మంగళవారం, మార్చి 13, 2012
ఈ రోజు మీదగ్గరకు రెండు విన్నపాలతో వచ్చానండి అవేమిటి అనుకుంటున్నారా చెప్తాను ఆగండి తొందరఎందుకు. చిన్న విన్నపము :
మొబైల్ టవర్ రేడియేషన్కి చిన్న చిన్న పిట్టలు క్రమక్రమముగా అంతరించి పోతున్నాయి . ఇలా ఒక పెట్ బాటిల్ కి రెండు చెక్క చెంచాలు పెట్టి , అందులోకి కాసిన్ని గింజలు వచ్చేలా ఏర్పాటు చేసి , మీ ఇంటిముందు ఇలా వ్రేలాదేలా చెయ్యండి . అక్కడికి ఆ పిట్టలు వచ్చేసి , ఆ చేమ్చాల్ మీద వాలి , గింజలని తిన్తుంటాయి . మరచిపోరని ఆశిస్తున్నాను . ఇది నా ఆలోచన కాదండి పేస్ బుక్ లోని అచ్చంపేట రాజు గారి ఆలోచన. ఈ ఆలోచన నాకు బాగా నచ్చేసింది. నేను ఇలా చేసాను. నాలాగే మీకు కూడా పక్షులు మీద ప్రేమ వుంటుంది కదా మీరు మరి ఇలా చేయండి. ఈ సంధర్బములో అచ్చంపేట రాజు గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఇలాంటి మంచి ఐడియా ఇచ్చినందుకు.
ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది కదండి. నీళ్ళు దొరకక అప్పుడే పక్షులు వెతుక్కుంటున్నాయి. వాటి కోసం దయచేసి మీరు ఒక పని చేయాలి. అదేమిటనుకుంటున్నారా. చాలా సింపుల్ అండి. ఒక చిన్న కుండ లేక బెసెన్ లో నిండా నీరు పోసి మీ ఇంటిముందు బాల్కనిలో వుంచండి. అక్కడికి దాహంగా వున్నా పక్షులు వచ్చి వాటి దప్పికను తీర్చుకుమ్టాయి. మీ ఇల్లు ఆపర్ట్మెంట్ కాకపొతే వీలు అయితే జంతువులు కూడా దాహం తీర్చుకోనేటట్టు చేయండి.
మనము మన చుట్టూవున్న పక్షులును జంతువులును కాపాడాలి. ఎందుకు అంటే అవి వాటి సమస్యను మాట్లాడి మనకు చెప్పలేవు కదా. దయచేసి నోరు లేని జంతువులను కాపాడండి.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
ఆ ప్లాస్టిక్ బాటిల్ కి చెక్క చెంచాలని పెట్టి, పక్షుల ఆకలి తీర్చాలని అలా చేసినది నేను కాదండి. అంతర్జాలములో దొరికిన ఫోటో అది. నేను జస్ట్ ఫార్వర్డ్ చేశానన్నమాట. అంతే!.. మీరు ఇచ్చిన ఆ క్రెడిట్ అంతా సదరు స్వంతదారునికి చెందుతాయి.
రిప్లయితొలగించండి