దనుర్మాసవ్రతము ముప్పై రోజుల వ్రతము కదా అయితే గోపికలు మొదటిపాసురములో వారికి ఏమికావాలో ఎలాచేయాలో అల్లోచించారు. వారు భగవత్ప్రాప్తి కావాలని వ్రతము ప్రారంభించారు అని తెలుస్తోంది. మరి రెండవ పాసురములో వారు ఏమిచేస్తున్నారో తెలుసుకుందామా.
పాశురము
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
విశేషార్ధము :
1 . వైయత్తు వాళ్ వీర్గాళ్! :-
ఈ లోకములో ఆనందము అనుభవించువారలారా! అని సంబోధించుచున్నారు.
2 . నాముం నం పావైక్కు చ్చెయ్యుఙ్గిరిశైగళ్ కేళీరో! :-
మేము మా వ్రాతములో చేయు క్రియలను వినుడు.
3 . పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి :-
పాలసముద్రములో మెల్లగా పాడుకొనిన పరమపురుషుని పాదములకు మంగళము పాడి.
4 . నెయ్యుణ్ణోం పాలుణ్ణోం :-
నేతులారగించము- పాలు తాగము.
5 . నాట్కాలే నీరాడి :-
తెల్లవారుజ్హాముననే స్నానము చేయవలెను.
6 . మైయిట్టెళుదోం :-
కాటుకను మాకళ్ళకు అలంకరించము.
7 . మలరిట్టు నాం ముడియోమ్ :-
మేము మాకోప్పులలో పూలు ధరించము.
8 . శెయ్యాదన శెయ్యోం :-
"మా పెద్దలు చేయని పనులను మేమూ చేయము"
9 . తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్ :-
ఇతరులకు అనర్ధమును కల్గించు తప్పు మాటలను పలుకము.
10 . ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి :-
దానమును, భిక్షమును చాలు అన్నంతవరకు ఇచ్చి అయ్యో! ఏమియు చేయలేకపోతిమే అని విచారింతుము.
11 . ఉయ్యుమాఱెణ్ణి యుగందు :-
పైన విధంగా ఉజ్జీవించు విధములను పరిశీలించి సంతోషించి ఈ వ్రత నీయమాలను వినండి.
జై శ్రీమన్నారాయణ్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.