శనివారం, డిసెంబర్ 03, 2011
అనగనగా ఒక ఇంట్లో ఒక చిన్న కుటుంబము నివసిస్తూ వుంది. వారు చాలా కష్టపడి సంపాదించుకొని వచ్చిన డబ్బుతో వారికి కావలసిన సరుకులు తెచ్చుకొని కొంత వండుకొని కొంత దాచుకొనేవారు. కానీ తెల్లవారి లేచి చూసే సరికి ఆ సామానులు వుండేవి కావు. బట్టలు చినిగిపోయి వుండేవి. ఇదంతా ఎందుకు ఎలా జరుగుతోంది అని వారు ఆలోచించారు. ఒకరోజు వారు రాత్ర్హి వారు తెలుసుకుందామని నిద్రపోకుండా కనిపెట్టే ప్రయత్నం చేసారు. అప్పుడు వారికి అర్ధం అయ్యింది ఇదంతా ఎలుకలవల్ల జరుగుతోందని. ఇలా చాలారోజులు జరుగుతుంటే వాటి అల్లరి భరించలేక ఆ ఇంట్లోవాళ్ళు ఒక ఎలుక బోను తెచ్చి అందులో మంచి తినుబండారాలు వుంచారు. ఒక ఎలుక ఆ పదార్ధాలను చూసి తినాలనుకుని బోనులోకి వెళ్ళింది. ఆ బోనులో ఆ ఎలుక చిక్కుకు పోయింది. అప్పుడు అందులో చిక్కుకున్న ఎలుక తానూ బందీగా ఉన్నాను అనుకుంది. తానూ బయటికి వెళ్ళలేను అను తానూ చినిపోతాను అనుకుని, చాలా భాధపడుతోంది. అందువల్ల తన ఎదురుగుండా వున్నా తినుబండారాలు వున్నాసరే వాటిని కనీసం చూడటం కూడా చూడటంలేదు. అక్కడున్న మిగిలిన ఎలుకలు మాత్రం బోనులో వున్నా ఎలుకను చూసీ సంతోషించి ఆహా ఏమి మహా భాగ్యము. అది చాలా అదృష్టవంతురాలు. అటువంటి అదృష్టము మనము పొందలేదు. అలాంటి అదృష్టము మనకు ఎప్పుడు దొరుకునో అని బాధపడతాయి.
అదేవిధంగా అధిక ధన బోగ భాగ్యాలను అనుభవించేవాడు ఇతరులకు భాదను కలిగిస్తాడు. సంపన్నుల సుఖసౌఖ్యాల వెనుక ఎంతో భాధ, అశాంతి వుంటాయి. మనం ఎంతో హాయిగా సుఖసంతోషాలు అనుభవిస్తున్నప్పుడు ధర్మా ధర్మాలు, న్యాయాన్యాలు పాటించడు. అలా సంపాదించిన సొమ్ముతో సంతోషంగా వుండలేరు. అతిగా ఆశపడకుండా వున్నదానిలోని సంతోషంగా గడపాలి. లేనిచో బోనులో వున్న ఎలుకవలే, ఎంత డబ్బు దస్కం వున్నా సంతోషంగా వుండలేరు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
nice work on this article, keep up the good work.
రిప్లయితొలగించండి