తొల్లింటి వలె గావు తుమ్మెదా యింక వొల్లవుగా మమ్మువో తుమ్మెదా
తోరంపు రచనల తుమ్మెదా కడు దూరేవు గొందులే తుమ్మెదా
దూరినా నెఱుగవు తుమ్మెదా మమ్ము వోరగా చూడకు వో తుమ్మెదా
తొలి ప్రాయపు మిండ తుమ్మెదా కడు తొలిచేవు చేగలే తుమ్మెదా
తొలకరి మెరుగువే తుమ్మెదా ఇంక ఉలికేవు మముగని వో తుమ్మెదా
తొలకరి మెరుగువే తుమ్మెదా ఇంక ఉలికేవు మముగని వో తుమ్మెదా
దొరవు వేంకటగిరి తుమ్మెదా మా తురుమేల చెనకేవు తుమ్మెదా
దొరకెనీ చనవులు తుమ్మెదా ఇంక ఒరులెఱింగిరి గదవో తుమ్మెదా
సాంగ్ చాలా బాగుంది ఇ సాంగ్ ఎవరు పాడారు వాయిస్ బాగుంది
రిప్లయితొలగించండిఈ పాట బాగుందన్నరు, ధన్యవాధములు. ఈ పాట రామాచారి గారు పాడారు. SVBC లో ఈ రోజు సాధన అనే కార్యక్రమములో ఈ పాట నేర్పిస్తున్నారు.
రిప్లయితొలగించండిగుడ్ సాంగ్ ! గాత్రం బాగుంది. ఈ పాట వివరాలు కూడా పెదితే ఇంకా బాగుండేది . ఇప్పుడైనా పెట్టమ్మా లహరీ !
రిప్లయితొలగించండి