అన్నమయ్య పాటలంటే నాకు చాలా ఇష్టం అని మీకు తెలుసు కదా! అందులో నాకు నచ్చిన పాటలలో ఈ పాట ఒకటి. అన్నమాచార్యులువారు దేవలోకపు పండు మామిడి పండుగా మరియు అనేకపండ్లు వాటి విశేషాలు, మరియు దశావతారాలు ను అన్వయిస్తూ రచించారు. చివరికి అన్నమాచార్యులువారు శ్రీవేంకటాద్రి నింటింటిముంగిటిపండు అని మామిడిపండు అని చెప్పారు. ఆయన రచనను చాలా గొప్పగా సాగించారు.
తినరాని
కొనరాని దేవలోకపు పండు
మనసునఁదలచితే
మరిగించే పండు
పంటకెక్కి
పాలవెల్లి పండిన పాలపండు
తొంటి
గొల్లెతల మోవి దొండ పండు
అంటుకొన్న
మేనిచాయ అల్లునేరేడుపండు
ముంటిసింహపుగోళ్ళ
ముండ్ల పండు
ఇచ్చల
వేదశాస్త్రాలు దెచ్చిన పేరీత పండు
తచ్చిన
దైత్యమారి దేవదారు పండు
పచ్చిదేర
మెరసిన బండిగురువిందపండు
యిచ్చవలెనన్న
వారి యింతనంటిపండు
తెమ్మగా
మునులపాలి తియ్యని చింతపండు
తె(తి?)మ్మల సిరివలపు
తేనెపండు
యిమ్ముల
శ్రీవేంకటాద్రి నింటింటిముంగిటిపండు
కొమ్మల
పదారువేల గొప్ప మామిడి పండు
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.