Blogger Widgets

Thursday, November 01, 2012

అంధ్రప్రదేశ అవతరణ దినోత్సవము

Thursday, November 01, 2012


ఆంద్ర ప్రదేశ్
నవంబర్ 1 వ తేదీ అంటే ఇవాళ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవము . 1953 వ సంవత్సరం ఇదే రోజు పదకొండు తెలుగు మాట్లాడే జిల్లాలు కలిసి ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాయి. అంతకు ముందు ఇవి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవి. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేసారు. అనంతరం 1956 నవంబర్ ఇదే రోజున నిజాం పాలనలో ఉన్న తెలంగాణా ప్రాంతాన్ని ఆంద్ర ప్రదేశ్ లో విలీనం చేసారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ, బీహార్, కర్నాటక, మధ్యప్రదేశ్ , రాజస్తాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాస్ట్రాలు ఏర్పడ్డాయి. 1966 లో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడ్డాయి.  2000 సంవత్సరము లో చత్తీస్ ఘడ్ రాష్ట్రము ఏర్పడింది.నవంబర్ 1 వ తేదీ అంటే ఇవాళ ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవము సందర్బముగా అంధ్రప్రదేశ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.  

1 comment:

  1. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది అక్టోబర్ 1 న (1-10-1953) ; నవంబర్ 1 కాదు. ఇది 1956 వరకు నిలిచింది. దీనికి ప్రకాశం పంతులు మొదట, తరువాత బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు.

    నిజామ్ పాలన అంతమయింది సెప్టెంబర్ 17 నాడు (17-09-1948) ; నవంబర్ 1 కాదు. ఆనాటి నుండి అది 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంగా ఉంది. దీనికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు

    ఆ తరువాత నవంబర్ 1, 1956 నాడు ఈ రెండు రాష్ట్రాలను విలీనం చేసి, నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.


    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers