగా   ప్రసిద్ధి చెందినవి 
అతను నోబెల్ ఫిజియాలజీ లో బహుమతి  పొందారు. 1905 లో తన క్షయ కు  మెడిసిన్ లభించింది. అతను Paul Ehrlich and Gerhard Domagk వంటి వారికి  స్పూర్తినిస్తూ,జీవశాస్త్రం యొక్క స్థాపకులు గా వున్నారు 
హెన్రిచ్ హెర్మన్ రాబర్ట్ కోచ్.  
నేడు హెన్రిచ్ హెర్మన్ రాబర్ట్ కోచ్  జన్మదినము. ఈ రోజు రాబర్ట్ కోచ్ ను గుర్తుచేసుకోవటం నాకు చాలా సంతోషంగా వుంది.  ఆయనికి  ఈ బ్లాగ్ ద్వారా నివాళ్ళు అర్పిస్తున్నాను.   ధన్యవాదములు.
 


శుక్రవారం, డిసెంబర్ 09, 2011

శ్రీ దత్త జయంతి

శుక్రవారం, డిసెంబర్ 09, 2011

శ్రీ దత్త జయంతి శుభాకాంక్షలు

31 Days of Science and Spirituality


The International Gita Society and Krishnauniverse invite you for the worldwide  " 31 Days of Science and Spirituality" Bhagavad Gita Reading Campaign to celebrate Gita Jayanti 2011.


My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)