Blogger Widgets

బుధవారం, డిసెంబర్ 10, 2008

మాసానాం మార్గశీర్షం - లక్ష్మీ హృదయకమలం ముగ్గు

బుధవారం, డిసెంబర్ 10, 2008

మార్గ శిర మాసం వైష్ణవ మాసం అని కుడా అంటారు. "మాసానాం మార్గశీర్షోహం " అని మాసాలలో మార్గశీర్షమాసాన్ని నేనే అని భగవగీత లో శ్రీ క్రిష్ణులవారు అర్జునితో విభూతి యోగములో వివరించారు. అంటే అన్ని మాసాలలోని మార్గశిర మాసం లో శ్రీ కృష్ణ పరమాత్మ ఒక వ్రుక్షచాయ. ఇది గ్రీష్మత్ప్తులకు చల్లగాను, శీతపీడితులకు వెచ్చగాను ఉంటుంది. అలాగే విష్ణు స్వరుపమగు మార్గశీర్ష మాసంకుడా, అతిశీతలం కాక అతి వేడి కాకుండా సమ శీతోష్ణముగా ఉంటుంది. సంవత్సరంను ఒకరోజుగా భావిచినచో మార్గశిరమాసాన్నిబ్రహ్మ ముహార్థముగా చెప్పుకొనవచ్చు.
అనగా తెల్లవారుజాము చాలామంచిదని తెలుసు . మార్గ శిరం సత్వ గుణము ను పెంచి భగవదనుభుతిని కలుగ చేస్తుంది.
లోకమంతా పైరులతో పచ్చగా వెలయు కాలం మార్గశిర్షం . మార్గశిర్శమో ! క్షేత్రములో సస్యములు పంది భారంతో వంగి మనోహరంగా ఉంటుంది.
అల్లా వున్నప్పుడు ప్రజలు సంతోషముగా వుందురు. ఈ నెల ప్రారంభం నుండిఇళ్ళల్లొ ఆడవారు మార్గశిర లక్ష్మి వారపూజలు ప్రత్యెకంగా లక్ష్మివారం రోజు చేయటం ప్రారంభించి పుష్యమాసం మొధటి లక్ష్మి వారం వరకు చాలానియమ నిస్టలతో పూజలు చేస్తారు. ఆ రోజు లక్ష్మేహ్రుదయకమలం ముగ్గు పెట్టి లక్ష్మి ని ఆహ్వానించి పూజచెస్తారు. ఈమెని కనక మహాలక్ష్మి గా కొలుస్తారు .
చంద్ర మానాన్ని బట్టి మార్గశిరమని , సూర్య మానాన్ని బట్టి ధనుర్మాసమని ఏర్పడ్డయి . ఈ రెండూ ఒకటె.
ఈ మాసంలొ తెల్లవారుజామున లెచి మార్గశిర స్నానాలు చేసి తమలో వున్న ఙ్ నాన్ని మెలుకొల్పుదురు. ఆద్యాతంక చింతన కలిగి వుంధురు .
ఇక మార్గశిర మాసంలొ ఒక రహస్యమున్నది. మార్గముని నిర్ధెశించునధి. అని అర్ధము. భగవానుని పొంధు దారి అన్న మాట.
ధనుర్మాసంలొ గోధాదేవిని శ్రీ కౄషులను పూజించుధురు .ఆ అమ్మవారు పాడిన 30 పాశురాల తిరుప్పావై ని ఈ నెల పాడుధురు . దీనిని ధనుర్మాస వ్రతముగా కన్నెపిల్లలు చెయుధురు. తమకి మంచి జరుగునని భావించి ఆధ్యత్మికద్రుక్పధముతొ మెలగుధురు. . ఈ నెలరోజులూ వైష్ణవ ఆలయాలు చాలా వినసొంపుగా లయబద్ధముగా తిరుప్పవై చధువుతారు. ఆలయాలన్నీ ఆద్యాత్మికంగా వుంటాయి . సాయంకాల సమయంలొ విష్ణుసహస్ర పారాయణములతొ నెలరోజులూ సంధడిగా గడుపుధురు.
ఈ వ్రతాలు గురించి మిగతావి మరొసారి చెప్పుకుంధాము సరేన మరి.

మంగళవారం, డిసెంబర్ 09, 2008

గీతాసారము శాంతికి మార్గము.

మంగళవారం, డిసెంబర్ 09, 2008

హిందువులకు వవిత్ర గ్రంధం భగవద్గీత . మహాభారతంలో భీష్మ పర్వంలో 24-25 ఆశ్వాసంలో ఈ భగవగీత వివరించ బడింది . కురుక్షేత్ర సమరం లో అర్జునుడు యుద్దరంగాములో తాతలను, తండ్రులను, అన్నలను, తమ్ములను, గురువులను, చూచిమమ్చివారితోను యుద్దము చేయలేనని శ్రీ కృష్ణునికి తెలియచేసాడు . అప్పుడు శ్రీ కృష్ణార్జునుల మద్య జరిగిన సంభాషనే " గీతోపదేశము ".
గీతోపదేశము ముఖ్యముగా మూడు విషయాలను తెలియచేస్తోంది. 1 . కర్మ యోగము ,2 . ఙాన యోగము ,౩ . భక్తి యోగము . భగవగీతలోని మొత్తం సారం హిందుత్వానికి మూలం . అందువలనే "భగవగీత" హిందువులకు పవిత్ర గ్రంధం .
మన కోర్టులలో ముద్దయిలచేత "భగవగీత"గ్రంధం పై చేతులు ఉంచి అంతా నిజమే చెప్తాను . అబ్బధం చప్పను అని అనిపిస్తారు.

గీతాసారం శాంతికి మార్గం:
శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములవారు అన్నారు ఒక గ్రంధములో .
మిత్రమా !ఎందుకు భాధపడుతున్నావు !అయ్యిందేదో అయిమ్ది. పోయిమ్దేదో పోయిమ్ది . ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తెలేదుకదా. వట్టి చేతులతో వచ్చావు ! పోయేటప్పుడు లగేజిలతో పొవాలనుకుంటున్నావు! అందుకే నీకంత యాతన. నువ్వేమి తెచ్చావని -నువ్వు పోగొట్టుకున్తున్నావు. నీవేమి సృస్తిమ్చావని నీకు నష్టం వచ్చింది? నువ్వు ఏదైతే పోదావో అది ఇక్కడనుండే పోదావు. ఏదైతే ఇచ్చావో అదీ ఇక్కడనుండే ఇచ్చావు.
ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం , రేపు ఇంకొకరి సొంతం కాగలదు.
కావున జరిగేది జరుగక మానదు . అనవసరంగా ఆందోళన చెందకు . ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపంలేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా భగవంతుని ప్రసాదంగా స్వీకరించు.
కారు లేదని చింతించకు _ కాలువున్నందుకు సంతోషించు.
కొట్లులేవని చింతించకు _ కూటికి వున్నదికడా ! సంతోషించు . అది లేక చాలామంది భాద పడుతున్నారు .
కాలిలో ముళ్ళు కుచ్చుకున్నదని చింతించకు _ కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు .
కాలం చాలావిలువైనది _రేపు అను దానికి రుపులేదు. మంచి పనులను వాయిదావేయవద్దు.
అసూయను రుపుమాపు_ అహంకారాన్ని అనగద్రోక్కు .
హింసను విడనాడు_అహింసను పాటించు .కొపాన్న్ని దరి చెర్చకు _ఆవెశముతో ఆలోచించకు
ఉపకారం చేయకపోయినా _అపకారం తలపెట్టకు.
మతిని శుద్దము చేసేధి మతం_ మానవత్వంలెని మతం మతం కాధు.
దేవుని పూజించు_ ప్రాణికోట్లకు సహకరించు.
తద్వారా భగవదాశీర్వాధం తో శాంతి నీవెంటె వుంటుంధి. అని అన్నరు. ఇదే గీతాసారం .

కోపాన్ని గెలుచుటకు టిప్స్

తన కోపమే తన శత్రవు
తన శాంతామే తనకు రక్షా దయ చుట్టంబౌ
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తధ్యము సుమతి !
సారాంసం : ఎవరికైనా తన కోపమే తనకు శత్రువగును .తన శన్తమే తనకు రక్షగా నిలచును. తను చూపు దయయే తనను బందువువలె సహకరించును. తానూ సంతోషముగా నున్దగలిగినచొ అది స్వర్గముతో సమానం. తానూ దుఃఖమును చేతులారా తెచ్చుకోనినచో అదియే నరకమగుట తధ్యము.
ఈ పద్యం చూసారుగా .
కోపం గురించి ఎవరికీ చెప్పక్కరలేదు అందరికీ అనుభవమే అయ్యి వుంటుంది . ఈ కోపం వల్ల చాలా మంది జీవితాన్నే నరకంగా మార్చుకుంటారు. కోపం వచ్చినప్పుడు తెలియదు . తన కోపం వల్ల ఏమి జరుగుతోందో. అంతా జరిగిపోయిన తరువాత వెనక్కి తిరిగి చూసేసరికి పెద్ద అగాధమే వుంటుంది. ఆ అగాధాన్ని దాటలేము . జరిగిన తప్పు దిద్దుకోలేము. నష్టపోయిన జీవితాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోలేము.
అందుకే కోపాన్ని మన ఆదీనం లో వుంచుకోవాలి ,కోపం అదీనంలో మనం వుండకూడదు.
ఈ కోపం వల్ల మనమే కాదు మనచుట్టూ వున్నా వాతావరణం కుడా పోల్యుట్ అవుతుంది. అది తెలుసుకొని మసలుకోవాలి. మన కోపం మనమీదే కాకుండా మనపిల్లలు మీద కుడా ప్రభావం చూపుతుంది.
అయితే ఈ జయించటమనేది కేవలం మనవల్లమాత్రమే సాద్యం .ఆ కోపానికి కారణం మనమే అయినప్పుడు ఆకోపాన్ని మనమే కదా తగ్గించుకోవాలి . అనేకరకాలుగా కోపాన్ని తగ్గించుకోవచ్చు.
కోన్నికోపాన్ని తగ్గించుటకు tips ఇక్కడ:

ముందుగా కళ్ళుమూసుకుని ఆలోచనలు పక్కన పెట్టి బలంగా ఊపిరితేసుకుని వదలండి. ఇలా ఐదు నిమిషాలు చేయండి చాలు.
ఎవరు లేని ప్రాంతములో గట్టిగా అరవండి
1 నుండి 50 కి 50 నుండి 1 నెంబర్లు లెక్కపెట్టుకుంటువెళ్ళండి.
వెంటనె మీరు ఉన్న ప్రదెశం నుండి ప్రశాంతముగా ఉండె పచ్చన్ని ప్రాంతానికి దానిని ఊహించుకుంటు వెళ్ళండి.
మీకు చాలా నచ్చిన పాటలు పెద్ద సవుండు పెట్టుకొని వినండి.
మీకు కొపం తెప్పించిన విషయాన్ని దానికి కారణం దానికి కార్ణమైనవారిని బాగాతిట్టుతూ ఒక పెపరు మీద రాయండి . దానిని తరువాత చింపెయండె , మరువద్దు చింపెయండి.
వ్యాయామం చెయండి.
కొపం వస్తున్నప్పుడు చూయింగం కాని చకొలైట్ కాని తినండి.
మనసును మరొక విషయం పై మార్చటం అన్నిటి కంటె చాలామంచి పని.
ఉదాహరనగా: గార్డెనింగ్ ,రీడింగ్, సంగీతం,డాన్సింగ్ , కబుర్లు ,టి.వి వంటివన్నమాట .
వైపునుడి కుడా అలొచించండి. మీ కొపం అర్ధ రహితమెమొ అలొచించండి.
మీ కోపాన్ని అదుపులొవుంచుకొడానికి హాస్యమును వుపయొగించుకొండి.
మీ కొపానికి అసహన కారణం లోపం ఎక్కడ అని గుర్తించండి.
మీ కొపం అర్ధరహితమైనా దానిని నిజాయితిగా వొప్పుకొని ఎదుటివారి క్షమాపన కొరండి. క్షమిచదగినదైతే వారు కూడా తప్పక క్షమిస్థారు.
వివెకాన్ని కొల్పోకండి.
ఈ టిప్స్ పాటించి చూడండి.
కోపం వల్ల అన్నే నష్టాలె అని గ్రహించుకొని దానిని అదుపులొ వుంచుకొండి . మీజీవితం సుఖంగా హాయిగా ఎటువంటి అలమరికలు లెకుండాజీవించవచ్చు . ఎమంటరు .
మరి ఇక శెలవా.

సోమవారం, డిసెంబర్ 08, 2008

చెప్పుకోండి చూద్దాం .........?

సోమవారం, డిసెంబర్ 08, 2008

మెరిసే గుండు - కళ్ళకు జోడూ
తెల్లని టోపి - చెరగని వదనం
గుబురు మీసం - నున్నని గడ్డం
బోసినోరు - ముసిముసి నవ్వు
చేతిలోకర్ర - తెల్లని వస్త్రం
కళ్ళకు జోడూ - పరుగుల నడక
జాతికి నేత - ముద్దుల తాత
ఎవరో ఎవరో - చెప్పుకోండి మిరే చెప్పుకోండి చూద్దాం ?

మా తాత చెప్పినది మరొకటి మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పుకోండి చూద్దాం ........ సైయ్యా
చలన శక్తి గలదు జంతువుగాదది
చేతులేపుడు త్రిప్పు శిశివుగాదు
కాళ్ళు లేవు సర్వకాలంబు నడచును
దీని భావమేమి? తిరుమలేశా !
చెప్పుకోండి చూద్దాం .................................

ఆదివారం, డిసెంబర్ 07, 2008

బడాయి పిల్లి - మా బావ వీరత్వం

ఆదివారం, డిసెంబర్ 07, 2008


బడాయి పిల్లి లడాయికెళ్ళి
ఎలుకను చంపి ఏనుగేఅంది.
పులినే తాననిపొంగిన పిల్లి
కుక్కను చూసి ఒకటే పరుగు
మా బావ వీరుడు -మంచం దిగడు
చీమంటే చాలు - చిందులేస్తాడు
ఎలుకంటే చాలు -ఎగిరి పడతాడు
పిల్లి అంటే చాలు -పారిపోతాడు.

సోమవారం, డిసెంబర్ 01, 2008

లాభం-నష్టం: మంచి-చెడు

సోమవారం, డిసెంబర్ 01, 2008

ఒక రైతుకు ఒక కోడి ,ఒక పిల్లి ఉండేవి. కోడికి పిల్లికి ఎప్పుదూ పడదు కదా!
ఒక రోజు పిల్లి , కోడిమేడను తన నోటితో పట్టేసింది. దృశ్యాన్ని చూసిన రైతు , పిల్లిని బాగా కొట్టాడు.
కొన్ని రోజులయినా తరువాత అతనికి పంట చాలా బాగా పండింది . కోతలు పూర్తి అయ్యినతరువాత ధాన్యాన్ని ఇంటికి తెచిపెట్టాడు .సహజంగానే ఎలుకలు చేరేయి. దాన్యంకొట్టులో కి పిల్లి ప్రతీ రాత్రి ఎలుకను పట్టేసింది. రైతు పిల్లిని ఒడిలో తీసుకొని దాని శరీరాన్ని ప్రేమతో నిమిరాడు. ఒకే పిల్లి తన నోటితో కోడిని పట్టితే దెబ్బలు తిన్నది. ఎలుకలను పట్టితే
ప్రెమించబడింధి. దీనికి కారణం ఏమిటి ? కోడిని పట్టినందు వల్ల రైతుకు నష్ఠం , ఎలుకని పట్టడం రైతుకు లాభం .
లాభ నస్టాలు రెండిటికీ పిల్లె కారణం .
అటులనే ఫలితాలను బట్టి మనం ఒకటి మంచిదని , మరొకటి చెడ్డధని నిర్ణయిస్తాము .

శనివారం, నవంబర్ 29, 2008

నిజమైన దీపావళి

శనివారం, నవంబర్ 29, 2008

చెడు పై మంచి విజయం సాధించటాననే మనం దీపావళి గా జరుపుకుంటాము . అయితే మన దీపావళి పోయిన అమావాస్య దీపావళి కాకుండా ఈ రోజు మన దేశంలో చొరబడి న దుండగులపై మన సైనికులు ,పోలిసులు చేసిన యుద్దములో విజయం సాదిమ్చాము . ఇది మన అందరి విజయం .ఈ రోజే నిజమైన దీపావళి . ఈ పోరాటం లో అసువులు బాసిన అశోక్ కాంటే ,హేమంత్ కర్కరే, విజయ్ సల్సాకర్ ,మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లకు మనం ఏమి చేసినా వారి ఋణం మనం తీర్చుకోలేము. వారు మన దేశం కోసం వారి ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా పోరాడారు. నిజంగా వారె నిజమైన హీరోలు . వారికి నా హ్రుధయపూర్వక నివాళ్ళు సమర్పిస్తున్నాను .

శుక్రవారం, నవంబర్ 28, 2008

వేమన పద్యం

శుక్రవారం, నవంబర్ 28, 2008

మా అమ్మమ్మా ఈ రోజుల్లో ఎవరు నీతి పద్యాలూ నేర్చుకోవటం లేదని. నా లాంటి పిల్లలకి ఈ పద్యాలు తెలియాలన్న వుద్దేశం తో ఈ పద్యం నాకు నేర్పించి ఇందులో పెట్టమంది నాలాగే మీరు నేర్చుకుంటారు కదూ. ఒకే మరి ముందుగా వేమన పద్యం ఒకటి .

చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియుఁ గొదవ గాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత?
విశ్వదాభిరామ వినుర వేమ!


తా|| ఓ వేమా! వినుము. వైరాగ్యముతో ఆత్మానందము నోండేది. నిర్మలమైన మనస్సుతో ఏ కొంచెము పుణ్యకార్యము చేసిననుఆది చాలా ఘనమైన ఫలము నిచ్చును. చాలా చిన్నదైన మఱ్రి విత్తనము నుండి మహా వృక్షముగా ఎలా పెరుగుతుందో కదా .

గురువారం, నవంబర్ 27, 2008

కార్తీకం

గురువారం, నవంబర్ 27, 2008

కార్తీక మాసం అయ్యిపోయిందండి . ఈ నెలరోజులు శివ నామస్మరణతోని, విష్ణునామస్మరనతోని దేవాలయాలలో దీపారాధనతోని ,పురానలపటనంతోను ,నదీజల స్నానాలతోని , దానధర్మాలతో , గడిచి పోయింది కదండి. ఆ పరమేశ్వరుడు అందరినీ సర్వవిధాలా కాపాడాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయః ,ఓం నమః శివాయః ఓం నమః శివాయఃఓం నమః శివాయః

ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ

గురువారం, నవంబర్ 20, 2008

It might help some one. Atleast one.!

గురువారం, నవంబర్ 20, 2008

ph :09885511641 heart surgery ! free for children. `` SREE SATYA SAI INSTITUTE'' BANGLORE PH:080-28411500
pass to every one. It might help some one. Atleast one.

బుధవారం, నవంబర్ 19, 2008

నేనే వేసా నోచ్చ్ ..........ఈ బొమ్మని

బుధవారం, నవంబర్ 19, 2008


నే.............. నె. ఇది నే.............నె ఈ బొమ్మ వేసిన్దినే నే ఈ బ్లాగులోపెట్టిందినే నే . ఈ పోస్ట్ చేసింది నే నే. ఇది చేసింది నే నే .................అది చేసింది నే నే ..............................! ఈ పెన్సిల్ పట్టింది నే నే . ఈ పేపర్ తెచ్చింది నేనే . ఈ బొమ్మవేసింది నే నే నే ................నె .. అది నే.........నె .

బలే బలే మేజిక్ షో

హలో హలో బాగున్నారా ! మొన్న నేను మేజిక్ షోకి వెళ్లాను . మా అమ్మా నేనూ వెళ్ళాము . మా అమ్మతో వెళ్లి నందుకు నేనూ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను . ఎంత అంటే చెప్పలేను . అమ్మ మొదట రాను అంది . మా తాత , అమ్మమ్మ మా అమ్మను కన్వేన్స్ చేసి పంపారు. నాకోసం ఇష్టం లేకపోయినా వచ్చింది నేను హ్యాపీ.
వెళ్ళామా.................... అక్కడ చాలామంది వున్నారు. హాలు లోకి వెళ్ళటం చాలా కష్టం అయ్యింది. మొత్తానికి లోపలికి వెళ్లి మాసీట్లో కూర్చున్నాము. షో మొదలై సరికి చాలా లేట్ అయ్యింది . మేజిక్ మొదలైంది.
మొదట మెజీషియన్ పెద్ద పేపరు కట్ చేసి చిన్నముక్కలు చేసి తరువాత ఆ పేపర్ ను మళ్ళి పెద్దపేపరు చేసి చూపించాడు.
ఏమిలేదు సింపుల్గా అబ్రకదబ్రా అన్నాడు అంతే పేపరు మాములుగా అయ్యిపోయింది . నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నీను చెప్తుంటే మీకు కుడా ఆశ్చర్యమనిపిస్తోందా.
ఆ తరువాత జిగ్ జాగ్ అమ్మాయి అనే మేజిక్ చేసాడు. మొదట ఒక కాళ్ళి డబ్బాలో ఒక అమ్మాయిని పంపించి కత్తులుతో కోసి డబ్బాలని వేరుచేసాడు . నాకు చాలా భయం వేసి అమ్మఒళ్లోకి వేల్లిపోయ్ పీక పట్టేసుకొని వెళ్ళిపోదామని గోల చేశాను. అమ్మ చెప్పింది మళ్ళి ఆ అమ్మాయిని బయటకు తెస్తాడని. అప్పుడు చుస్తే అతను అబ్రకదబ్ర అని ఆ డబ్బాలని కలిపి అమ్మాయిని మాములుగానే చేసాడు. ఆ అమ్మాయి మళ్ళి ఎలావచ్చిందో నాకు ఇప్పటికీ అర్ధం కాలేదు.
సరే మొత్తం లైట్లు తీసి చిన్నలైట్లో దెయ్యాలతో డాన్సు చేయించాడు. నాకు చాలా భయం వేసింది. అమ్మ వుందిగా అని చూసాను. తరువాత నాజు చాలా ఆశ్చర్యమనిపించినది ఇంకోటి ఒక డబ్బాలో ఒక అమ్మాయిని పెట్టి అబ్రకదబ్ర అని డబ్బా ఓపెన్ చేసాకా అబ్బాయిగా మారిపోయాడు. ఒక డబ్బాలో మెజీషియన్ బేడీలు వేయించుకొని అందులో కూర్చొని తాళం వేయించుకొన్నాడు . కాసేపు అయ్యాకా ఒకపోలీసు మామద్యనుంచి వెళ్లి ఆ డబ్బా ఓపెన్ చేయించాడు . అందులోనుంచి దొంగ వచ్చాడు. మా అమ్మ చెప్పింది ఆ పోలిస్ మేజేషియాన్ అని చెప్పింది. నాకు బలే ఆశ్చర్యం అనిపించింది.
ఇంకా చాలా చూసాము. ఆ షో అయ్యేసరికి చాలా లేటు అయ్యింది. రోడ్డుమీద ఒక్కమనిషి కానీ రిక్షా కాని ఏమి లేవు మాకు చాలా భయ్యం వేసింది. ఇంటికి ఎలావేల్లాలని అప్పుడు మాతాత కనిపించారు . మాకోసం అక్కడికి వచ్చారని తెలిసి . హాయిగా అనిపించి . ఇంటికి వెళ్ళిపోయాము.
తెల్లవార్లూ నాకు ఆ మేజిక్కే కల బలే గా వుంది. బలే బలే మేజిక్కేకదా........ .........

సోమవారం, నవంబర్ 17, 2008

శ్రీ కృష్ణుడు భక్తులకు దర్శనమిచ్చుచున చిత్రం !

సోమవారం, నవంబర్ 17, 2008


మా అమ్మ వేసింది ఈ బొమ్మ. ఈ బొమ్మ నాకు చాలా ఇష్టం. అందుకే మీ ముందు వుంచుతున్నాను.

సోమవారం, నవంబర్ 10, 2008

అమ్మమ్మ ప్రశ్నలు - మనవరాలి జవాబులు

సోమవారం, నవంబర్ 10, 2008

1. ఇప్పుడు కరంటు పోయింది . అగ్గిపెట్టెలో అగ్గిపుల్ల ఒక్కటే ఉన్నది . కొవ్వొత్తి వెలిగించాలి . స్టవ్ వెలిగించాలి . ముందుగా దేనిని వెలిగించాలి ?
2. ఒక గారడివాడు తన దగ్గర ఉన్నా జంతువులతో పడవలో కాలువ దాటవలసి వచ్చింది . పడవలో ఎక్కువ బరువు తీసికువేల్లటానికి వీలు కాదు. మునిగి పోతుంది. గారడీ వానిదగ్గర ఒక పులి , ఒక మేక , ఒక అరటిగెల ఉన్నాయి . వీటిలో ఒక్కొక్కదానినే అవతలి ఒడ్డుకి చేర్చాలి . ముందుగా పులిని తీసుకుని వెళ్తే మేక అరటిగెల తినేస్తుంది . ముందుగా అరటి గెలను తీసుకెళ్తే పులి మేకను తింటుంది .వాటిని అవతలి ఒడ్డు కు చేర్చడం ఎలా ?
3. ఒక కొబ్బరి కాయను పగలుకొట్టకుండా తినగలవా ?
4. టెన్కాయలోంచి వంకాయ తియ్యగలవా ?
5. ఇద్దరన్నదమ్ములు పోతూ ఉండగా వారు 3 అరటిపళ్ళు తినవలసి వచ్చింది . వారు అరటి పళ్ళు ముక్కలు చెయ్యకుండా సమానంగా ఎలా తిన్నారు ?
చెప్పు కోండి చూద్దాం .

శనివారం, నవంబర్ 08, 2008

But I walk ...

శనివారం, నవంబర్ 08, 2008

Frogs jumps ,
Caterpillar ‘s hump ,
Worms wriggle,
Bugs jiggle,
Rabbits hop,
Bugs jiggle,
Horses clop ,
Snakes slide ,
Seagulls glide ,
Mice creep ,
Deer bounce ,
Kittens pounce ,
Lions stalk ,
But---------------- ,
I walk .

శుక్రవారం, నవంబర్ 07, 2008

బావలకు పరీక్ష !

శుక్రవారం, నవంబర్ 07, 2008

నాకు శ్రీ కృష్ణుడంటే చాలా ఇష్టం . ఆయన లీలలు ఎన్ని విన్నా మరలామరలా వినాలనిపిస్తుంది. కృష్ణుడి గురించి చెప్పమని అమ్మమ్మని అడిగినప్పుడు . కృష్ణుడు పెట్టినపరీక్ష గురించి చెప్పింది అమ్మమ్మ. అది మీరు కుడా తెలుసుకోండి బాగుంటుంది.
దుర్యోధనుడు, ధర్మరాజులలో ఎవరు ఉన్నతులో తెలుసుకుందామని కృష్ణపరమాత్మకు అనిపించింది.
దుర్యోధనుని పిలిచి , `బావా ! నేనోపని తలపెట్టాను. మంచితనం , భూతదయ , దానగుణం ఉన్న వ్యక్తి కావాలి . తీసుకురాగాలవా ? అని అడిగాడు . అదెంతపని బావా అంటూ దుర్యోధనుడు ఒక రోజంతా తిరిగినా అటువంటివాడు కనిపించలేదు . `బావా ! నువ్వు చెప్పినంత ఉత్తముడు ఎక్కడా కనిపించలేదు ' అన్నాడు .
ఈసారి కృష్ణుడు ధర్మరాజును పిల్చి , `అన్ని దుర్గుణాలు ముర్తిబవించిన మనిషి కావాలి . తీసుకురాగాలవా ? ' అని అడిగాడు. ధర్మరాజు కుడా రోజంతా అటువంటివాడికోసం వెతికి , వెతికి కనిపించక తిరుగొచ్చాడు . అన్ని దుర్గుణాలు ఉన్న మనిషి ఒక్కడు కనిపించలేదు బావా ! ' అన్నాడు.
దుర్యోధనుడేమో మంచివారు లేరన్నాడు , ధర్మరాజేమో చెడ్డవారులేరన్నాడు .
మంచి , చేడులనేవి వ్యక్తుల్లో ఉండవు. మనం చూసే చూపులో ఉంటాయి.
ఇది అమ్మమ్మ చెప్పిన కధ .బాగుంది కదండి..............

ఆదివారం, నవంబర్ 02, 2008

నాగుల చవితి

ఆదివారం, నవంబర్ 02, 2008

శుక్రవారం, అక్టోబర్ 31, 2008

అమ్మమ్మ ప్రశ్నలు -మనవరాలి జవాబులు. (జ)

శుక్రవారం, అక్టోబర్ 31, 2008


1. తల వున్నా కళ్లు లేనిధి ఏది ?
జ. గుండుసూది .
2. కన్ను ఉన్నా తల లేనిది ఏది ?
జ. సూది.
3. కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది ఏది ?
జ. కుర్చీ.
4. అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది ఏది ?
జ. గజం బద్ధ.
5. పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏది ?
జ. పుస్తకం .
6. ఒక పిల్లి తన జీవితంలో విసిగివేసారి కుటుంబ బారం మోయలేక , చనిపోవాలని నిర్ణయించుకొని , కృష్ణా బ్యారేజిపైన నిలబడి , దేవుడిని ప్రార్దించింది . ఐతే అది ఏమని ప్రార్ధించింది ?
జ. మియ్యాం, మియ్యాం.
7. తొమ్మిది లో నుండి ఐదు తీసేస్తే ఎంత ?
జ. తొమ్మిది లో నుండి ఐదు తీసి - వేస్తే తొమ్మిదే కదా.
8. 1 నుండి 100 అంకెలలో ఎన్ని వొకట్లు వున్నాయి ?
జ. 21 ఒకట్లు వున్నాయి.
9. 1 నుండి 100 అంకెలలో మొత్తము 11 అంకెలు ఏమిటి?
జ. 1 నుండి 100 అంకెలలో మొత్తం 11 సున్నాలు ,( జీరోలు ) వున్నాయి.
10. తోటమాలి తోటవద్ద కు వెళ్లి ముందుగా ఏమి చేస్తాడు ?
జ. తోటమాలి తోటవద్దకు వెళ్లి ముందుగా లోపలికి పాదం మోపుతాడు. అదే కదాచేసేది .

" చెడపకురా చెడెదవు "

ఘోరి మహమద్ అనీక్ పర్యాయములు దేశముపై దండెత్తి ప్రజలకు హాని కలిగించేవాడు. ఒకసారి పృధ్వీరాజు పై దండెత్తగా అతడు ఘోరిని పట్టివేసాడు. కాని, అతని ప్రార్ధనను మన్నించి తిరిగి వదిలిపెట్టాడు. ఈ ఘోరీ తిరిగి ఆరు పర్యాయాలు పృద్వీరాజుపై దండెత్తి ఓడిపోయాడు. ఈ ఆరు పర్యాయములు పృధ్వీరాజు అతనిని క్షమించి వదిలాడు. కాని , ఏఢవసారి పృధ్వీరాజు యొక్క మామ సహాయంతో ఘోరీ తిరిగి దండెత్తి వచ్చాడు. ఈ సారి మాత్రం పృధ్వీరాజు ఓడిపోయాడు. ఆరు పర్యాయములు అతనిని క్షమించి వదిలి పెట్టిన పృధ్వీరాజు పై ఎంత కృతజ్ఞత ఉండాలి? కాని , కఠిన హృధయుడైన ఘోరీ కృతఘ్నతుడుగా మారిపోయాడు. ఏమిచేసాడో తెలుసా ................ ! పృధ్వీరాజు కళ్లు పొడిపించేసాడు ఘోరీ .
అసలు చాలాబాద కలిగించే విషయమే ................... ! కదండి.
సరే ఇక తరువాత ఏమైందంటే...................
ఒకనాడు పృధ్వీరాజు యొక్క మంత్రి ఘోరీ దగ్గరకు వచ్చి ఈ పృధ్వీరాజు సామాన్యుడు కాదు , అతడు శబ్దభేది బాగా తెలిసినవాడు. శబ్ధమునుబట్టి అంబును వదలగలడు. అతనికి కన్నులు లేవని అనుకుంటున్నావు. ఇది చాలా పొరపాటు. చర్మచక్షువులు లేవు కాని , అతనికి జ్ఞాన చక్షువులున్నవి . కావాలంటే ఋజువు చేయగలను" , అని చెప్పి చివరకు ఘోరీ మహమ్మదును ఒప్పించాడు . మరునాడు ఘోరీ మహమ్మదు దగ్గర ఒక గంటను పెట్టాడు. నూరు అడుగుల దూరంలో ప్రుద్వీరాజును కుర్చోపెట్టాడు . ఆ గంట కొట్టేటప్పటికి దాని శబ్ధమును బట్టి గ్రుడ్డివాడైన ప్రుద్వీరాజు అంభును వడిచాడు. ఆ గంట ముక్కలు ముక్కలైంది. ఆశ్చర్యకరంగా చూసాడు ఘోరీ . కాని , పృద్వీరాజుకు అతను మంత్రి ఏమైనా గుర్తులు చెప్పి ఉండవచ్చునని అనుమానించాడు. ఘోరీ మహమ్మదు మరొకసారి పెట్టాడు గంటను. పృద్వీరాజు తిరిగి దాన్నీముక్కలు చేసాడు. ఈ రకంగా చేస్తూ రాగా ఘోరీ కి అహంకారం ఎక్కువైపోయి. " కనులు మాత్రమే తీసి పోరపాటి చేశాను. ఇంక అతని ప్రాణమే తీయాలి " , అనుకున్నాడు. మరొకసారి పర్యాయం గంటకు ముందు తెచ్చి పెట్టాడు. పృద్వీరాజు భగవంతుని స్మరించాడు. ఉపకారికి అపకారం చేసే ఈ కృతఘ్నన్ని శిక్షించాలనే ఉద్దేశ్యముతో భగవంతుడు పృద్వీరాజు చేతిలో చేరాడు. అతడు బాణము విడిచేసరికి అది నేరుగా ఘోరీ కంఠములో గ్రుచ్చుకోన్నది. వెనువెంటనే ఘోరీ ప్రాణము విడిచాడు.
దైవ చింతన ఎంత సహాయ పడుతుందో చూసారా..................... ! ఆ సభలోనే పృద్వీరాజును చంపడానికి సిద్ధమైయుమ్దినాడు. ఘోరిమహమ్మదు. " చెడపకురా చెడెదవు " అన్నట్లు గా ఇతరులను చెడపటానికి మనం ప్రయత్నించి నప్పుడు దైవం మనలనే చెడుపుతాడు.

గురువారం, అక్టోబర్ 30, 2008

అమ్మమ్మ ప్రశ్నలు -మనవరాలి జవాబులు.

గురువారం, అక్టోబర్ 30, 2008

1. తల వున్నా కళ్లు లేనిధి ఏది ?
2. కన్ను ఉన్నా తల లేనిది ఏది ?
3. కాళ్ళు ఉన్నా పాదాలు లేనిది ఏది ?
4. అడుగులు ఉన్నా కాళ్ళు లేనిది ఏది ?
5. పత్రాలు ఉన్నా కొమ్మలు లేనిది ఏది ?
6. ఒక పిల్లి తన జీవితంలో విసిగివేసారి కుటుంబ బారం మోయలేక , చనిపోవాలని నిర్ణయించుకొని , కృష్ణా బ్యారేజిపైన నిలబడి , దేవుడిని ప్రార్దించింది . ఐతే అది ఏమని ప్రార్ధించింది ?
7. తొమ్మిది లో నుండి ఐదు తీసేస్తే ఎంత ?
8. 1 నుండి 100 అంకెలలో ఎన్ని వొకట్లు వున్నాయి ?
9. 1 నుండి 100 అంకెలలో మొత్తము 11 అంకెలు ఏమిటి?
10. తోటమాలి తోటవద్ద కు వెళ్లి ముందుగా ఏమి చేస్తాడు ?
ఇవి మా అమ్మమ్మ నన్ను అడిగిన ప్రశ్నలు . కానీ సమాదానాలు ఇప్పుడు చెప్పను తరువాత చెప్తా ముందు మీరుకూడా ట్రై చెయ్యండి.

మంగళవారం, అక్టోబర్ 28, 2008

.....డం......డాం....... డాం ...................డం .........

మంగళవారం, అక్టోబర్ 28, 2008

WISH YOU HAPPY DIWAALI . దీపావళి బాగా జరుపుకోండి. ఎంత సరదాగా ఉంటుందో అంటే ప్రమాదం గా వుంటుంది. చాలా జాగ్రతాగావుండాలి. నిప్పుతో చాలగాటాలు వద్దు. పెద్దలు మాటలు వినండి. పెద్దగా శబ్దం వచ్చేవి దయచేసి వాడవద్దు. అవి చెవులకు హాని చేస్తాయి. పిల్లలూ తొందరపడి మీరు టపాసులు పేల్చకండి పెద్దవాళ్ళు వచ్చి మీద్దర వున్నకా మీరు కాల్చండి.. టపాసులు దూరంగా . పెట్టుకొని వెలిగించండి. మీ పెద్దవాళ్ళు చెప్పిన విధం గా విని టపాసు పెలుకోంది. సంతోషంగా దీపావళి . జరుకోండి. ఓకే నా........................ WISH YOU HAPPY DIWAALI .
డాం.......డాం.......భూఉం ..................... భూఊఊఊఊఊఊఊమ్ ....................దాఆఆఆఆఆఆఆఆఆఅమ్ .

మీ ఇంట్లో దీపకాంతి తో .............??????

మీ ఇంట్లో కి ఏవైపు నుండైనా దీప కాంతి ప్రవేశిస్తూ వుంటుంది.ఎదురింటి దీపాల కాంతి, మీ ఇంటిలోకి ప్రక్కనో,వేనుకనో ఒక దేవాలయం గాని, మాట సంబందమైన మందిరారాలుకాని సహజంగానే వుంటాయి. వాటిలోని వెలిగించిన దీప కాంతి మీ ఇంట్లోకి ప్రవేశించ వచ్చు. ఎదురు గానో , వెనుకవైపున వీది లైట్లు సర్వసాదారణంగా నేడు ప్రతీ పట్నాలలోని పల్లెల్లోని ఉంటున్నాయి. ఆ లైట్లు కాంతి మీ ఇంట్లో కి ఏ దిశగా ప్రవేశిస్తే ఫలితాలు ఎలా వుంటాయో తెలుసుకోండి.
1. దేవుని గుడి, ప్రార్ధన మందిరాలలో నుండి వెలువడే దీప కాంతులు మీ ఇంట్లోకి ఏ వైపు నుండి ప్రవేశించినా కాస్త నష్టాలు వుంటాయి. వీధి వాకిలిలో నుండి మీ ఇంట్లోకి ప్రవేశిస్తే మరింత హాని. సాద్యమైనంత వరకు ఆ వెలుగు ఇంట్లోకి ప్రవేసించకుండా చూసుకోండి.
2. మీ చుట్టు ప్రక్కల ఏ దిసలోనైనా బ్రాహ్మణు ఇల్లు వుండి మీ ఇంటి దీపకాంతి వారి ఇంటిలోనికి ప్రవేసిన్చినట్లయితే మీ సిరి సంపదలు క్రమంగా వారి ఇంటికి చేరుతాయి.
౩. మీ ఇంట్లో వెలిగించిన దీపాలు తుర్పుముఖంగాను, ఉత్తరం దిసగాను ఉంచినా మీ ఇంట్లో శ్రీ లక్ష్మి దేవి సదా కాపురం ఉంటుంది.
4. ఇంట్లో పడమర దిశలో దీపం వెలిగించి వుంచిన , దక్షిణ డిస గా వుంచిన క్రమంగా సంపద క్షినించి పోతుంది.
5. మీ ఇంట్లో దీప కాంతి నాలుగు దిశలా ప్రవేశిస్తే మీ ఇల్లుసిరి తాండవిస్తుంది.
6. సంద్యా దీపం మొదలు ఉషోదయం వరకు ఏ ఇంట దీపం వెలుగుతుందో ఆ అష్ట ఐశ్వర్యములు పుష్కలంగా వుంటాయి.
7.సాయం సంద్యా సమయాలలో ఇంటి వెనుక గుమ్మనికెదురుగా వుండే తులసి కోట ముందు ప్రతీ రోజు దీపం వెలిగించి పెట్టినచో ఇంట్లో లక్ష్మి కాపురం ఉంటుంది.
8. ప్రతీ ఇంటా పూజా మందిరం ఉంటుంది. ఆ మంది రామ్ లో ఉదయం, సాయంత్రం దీపం వెలిగిస్తే . ఆ ఇంట సిరి సంపదలు వుంటాయి.
ఇవ్వన్నీ నాకు ఎలా తెలిసాయనుకుంటూన్నారా ? మా అమ్మ తో మా అమ్మమ్మ చెప్తే నేను విన్నా అవి మీకు చెప్పాలని పించి వెంటనే మీకు అందిస్తున్నాను. సింపుల్. .

శనివారం, అక్టోబర్ 25, 2008

శ్రీ లక్ష్మీ కటాక్ష రహస్యం !

శనివారం, అక్టోబర్ 25, 2008

అన్దరూ కోరుకొనే లక్ష్మి కొందరికే ఎందుకు దక్కుతుంది ? కొందరికి దక్కినట్టే దక్కి ఎందుకు జారిపోతుంది ? దీనికి అదృష్టదురద్రుస్తాలేనా కారణం లేదా వేరే కారణాలు వున్నాయా ?
శ్రీ మహాలక్ష్మి చూపులు ఎలావుంటాయంటే , దుర్మార్గుల విషయంలో అవి పరమ క్రూరంగా ఉంటాయట. అవే చూపులు తన భక్తులైన దీనులపై దయను కురిపిస్తాయట . దారిద్ర్యమనే అరణ్యాన్ని ఇట్టే దహించివేసి ఏంటో ఉదారంగా సంపదను అనుగాహిస్తాయట . ఓ తల్లీ, అలాంటి నీ చల్లనిచుపులతో నా దురద్రుస్టాన్ని పోగుట్టు అని ప్రార్ధిస్తాడు జగన్నాధ పండితరాయలు తన `లక్ష్మి కరునాలహరి'లో.
దీపావళి రోజు సముజ్వల దిపతోరనామద్య వైభవలక్ష్మిని నిలుపుకొని భక్తి శ్రద్దలతో పూజిమ్చుకొనె రోజు . అసలు దీపమే లక్ష్మి. చీకటినుంచి వెలుగులోకి ప్రయాణించడమే జ్ఞానం , అదే సంపద, జ్ఞానము సంపదా బిన్నమైనవి కావు. ఒకటి వుంటే రెండోది ఉన్నట్టే. ఇతరులను వంచించినచో, అవినీతి మార్గాలలోనో ఐశ్వర్యాన్ని సంపాదిస్తే చాలను కుంటారు చాలామంది. అలాంటివారిని లక్ష్మి వరిమ్చిన్నట్టు కనిపించినా అది చంచలం . దయా, సేవాబావం, శ్రమ, వినయం, వివేకం ఉన్నచ్తే లక్ష్మి స్థిరంగా ఉంటంది. లక్ష్మీ కతాక్షసిద్ధిలోని అసలు రహస్యం ఇదే. లక్ష్మీదేవి-----ఆదిలక్ష్మీ, దైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అనే అష్టరుపాలలో ఉంటుందని మనకు తెలుసు. వీటిలో `విద్యాలక్ష్మి' అంటే, జ్ఞానం వివేకం వంటి సద్గునసంపద అని కుడా అర్ధం చేసుకోవాలి. అటువంటి లక్ష్మితత్వాన్ని అందరుసంపాదించాలి.మంచి మనసే లక్ష్మికి సేఫ్టీ లాకరు ! .
లక్ష్మి ఎక్కడవుంతుందని నారదుడు శ్రీ మహావిష్ణువుని అడుగగా....................
శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు అవి ఏమిటంటే ................................
`అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అదీనంలో ఉంటే , నీనేమో నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి మొండు నీను చెప్పబోయే మాటలు వినండి - అమ్తూ.......... లక్ష్మి ఎవరెవరివద్ద ఉంటుందో, ఎవరివద్దవుండదో , వివరించాడు. లక్ష్మిని కోరుకునే వారందరూ తప్పకుండా దృష్టిలో ఉంచుకోవలసిన విషయాలివి.
భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు. శంఖద్వని వినిపించని చోటా, తులసిని పూజించని చోట, శంఖరుని అర్చించని చోట , బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజనసత్కారాలు జరగని చోట , లక్ష్మి నివసించదు. ఇల్లు కలకలాడుతు లేని చోట , ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట , విష్ణువును ఆరాధించకుండా ఏకాదశి , జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.

హృదయోమ్లో పవిత్రత లోపించినా, ఇతరులను హింసింస్తున్నా. ఉత్తములను నిమ్దిస్తున్నా లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. అనవసరం గా గడ్డిపరకలను తెమ్చినా, చట్లను కులగోట్టినా లక్ష్మి కటాక్షం లోపిస్తుంది. నిరాసావాధులను, సుర్యోదయ సమయంలో భోజనం చేసే వాని, తడి పాదాలతో నిద్రపోయేవారిని , వివస్త్రులై నిద్రపోయేవారిని, తలక్రిందులు గా మాట్లాడేవారిని, తమ తలకు రాసుకున్న నూనెనుఇతరులకు అంటించే వారిని కుడా లక్ష్మి వరించదు..
శ్రీ హరి దివ్యచరిత్ర, గుణ గానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి వోరాజిల్లుతుంది.
ఇలా శ్రీ హరి లక్ష్మీకటాక్షం ఎలా కలుగుతుందో, ఎలాకలగాదో చెప్పారు.
సంపద మన ఆదీనం లో ఉండాలి కాని, మనం సంపద ఆదీనం లో ఉండకుడదు . ఏకాస్త గర్వించిన, అహంకరిమ్చినా ఐశ్వర్యం జారిపోతుంది. సద్వినియోగమే సంపద పరమార్ధము. అది విస్మరించినా లక్ష్మి వీడిపోతుంది. ఇదే లక్ష్మి కటాక్ష రహస్యం.....

శుక్రవారం, అక్టోబర్ 24, 2008

దీపావళి రోజు చేయవలసినవి .......!

శుక్రవారం, అక్టోబర్ 24, 2008

దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలా మందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలు చేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలో చాలామంది.
ఐతే మా అమ్మమ్మ పూర్వపు పద్దతు లు చెప్పింది అవి ఏమిటంటే :
నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించే రోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములో నువ్వులనూనెతో తలంతుపోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలో నువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్ని జలవనరులలోకి గంగాదేవి రోజుల్లో
ప్రవేశిస్తుంది . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట . నరక బాధలు తప్పుతాయ . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . లోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి.
ఆ తరువాత ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః
దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించిశ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,
సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే అని అమ్మమ్మ చెప్పింది. సరే అమ్మమ్మ చెప్పినవి దీపావళి రోజు పాటిస్తారు కధూ ! మరి నేను ఉంటా మరి బాయ్ ................................
.

బుధవారం, అక్టోబర్ 22, 2008

జై జవాన్ ............జై కిసాన్...........!

బుధవారం, అక్టోబర్ 22, 2008

అరే ! ఏమిటిది అనుకుంటున్నారా ? ఏమి లేదండి ఈ రోజు మనం అందరు గుర్తు పెట్టుకోవలసిన రోజు.
అయ్యో ఏమిటి ఆలోచిస్తున్నారు ? ఈ రోజు మనం హాయిగా తింటున్నాము అతను లేకపొతే మనకు చాలాకష్టం. ఎవరనుకుంటున్నారా? మీరు ఎక్కవ ఆలోచించవద్దు . అతను ఎవరోకాదు దుక్కు దున్నీ, నీరు పెట్టి , నారు నాటి, పంటలు పండించే రైతు.
ఈ రోజు" రైతు దినోత్సవం "
భారతీయ రైతులకు అగ్రనాయకులల్లో ఒకరైన శ్రీ చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవం ను పురస్కరించుకొని ప్రతీ సవత్సరం అక్టోబర్ ఇరవైరెండున రైతు దినోత్సవం ను జరుపుకుంటున్నారు.
రైతులనేవారు సమాజానికి రైతు వెన్నెముక్కలాంటివారు . రైతు పండించే పంటలమీదే మొత్తం సమాజం అంతా ఆదారపడి వుంది అంటే మనం ఆశ్చర్య పడనక్కరలేదు. రకరకాలైన పంటలను పండించే రైతులు, రాత్రి లేదు, పగలు లేదు ,ఎండనకా, వాననకా కష్టపడతారు.
ఈ దేశానికైనా సామాజిక, ఆర్ధిక వ్యవస్థ ఎక్కువ శాతం ఆధారిపడి వుంది. ఇంత కష్టపడే రైతుకు జీవన పరిస్థితి అంత బాగోలేదు . ఇది చాలా బాధాకరమైన విషయం.
ప్రభుత్వం వీరికి సరైన సహకారం అందిస్తే బాగుంటుంది . వారి కి వారి కుటుంబానికి విద్యకు, ఆరోగ్యానికి , ఆధునిక వ్యవసాయ పద్దతులు లో శిక్షణ ఇచ్చి విత్తనాలు , ఎరువులు, వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు ఇప్పించాలి. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విషయాలలో సరైన రేటు ఇవ్వాలి. ఈ వస్తువు కొన్న అమ్మినా రైతులు మోసపోకుండా జాగ్రత్త లు తీసుకోవాలి. రైతు కస్టపడి పండిస్తే మధ్యలో దారాలు లాభం పొందుతున్నారు. ఇలాజరగకుండా చూడాలి.
రాష్ట్రంలో సగటున ఒక్కో రైతుకు ఉన్న భూమి.. 3 ఎకరాలు.
ఒకటింపావు ఎకరా కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు… 45.70 లక్షలు.
రెండున్నర ఎకరాల కన్నా తక్కువ ఉన్నవారు… 28.47 లక్షల మంది. ఐదెకరాల లోపు భూమి కలిగినవారు 26.39 లక్షల మంది.
50 ఎకరాలకు మించిన భూమి ఉన్నవారు… కేవలం 6920 మంది.
ఈ రకం గా వున్నా వారు అంత కాస్త పడుతున్న కష్టానికి తగ్గ ఫలితం దొరకటం లేధు. రైతులకి తగిన కష్టఫలం దొరకకపోతే రైతుకి వ్యవసాయం మీద విరక్తి కలిగి వారు కుడా ఉద్యోగాలకోసం వెళ్ళిపోతున్నారు.
ప్రభుత్వం వారి కష్టాన్ని గుర్తించి వారి అవసరాలు తీర్చి వారిని ఉత్సాహపరచి , వారిని సత్కరించాలి.
లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ .........జై కిసాన్ .........అన్నారు . ఇది నిజం దేశాన్ని బోర్డర్ దగ్గర వున్నా జవాను, బోర్డరు లోపల వున్నా కిసాను మనకి చాలా అవసరం. వారి విలువలు మనం కాపాడాలి . రైతే రాజు అన్న నానుడి నిజం చెయ్యాలి. విష్ యు హ్యాపీ కిసాన్ డే.

మంగళవారం, అక్టోబర్ 21, 2008

చందమామ రావే.................జాబిల్లి రావే..............

మంగళవారం, అక్టోబర్ 21, 2008

ఇప్పటిదాక్యా రాత్రి వేళ్ళ మనం భోజనం చెయ్యక మనం మారాం చేస్తే.............. మన అమ్మలు చందమామ రావే జాబిల్లి రావే ......... అనే పాటలు పాడుతూ మనలను మైమరిపించి మనకు భోజనం తినిపించేవారు. మీకుకూడా గుర్తు వుండేవుంటుంది. మనం ఈచంధమామ కధలు విన్నాం కదా. ఎన్నో కధలు ఎన్నెన్నో............... పూర్వం నుండి రాముని ధగ్గర నుండి చంద్రుడిగురించి వాళ్ళ అమ్మలు కధలు చెప్పడం మనకు కూడా మన అమ్మలు చెప్పారు కధండి. అయితే కధలే మనవారికి స్పూర్తి అయ్యింది. కాభోలు. ఆనాటి పిల్లలు చంద్రుడు దిగి వస్తాడు అన్కొని పెద్దయ్యాకా రాడని గ్రహించి అప్పటి చంద్రుడిని చేరాలన్న ఆశతో ప్రయత్నించి ఈనాటి కి ప్రయత్నాన్ని సఫలి కృతం చేసుకోబోతున్నాడు. ఇది నిజంగా సంతోషించవలసిన విషయం . రేపు చంద్రయ్యాన్ ప్రోయోగం చెయ్యబోతున్నారు .ఇది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. చంధమామయ్య రాడు మనమే వెళ్ళాలి . బాగుంది కదా..

భారత దేశం చంద్రుడిపైకి ప్రయోగించనున్న తోలి మానవరహిత అంతరిక్షనౌక చంద్రయాన్ కౌంట్ డౌన్ పూర్తి కావస్తోంది . నెల్లూరు జిల్లా లోని శ్రీహరికోటలోని సతీస్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం ఉదయం .౨౦ గంటలకు జరిగే ప్రయోగం సర్వం సిద్దం అయ్యింది.చంద్రుడికి వంద కిలోమీటర్ల కక్షలోకి చేరుకొనేందుకు చంద్రయాన్ భూమి చుట్టూ రెండు దసలల్లో బ్రమనాలు జరుపుతుంది. వచ్చెనేల ఎనిమిది తేదీకల్లా ఇది నిర్దిష్ట కక్షలోకి చేరుతుంది .చంద్రయాన్ ప్రయోగం కోసం భారతీయ శాత్రవేత్తలే కాకుండా విదేసియులు కుడా పాలుపంచుకున్నారు. చిత్రాలుతో చంద్రుడి ఉపరితలం కళ్ళకు కన్బదేటట్టు వుండతానికి దానికి కెమెరా కుడా వుంచారు.

ప్రయోగం వెనకాల చాలాకారనాలు కనబడుతున్నాయి.
భవిషత్తులో మనిషి అవసరాలు ను భూమి తీర్చలేని పరిస్థితి వస్తే.......... చంద్రుడి పై శాస్వత నివాసాలు ఏర్పరచుకోవచ్చు.
భూమి , సౌరకుటుంబం , విశ్వం , సంబంధించిన చరిత్ర ను ఆవిర్ చంద్రుడిపై ప్రయోగాలు వుపకరిస్తాయి. మనిషి నివసించే అవకాసం ఉందని అనుకుంటున్నా అంగారకుడి తో పాటు మిగతా గ్రహాలపైనా ప్రయోగించటానికి వీలుగా వుంటుంది.

భూమి నుండి చన్ధ్రుదుఇ మద్య దూరం మూడు లక్షల ఏనాబైనాలుగు వేల నాలుగు వందల మూడు కిలోమీటర్లు.

చంద్రుడు భూమి తో పోలిస్తే నాలుగో వంతు ఉంటుంది.

భూమి నుండి చూస్తే చంద్రుడు ఒక వైపే కనిపిస్తుంది. రెండోవైపు తెలుసుకున్దురు.

ఒకే మరి రేపు జరిగే చంద్రయాన్ ప్రయోగం తో భారతీయ తివర్ణ పతాకం ను ఎగరవస్తారు. మన జెండా చంద్రుడిమీద సగర్వంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. అది తలచుకుంటేనే నా వొళ్ళు గగుర్పొడుస్తోంది. నాకు చాలా గర్వంగాకుడా వుంది.

ఐతే ఇక పై చంద్రుడి గురించి అమ్మలు కొత్త కధలు తయారు చేసుకోవాలి మరి.

ఈ చంద్రయాన్ ప్రయోగం విజయవంతం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటూ.

విష్ ఆల్ ది బెస్ట్ .

శుక్రవారం, అక్టోబర్ 17, 2008

నొప్పించక తానొప్పక

శుక్రవారం, అక్టోబర్ 17, 2008

ఒక వూరిలో ఒక ధనవంతుడుండేవాడు. అతనిని పరీక్షించాలని శ్రీ లక్ష్మి ,దరిద్ర లక్ష్మి ఇద్దరు వచ్చారు. అతని వద్దకు వచ్చి అతనితో "మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పగలవా "? అని అడిగారు. ధనవంతుడు గొప్ప చిక్కులో పడ్డాడు. శ్రీ లక్ష్మి అందంగా ఉన్నదంటే దరిద్రదేవత తనను పట్టుకొని పీడించవచ్చు. దరిద్ర లక్ష్మి అందంగా ఉన్నదంటే శ్రీ లక్ష్మి కోపంవచ్చి వెళ్లి పోతుందేమో! అని మానసిక ఆందోల్లనపడుతూ ఆలోచించాడు.అతనికి ఒక గోప్పయుక్తి స్ఫురించింది. వారితో" అమ్మలారా..........! మీరు అటు ఇటు నడవండమ్మా ! మీలో ఎవరు అందంగా ఉంటారో చెప్తాను" అన్నాడు. మరల " ఒకరు రండి. మరొకరు పొడి . ఆవిధంగా నడవండి" అన్నాడు. వారట్లే చేసారు. ధనవంతుడు చిరునవ్వుతో గంభీరంగా "అమ్మా! లక్ష్మిదేవి ! నీవు వస్తున్నప్పుడు చాలా అందంగా వుంటావమ్మా ".
"అమ్మా ! దరిద్ర లక్ష్మీ ! నీవు పోతున్నప్పుడు చాలా అందంగా వుతావంమా ".అన్నాడు.ఈ విధంగా యుక్తిగా ఇద్దరినీ తృప్తి పరచాడు. ప్రతీవారికి యుక్తి అవసరం . యుక్తి వలన శక్తీ సంపాదించవచ్చు. ఉపాయం తో అపాయాన్నుంది తప్పించుకోవచ్చు .

గురువారం, అక్టోబర్ 16, 2008

తిట్టినవారే...........!

గురువారం, అక్టోబర్ 16, 2008

" నన్ను అనవసరంగా ప్రతీవారు తిడుతున్నారు స్వామీ"! అన్నాడు ఒక భక్తుడు. రమణమహర్షితో,
రమణమహర్షి ఏమి మాటలాడలేదు.
`అన్యాయముగా తిట్టడం వల్లనా నాకు చాలా కోపం వస్తోంది, ఏమి చేయమంటారు?' అని అడిగాడు ఆ భక్తుడు.
`ఏముంది ? నువ్వు కుడా వాళ్ళతో చేరి నిన్ను నువ్వే తిట్టేసుకో , సరిపోతుంది' అన్నారు మహర్షి.
`అదేంటి స్వామీ అలా అన్నారు ?' అని తెల్ల మొహం వేసాడు భక్తుడు.
`వాళ్లు తిట్టేది నీ శరీరాన్నే కదయ్యా !
కోపతాపాలతో నిండిన ఈ శరీరం కన్నా నీకు శత్రువెవరు ? కనుక తిట్టేవల్లంతా నీకు మేలే చేస్తూన్నారు. పోగిడేవాల్లకన్నా వాళ్ళే నీకు నిజమైన మిత్రులు' అన్నారు మహర్షి.
"శరీరమే నేను" అనుకోవద్దని రమణ మహర్షి భోధ.

మంగళవారం, అక్టోబర్ 14, 2008

ప్రశ్నకు ప్రశ్న ! ..........

మంగళవారం, అక్టోబర్ 14, 2008

మనలో చాలా మంది ప్రతీ దానికి ప్రశ్నిస్తూ వుంటారు. వాటికి సమాదానం చెప్పలేనివి కొన్ని వుంటాయి. అల్లాంటిదాని గురించే మీకు చెప్తాను. నేను అస్తమాను అందరినీ ప్రతీ దాని గురించి ప్రశ్నలు అడుగుతాను . ఐతే ఈ రోజు కూడా రోజులాగే మా అమ్మమ్మని కనిపించిన ప్రతీదాని గురించి అడుగుతున్నాను. అప్పుడు మా అమ్మమ్మ ఈ కద చెప్పింది. ఆ కద మీకు నేను అందిస్తున్నాను. ఓకే నా.

ఒక పిల్లవాడు నడచుకుంటూ వెళ్తున్నాడు . అతని చేతిలో వెలుగుతున్న క్రొవ్వొత్తి ని చూసి ఒక పెద్ద మనిషి అడిగాడు " ఓ అబ్బాయీ ఆవెలుగు ఎక్కడనుండి వస్త్తోంది "అని.
ఆ పిల్లవాడు చాలా గడుగ్గాయి వెంటనే ఆ క్రొవ్వొత్తి ఆర్పివేసి , "ముందు ఆ వెలుగు ఎక్కడకు వెళ్లిందో చెప్పండి, " ఆ తరువాత ఆ వెలుగు ఎక్కడనుండి వస్తోందో చెప్తాను అన్నాడు". ఆ పిల్లవాడు.

కొన్ని ప్రశ్నలు పైకి చిన్నవి గానే కనిపస్తాయి . సమాదానం వెతకబోయినప్పుడు తెలుస్తుంది అవి ఎంత కష్టమైనవో అని .
మా అమ్మమ్మ ఇంకా చెప్పిందీ ........... ఏదైనా ప్రశ్నలు అడిగేముందు దాని గురించి ఆలోచించి , పరిశిలించి , పరిశోధించి అడగాలని చెప్పింది. దాని వల్ల మనకు మంచి ఆలోచనాశక్తి వస్తుందని చెప్పింది. అంతేకాకుండా తెలివితేటలు పెరుగుతుందని చెప్పింది. అమ్మమ్మ బాగా చెప్పింది కదండీ.

శనివారం, అక్టోబర్ 11, 2008

నేనే ...........

శనివారం, అక్టోబర్ 11, 2008

నేనే శ్రీ వైష్ణవినండి. నేను దసరా రోజు గుడికి వేల్తున్నప్పటి ఫోటో ఇది . మా అమ్మమ్మ రావటం లేదు నేను ఒక్కదాన్నే గుడికి వెళ్తున్నాను. అవతల చాలా పని వుంది. పండగ కదండి. వెరైటి వంటలు చెయ్యమంటున్నారు. నేనేమో పట్టు చీర కట్టు కొని వున్నా మళ్ళి చీర మార్చాలంటే ఎంత చికాకో. మా వాళ్లు వంటల గురించి నన్ను అల్లరి పెట్టటం ఎమైనా భాగుందా ......... మీరే చెప్పండి . ఫస్ట్ ఐతే గుడికి వెళ్లాను లేండి . మొత్తానికి దసరా బాగానే జరుపుకున్నాం లేండి. మీరు కుడా బాగా జరుపుకున్నారా. సరే మరి వుంటానండి. నాకు చాలా పని వుంది మరి. బాయ్ బాయ్.

సూక్తండీ ........... !!!!

ఆశావాది మరచిపోయేందుకు నవ్వుతాడు.
నిరాశావాది నవ్వటమే మరచిపోతాడు.

లోక సహజం!

చందనతరుషు భుజంగా
జలేషు కమలాని తత్ర చ గ్రాహాః !
గుణఘాతినశ్చ భోగే
ఖలా న చ సుఖాన్యవిఘ్నాని !!
పరిమళం వెదజల్లే గంధంపు చెట్లలో పాములు ; కమలాలు ఉండే నీళ్ళలో మొసళ్ళు ; భోగాల్లో గుణహీనులైన నీచులు ఉండడం లోక సహజం. విఘ్నాలు లేకుండా సుఖాలు కలుగవు.


శుక్రవారం, అక్టోబర్ 10, 2008

అట్ల తద్దోయ్......

శుక్రవారం, అక్టోబర్ 10, 2008

అట్ల తద్దోయ్ - ఆరట్లోయ్
ముద్దపప్పోయ్ -మూడట్లోయ్
అయ్యో మీకు చెప్పడం మరచిపోయా ఈ పాట ఏమిటను కుంటున్నారా ? ఏమి లేదండి నేను చెప్తున్నది అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు .
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
ఒక వూర్లో రాజు గారమ్మాయి, వెలమవారి పిల్ల, బ్రాహ్మ్నవారి పిల్లా, కోమటిపిల్ల,నలుగురు వివాహం కాకముందు చిన్నతనంలో నే అట్లాతదియనోము చీద్దమనుకున్నారు తదియనాడు వుపవాసం వున్నారు.రాజుగారంమయి అతిసుకుమారి కనుక సాయింత్రం కాగానే ముఖము వాడి ముఉర్చపోయినది. వీదిలూనుంది అన్నగారు వచ్చి అమ్మా చెల్లెమ్మ ఏది అని అడుగుగా నాయనా అట్లతదియ నోము చేద్దమనుకుని వుపవాసముంది . చంద్రోదయం వరకు వుండలేక మూర్చపొయినధి అని చెప్పింది. అప్పుడు అన్నయ్య ఏమి దారని అలోచించి వెంటనే దురంగావున్న చింత చెట్టుకు అద్దం పెట్టి దానికి ఎదురుగా అగ్గిపెట్టి చెల్లిలిని లేపి అదిగో చంద్రుడు ఉదయించాడు అనిచెప్పగా నిద్రకలనవున్న నిజంగా చెంద్రుదని బావించి ,రాకుమారి ఫలహారంలు చేసెను. కొన్నాళ్ళకు వివాహం చేయగా వయసు మీద పడిన వాడు భర్తగా సంప్రప్తంయ్యేను. నీను అట్లతదియ నోము నోచినా నాకు ఇదేమీ ప్రారబ్దం అని భాద పడుతూ ఒకనాడు రాత్రి అడవికి వెళ్ళిపొయినది.
ఓ అమ్మాయి ఒంటరిగా ఈ అడవిలో ఎక్కడికి పూతున్నావని పార్వతి పరమేస్వరులు మారు వేషములో వచ్చీ అడుగగా నాయనా మీరేమైనా అర్చేవార తీర్చేవారా మీకెందుకు అని చెప్పి నడుస్తోంది. మీము ఆర్చేదము తీర్చేదము నీ సంగతి చెప్పు అని అడిగిరి . ఆచిన్నది వారికి నమస్కరించి వారి స్నేహితులుతో చేసిన నోము గురించి తనకు మాత్రమె ముసలి భర్త లబించాడని నాకు మాత్రమె ముసలి భర్త సంభవించటం నాకు కారణం ఏమి , నా పాపమా? అని తన భాదను వివరించింది.
వారు దానికి చిన్నదానా నీవ్రతం భంగమైనది నీ అన్నగారి వలన జరిగిన చర్య సవివరంగా చెప్పారు. జరిగినదాని నేను ఇప్పుడు ఏమి చేయ్యన్లని వారి అడుగగా మరలా ఆ వ్రతం నిస్తగా చేయ్య్మన్న్నారు. ఆమె తిరిగి రాజ్యాని కి చేరి తదియరోజు ఆ వ్రతం చేసినది. ముసలి భర్త మంచి అందమైన యువకుని గా మారెను. అది చుసి అన్ధరూ కారణమడుగగా జరిగిన వృతాంతం చెప్పెను . ఇది అట్ల తదియ నోము కదా...
ఈ కధ విని అక్షిమ్థలు తలమీద వేసుకొని చంద్రుని చూసి పదకొండు అట్లు వీసి ఒక ముత్తయ్దువకు ఇచ్చి తను నేయివధ్యం పెట్టుకున్న పదకొండు అట్లు తిన్నాలి . ఈ నోము వివాహమైన నవ వధువులు పదకొండు సవత్సరాలు చేసి వుధ్యాపన చేసుకోవాలి.
ఇదండి అట్ల తద్ది నోము గురించి.

హల్లో ..........

హలో అన్దరూ బాగున్నారా. దసరా బాగాజరుపుకున్నారా. అందరికి విజయదసమి శుభాకాంక్షలు .

శుక్రవారం, అక్టోబర్ 03, 2008

భగవంతుని విలువ

శుక్రవారం, అక్టోబర్ 03, 2008

ఒక పెద్ద మనిషి తన వద్ద పని చేసే సేవకుని పిలిచి అతని చేతికి ఒక వజ్రం ఇచ్చి మార్కెట్లో దాని విలువ ఎంతో తెలుసుకొని రమ్మన్నాడు . సేవకుడు మొదట ఒక వంకాయల వ్యాపారి దగ్గరకు తీసునుకొనివెళ్ళాడు. ఆ వర్తకుడు దానిని కాస్సేపు పరీక్షించి "ఇది తొమ్మిది సేర్ల వంకాయల విలువ చెయ్యదు. అని తేల్చి చెప్పాడు.
సేవకుడు అక్కడ నుండి వస్త్రాల వ్యాపారి దగ్గరకు వెళ్లి అతనిని కుడా దాని విలువ కట్టమన్నాడు. ఆ వ్యాపారి రాయి మంచిదే కాని తొమ్మిది వందల రూపాయలు కంటే ఎక్కువ వుండదు . ఆ పైన ఒక్క రూపాయి అయినా దండగే అన్నాడు.
బంగారం వర్తకుని దగ్గర అడిగినా ఆ రాయి విలువ లక్ష రూపాయలు అన్నాడు. వజ్రాల వ్యాపారి ని అడగగా చూసి చూడగానే కోటి రుపాయులువుంటుది అన్నాడు.
ఈ వర్తకులు వారి వారి పెట్టుబడి స్థాయి ని బట్టి , గుణగ్రహణ శక్తిని బట్టి వజ్రం విలువను ఎలా నిర్ణయించారో అలాగే వ్యక్తులు కుడా తమ తమ గ్రహిపుసక్తిని బట్టి, సంస్కారాన్ని బట్టి భగవంతుడి విలువను నిర్ణయించ గలుగుతారంటారు రామ కృష్ణ పరమహంస.

మంగళవారం, సెప్టెంబర్ 30, 2008

పాజిటివ్ ప్రేరణ

మంగళవారం, సెప్టెంబర్ 30, 2008

మంచి - చెడు , సత్యం - అసత్యం , భయం -అభయం , సంతృప్తి - అసంతృప్తి ఇలాంటివి అన్ని మనకు ప్రేరణ కలిగించేవే . ఐతే భయాన్ని అదుపులో వుంచితే జాగ్రత్తగా పవర్తిస్తే అదే ప్రేరణగా వుపయోగపడుతుంది.
అలాగే మనచుట్టూవున్నా వాతావరణం నుండే ప్రేరణ పుడుతుంది. అది పాజిటివ్ ప్రేరణ కావచ్చు, లేదా నేగేటివ్ ప్రేరణ కావచ్చు.
ఒక వూర్లో ఇద్దరు అన్నదమ్ములు వున్నారు . వారిలో ఒకడు పచ్చి తాగుబోతు గా వుండి చెడు ,అసత్యం ,భయం , అసంతృప్తి కలిగి జీవితం లో అన్ని కోల్పోయి నట్టువుంటాడు. రెండవ వాడు మంచిగా అబివృద్ధి చెంది , పెద్ద పారిశ్రామికవేత్తగా మంచి, సత్యవ్రతునిగా భయం లేని వానిగా సంతృప్తి కలిగి జీవితం లో వున్నత స్థానం లో వున్నాడు.
ఇది గమనించిన ఒకతను ఆ అన్నాదమ్ముల దగ్గారుకు విడి విడిగా వెళ్లి " మీరు ఇద్దరూ ఒక ఇంటిలో వారే కదా మరి ఒకరు మంచి గా మరొకరు చెడుగా ఎలా వున్నారు"? అని అడిగాడు.

ముందుగా తాగు భోతు ని అడగగా" మానాన్నాతాగుతాడు . మా నాన్న దగ్గరనుండి ఈ లక్షణాలు నాకు అబ్బాయి" . అందుకే ఇలా తయారయ్యాను అన్నాడు .

రెండవ వాడిని అడుగగా" మానాన్న కష్టపడి పని చేసేవాడు .ఈనాడు నేను ఈ స్థాయి లో వుండటానికి మా నాన్నగారే ప్రేరణ" అని సమాధానం ఇచ్చాడు.
ఇందులో మనం అర్ధం చేసుకోవలసింది వారి తండ్రికి రెండు లక్షణాలు వున్నాయి . మంచి - చెడు వున్నాయి . వాటిలో చెడ్డ లక్షణాలను ఆదర్శం గా ఒకడు తీసుకొని నెగెటివ్ ప్రేరణకు గురి అయ్యాడు. వాటిలో మంచి లక్షణాలను మరొకడు ఆదర్శం గా తీసుకొని పాజిటివ్ ప్రేరణకు గురి అయ్యి మంచి స్థాయిని చేరాడు .
ప్రతీ మనిషి లో పోసిటివ్ నెగెటివ్ లక్షణాలు వుంటాయి. మనం వాటి లో పాజిటివ్ ప్రేరణ మాత్రమె తీసుకోవాలి . అలా అయితేనే గోప్పవారిమి అవ్వగాలము.

సోమవారం, సెప్టెంబర్ 29, 2008

తల్లి ఆదర్శం

సోమవారం, సెప్టెంబర్ 29, 2008

పిల్లలకి అమ్మే ఆదర్శం అని మా అమ్మమ్మ చెప్తూ వుంటుంది. నాకు అమ్మమ్మ అలాంటి ఒక ఆదర్సమైన తల్లి కధ చెప్పింది . అది జరిగిన కాదే ............

గాంధీ గారి తల్లి పేరు పుతలీబాయి . ఆమె ఆదర్శ భారత మహిళల. భారతీయ సంస్కృతిని చిన్నప్పటినుండే అలవరుచుకున్న స్త్రీ. ఆమె ఒక వ్రతమును చేసేది . ప్రతీ రోజు కోయిల కూసిన తరువాతనే ఆమె ఆహారం తినేది ( ఒక ఋతువులో ) .
గాంధి చిన్నగా వున్నప్పుడు, ఒక రోజు , అతని తల్లి కోయిల కూతకై వేచి వున్నది. తన తల్లి భోజనానికి ఆలస్యం అవుతోందని గాంధి అనుకోని ........ వెంటనే బయటకు వెళ్లి కోయిల లా కుసి తరువాత ఇంటిలోకి వచ్చాడు.
"అమ్మా ! కోయిల కూసింది నువ్వు ఇంక భోజనం చేయ్యమ్మా " అని అన్నాడు.
అసలు విషయాని గ్రహించిన పుతలీబాయి గాంధి ని రెండు చెంపలు కొట్టీ -" ఓరి దుర్మార్గుడా ! నీలాంటి కొడుకు నాకు పుట్టటం నా దురదృష్టం" అని భాద పడింది. ఆ తల్లి భాదను గ్రహించిన గాంధి చలించి పోయాడు. ఆసంఘటన గాంధి హృదయం లో నాటుకుంది . ఆనాటి నుండి అసత్యం మాటలాడనని ప్రతిజ్ఞా పట్టాడు.

ఈ విధం గా సామాన్యులను కూడా మహనీయులుగా తీర్చిదిద్దే శక్తీ సామర్ధ్యాలు , స్పూర్తి ఒక్క తల్లికే వుంటుంది. ఈ విధంగా పుతలీబాయి ఒక ఆదర్స తల్లి గా చెప్పవచ్చు.

ఎలాంటి తల్లులు వుంటే పిల్లలు తప్పకుండా గొప్పవారవుతారు. ఇది నిజం.

శనివారం, సెప్టెంబర్ 27, 2008

స్పూర్తి -"అందరికి ............................"

శనివారం, సెప్టెంబర్ 27, 2008








ఆఫీసు కి వెళ్ళకుండా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకున్దామనుకొని తేలిక గా వున్నా డ్రెస్ వేసుకొని పడుకుందామని దిండు వేసుకొని రడీ అయ్యేసరికి బాస్ వస్తున్నాడని తెలిసింది . అంతే వెంటనే లాప్ టాప్ తీసి పని చేస్తున్నాను.
పెండింగ్ వర్క్ చెయ్యాలి మరి . బాస్ అడిగితే వర్క్ అట్ హోం అని చెప్పాలి అబ్బద్ధం చెప్తే అతికి నట్టు వుండాలి కదా.
అందు కే ఈ లాప్ టాప్ ముందు వుంచుకున్నాను మరి . ఇలా చెయ్యక తప్పదు మరి . ఏ మంటారు.

గుర్రం నడపలేని హీరో

మా అమ్మమ్మ ఒక కధ చెప్పింది . ఆ కధ పేరు గుర్రం నడపలేని హీరో . అది జవహర్ లాల్ నెహ్రూ గారి చిన్నప్పటి విషయం. నాకు చాలా నచ్చింది. అది ఏమిటంటే..........
నెహ్రూ గారికి చ్చిన్నప్పుడు గుర్రం స్వారీ చేయటం చాలా ఇష్టం. వీరోచిత సంఘటనలంటే మహా సరదా. తండ్రి మోతిలాల్ కుడా వీటిని ప్రోత్సాహించేవారట. మోతిలాల్ ఒక రోజు జవహర్ను గుర్రం ఎక్కించి పంపారు. అప్పుడు సాయంత్రం ఫ్రెండ్స్ కు టెన్నీస్ పార్టీ ఇచ్చారు. పార్టీ జరుగుతున్న సమయం లో గుర్రం ఒకటే తిరిగి వచ్చింది. నెహ్రూ గుర్రం మీద లేరు , మోతిలాల్ గాబరా చెందారు. పార్టీకి వచ్చిన వారి తో హడావిడిగా నేహృను వెతకారు. దారిలో నడుచుకుంటూ నెహ్రూ వస్తున్నారు. "ఏమి జరిగిందీ?" అని అందరూ అడిగారు. "ఏమి లేదు. గుర్రం నన్ను క్రింద పడేసి పర్గ్గేత్తింది . నేను నడుచుకుంటూ వస్తున్నాను" అన్నారు నెహ్రూ, `గుర్రం నడపలేని హీరో ' అని అందరు గొల్లున నవ్వారు . అతరువాత కుడా అప్పుడప్పుడు జవహరును "హీరో" అని సంభోదిస్తూ వుండేవారట.
మా అమ్మమ్మ చెప్పిన కధ చాలా భాగుంది కదండి .
మరోసారి ఇంకో కధ తో మీ ముందుకు వస్తాను మరి నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి. చదువుకోవాలి. ఇక బాయ్ బాయ్.

శనివారం, సెప్టెంబర్ 20, 2008

హాయ్ హాయ్ చెప్తా .............

శనివారం, సెప్టెంబర్ 20, 2008

చెప్పుకోండి చూద్దాం? పొడిస్తే నవ్వులు -విడిస్తే నవ్వులు.

  1. అన్నదమ్ములు ముగ్గురు. అయితేవారి బుద్దులు వేరు .నీళ్ళో వేస్తె మునిగేది ఒక్కడు ,తెలేది ఒకడు ,కరిగి పోయేదిఒకడు.ఇంతకీ వారు ఎవరు?
    తాంబూలం ( మునిగేది వక్క, తేలేది ఆకు, కరిగేది సున్నం)
  2. ఈగముసరని పండు, ఎర్రన్గానుండు?
    నిప్పు.
  3. వుదయం నడక నాలుక్కాలతో, మధ్యాన్నం రెండుకాళ్ళతో, సాయంత్రం ముడుకాళ్ళతో...................?
    బాల్యం , మధ్య వయస్సు , వృద్దాప్యం
  4. ఎన్నిసార్లు చచ్చినా, ఎప్పుడూ బ్రతికే వుండేది ఏమిటది?
    ఆశ
  5. ఐదుగుర్లో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది?
    చిటికిన వేలు

శుక్రవారం, సెప్టెంబర్ 19, 2008

చెప్పుకోండి చూద్దాం? పొడిస్తే నవ్వులు -విడిస్తే నవ్వులు.

శుక్రవారం, సెప్టెంబర్ 19, 2008

  1. అన్నదమ్ములు ముగ్గురు. అయితేవారి బుద్దులు వేరు .నీళ్ళో వేస్తె మునిగేది ఒక్కడు ,తెలేది ఒకడు ,కరిగి పోయేదిఒకడు.ఇంతకీ వారు ఎవరు?
  2. ఈగముసరని పండు, ఎర్రన్గానుండు?
  3. వుదయం నడక నాలుక్కాలతో, మధ్యాన్నం రెండుకాళ్ళతో, సాయంత్రం ముడుకాళ్ళతో...................?
  4. ఎన్నిసార్లు చచ్చినా, ఎప్పుడూ బ్రతికే వుండేది ఏమిటది?
  5. ఐదుగుర్లో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది?
సమాధానాలు రేపే ...........అమ్మా .........ఆశ ........ ఇప్పుడు చెప్పేస్తాననే. ఇప్పుడు మీరు ట్రై చేసి చెప్పండి.

బుధవారం, సెప్టెంబర్ 17, 2008

ఇది మీకు తెలుసా!

బుధవారం, సెప్టెంబర్ 17, 2008

దేవుని కి అరటి పండు ఎందుకు సమర్పిస్తారు?
అరటి చెట్టు జీవిత కాలంలో ఒకే ఒక్క సారి అరటి గెలను ఇస్తుంది. అలా వచ్చిన అరటి పండును దేవుడికి మనం సంర్పిస్తాము. జన్మలల్లో మనిషి జన్మ ఒకసారే వస్తుంది. అరటి పండును ఆదర్శంగా తీసుకొని మనలను మనం దేవుడికి సమర్పించుకొంటామన్నమాట.
అరటి సంస్కృతంలో "కడలి" అనీ వన లక్ష్మి అనీ అంటారు. అరటి లో ప్రతీ భాగం ఉపయోగమే అరటి వేరు అరటి కాండం(దూట) దాని పువ్వు, అరటి అక్కులు, అరటి కాయ, అరటి పండు, అరటి పీచు. అరటిలో ప్రతీదీ మనం వాడుకోనేదే.
దీన్ని మనం ఆహారం లో ఆరోగ్యం గావున్నప్పుడే కాదు. కొన్ని రోగాల సమస్యలు పరిష్కరించుకోడానికి వుపయోగిస్తారు.
అయుర్వేధమ్ లో అరటి పండు గునగనలూ బాగావివరించారు.
"మౌచం స్వాదురసం ప్రోక్తం కషాయం నాతి శీతలం !
రక్త పిత్త హారం వృ షయం రుచ్యం శ్లేష్మకరం గురు||
అరటి పళ్ళు మధుర, కషాయం రసం కలిగి వుంటాయి . గుణం -గురుగుణం అంటే కడుపునిండిన భావం కలిగి వుంటుంది. శరీరంలో ధాతువులని పెంచుతుంది. బరువులను పెంచుతుంది. మరీ చలవ కాదు. రక్త దోషాన్ని నివారిస్తుంది. రుచిని పుట్టిస్తాయి.
అరటి పండు: ప్రపంచమంతా దొరికే పండు. అన్ని సీజన్స్ లో దొరుకుతుంది. అరటి పండు వెంటనే శక్తీని ఇస్తుంది. దీన్ని సంపూర్ణ ఆహారంగా తేసుకోవచ్చు.

మంగళవారం, సెప్టెంబర్ 16, 2008

హ్హ హ్హ హ్హ చెప్పెస్తున్నానూ . చెప్పైనా...............

మంగళవారం, సెప్టెంబర్ 16, 2008

చెప్పుకోండి చూద్దాం? పొడిస్తే నవ్వులు -విడిస్తే నవ్వులు.

  1. ఆకులెయ్యదు , నీరు తాగదు, నేలని ప్రాకదు. ఏమిటా తీగ ? ----కరంటు తీగలు
  2. ఆమడ దూరం నుంచి అల్లుడుగారు వస్తే గోడమూల ఒకరు , మంచం కింద ఇద్దరు దాక్కుంటారు?----చేతి కర్రా,చెప్పుల జత.
  3. ఆకులాడు కాదు అకులువుంటాయి , పోకలవాడు కాదు పోకలు వుంటాయి, అసలు మనిషి కాదు జాడలు వుంటాయి ,బాలింత కాదమ్మ పాలు వుంటాయి. ఏమిటది? ---- మర్రి చెట్టు.
  4. ఇల్లు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ వుంటాయి? -----మెప్స్
  5. ఇంటిలో మొగ్గ వీధిలో పువ్వు ఏమిటది?------గొడుగు.

    బాగున్నాయా . రేపు మరి కొన్ని చూద్దాం. బాయ్ ................

సోమవారం, సెప్టెంబర్ 15, 2008

THE RIVER

సోమవారం, సెప్టెంబర్ 15, 2008

ఈ రోజు నాకు స్కూల్లో ఈ రైం నేర్పించారు నాకు చాలా నచ్చింది. నా లాగే మీకునచ్చుతుందేమో చూడండి . నాకు వచ్చేసింది కుడా.

Waves lap lap
Fish fins clap clap
Brown sails flap flap
Chop-sticks tap tap

Chop-sticks tap tap
Brown sails flap flap
Fish fins clap clap
Waves lap lap.

శ్రీ వైష్ణవి.

చెప్పుకోండి చూద్దాం? పొడిస్తే నవ్వులు -విడిస్తే నవ్వులు.

  1. ఆకులెయ్యదు , నీరు తాగదు, నేలని ప్రాకదు. ఏమిటా తీగ ?
  2. ఆమడ దూరం నుంచి అల్లుడుగారు వస్తే గోడమూల ఒకరు , మంచం కింద ఇద్దరు దాక్కుంటారు?
  3. ఆకులాడు కాదు అకులువుంటాయి , పోకలవాడు కాదు పోకలు వుంటాయి, అసలు మనిషి కాదు జాడలు వుంటాయి ,బాలింత కాదమ్మ పాలు వుంటాయి. ఏమిటది?
  4. ఇల్లు లేని పట్నాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ వుంటాయి?
  5. ఇంటిలో మొగ్గ వీధిలో పువ్వు ఏమిటది?

    సమాధానాలు పంపండి. నేనైతే రేపుచేప్తా. అప్పటి దాకా వేచి వుండాలి మరి.
శ్రీ వైష్ణవి.

ఆదివారం, సెప్టెంబర్ 14, 2008

"తమ దగ్గర ఉన్నదే ఇస్తారు "

ఆదివారం, సెప్టెంబర్ 14, 2008

జీసస్ కొందరితో కలసి ఒకసారి దారిన వెడుతుండగా కొంతమంది ఆయనగురించి చెడ్డగా చెప్పుకుమ్టుండడం వినిపించింది. జీసస్ ముఖమ్లో ఎటువంటి బాధా లేదు. పైగా ప్రేమపురకమైన దరహాసం చిందిస్తూ వారి గురించి తనతో వున్న వారితో కొన్ని మంచి మాటలు చెప్పారు.
జీసస్ వికారి వారికి అర్ధం కాలేదు . `అదేమిటి పభు ! వాళ్ళు మీ గురించి చెడ్డగా మాట్లాడుతుంటే మీరు వారి గురించి ఇలా మీరు మంచిగా మాటలాడుతున్నారు ?' అని అడిగారు.
` దానికీముంది ? ఎవరైనా తమ దగ్గర వున్నదే ఇతరులకు ఇస్తారు' అని అన్నారు జీసస్.

శనివారం, సెప్టెంబర్ 13, 2008

Believe In Your-shell-f!, Positive Thinking Day Egreeting

శనివారం, సెప్టెంబర్ 13, 2008

Believe In Your-shell-f!, Positive Thinking Day Egreeting

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2008

Use it.

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2008

Yester day is cancelled cheque.
Tomorrow is promissory note.
To day is ready cash.
Use it. ...... ఇది పెద్దల మాట. బాగుంది కదా. చాలామంది జరిగిపోయినదానిని తలచుకొని బాధ పడతారు. దాని వల్ల వుపయోగం లేదు. రేపు అన్నది ప్రోమిస్సోరీ నోట్ లాంటిది. ఈ రోజు మనదే ఇదే నిజం . ఈరోజు బంగారం లాంటిది దానిని వుపయోగించు కోవాలి. పాతవి తలచు కొని బాద పడి టైం వేస్ట్ చెసుకొకూడదు. మన పెద్దల మాట బాగుంది కదా.

ఆయన్ని ఎందుకు వెతకటం?

రామ్ ఒక పెద్ద ధనవంతుడు .రామ్ కొంత కాలం తీర్ధ యాత్ర చేద్దామని అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగు తున్నాడు. ఒక చోట ఒక మనిషి పరిచయం అయ్యాడు. ఆతను దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాడు. ఆరోజు రామ్ తో ఫ్రెండ్షిప్ చేసి రామ్ ను నమ్మించడానికి ప్రయత్నిచాడు . ఇద్దరూ కలసి ఒక చోట బసచేశారు. రామ్ నిద్రపోతున్నపుడు అతని వస్తువులు అన్ని వెతికాడు. ఏమిదొరకలేదు. విసిగిపోయి ఆమనిషి నిద్రపోయాడు. మార్నింగ్ లేచిన వెంటనే రామ్ తో ఇక్కడ దొంగతెనాలు ఎక్కువ మీ డబ్బూ, దస్కమ్ ఎక్కడైనా జాగ్రత్తగా వుంచారా అని అడిగాడు.
రామ్ చిన్ననవ్వు నవ్వి "నాకు ఆ సంగతి తెలుసు". అన్దుకే నీ దిండు గలేబు లో నా సొమ్ము దాచిపెట్టాను.
అని ఆ సొమ్ము మొత్తాన్ని చూపించాడు రామ్. దొంగ ఫస్ట్ ఆశ్చర్య పోయాడు తరువాత ఏడుపుతో కలిసిన నవ్వు నవ్వాడు. దొంగ మెల్లిగా తప్పుకొని వెళ్ళిపోయాడు .
భగవంతుడు ఆత్మ రూపంలో మనలోనే వున్నా మనం ఆయన్ని వెతుకుతాము.
ఆయన్ని ఎందుకు వెతకడం ????????????????????.

బుధవారం, సెప్టెంబర్ 10, 2008

బుధవారం, సెప్టెంబర్ 10, 2008

ఒకరోజు మహావిష్ణువు నారదుల మధ్యసంభాషణ.
విష్ణువు :-నారదా ! పంచ భుతాలలో ఎవరు గొప్పా?
నారదుడు:- భూమి గొప్పది.
విష్ణువు:- భూమండలం లో భూమి ఒక వంటే కదా. మూడు వంతులు నీరే కదా భూమి ఎఅలా గొప్పది.నారదుడు:- అయితే జలం గొప్పది.
విష్ణువు:- అంతటి జలాన్ని అగస్యుడు తాగాడు కదా.
నారదుడు:- అయితే అగస్యుడు గొప్పవాడు.
విష్ణువు:- అంత పెద్ద ఆకాశం లో అగస్యుడు నక్షత్రమే కదా.
నారదుడు:- అయితే ఆకాశమే గొప్పది.
విష్ణువు:- అంత ఆకాశాన్ని భగవంతుడు వామన రుఉపం లో తన పాదం తో కప్పెసాడు కదా.
నారదుడు:- అయితే భగవంతుని పాదం గొప్పది.
విష్ణువు:- భగవంతుని పాదమే గొప్పది అయితే ,మొత్తం భగవంతుని రూపాన్నే భక్తుడు తన హృదయము లో బంధిస్తున్నాడు కదా .
నారదుడు:- అయితే భక్తుఢే గొప్పవాడు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)