Blogger Widgets

శుక్రవారం, డిసెంబర్ 30, 2011

గ్రీటింగ్స గురుంచి తెలిసుకుందాం

శుక్రవారం, డిసెంబర్ 30, 2011


 ఈరోజు మనం గ్రీటింగ్స గురుంచి తెలిసుకుందాం. గ్రీటింగ్స్  అసలు ఎలా తయారు అయ్యిందో అని తెలుసుకుందాం .  మా అమ్మగారి చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వుండేవిట న్యూ ఇయర్ వస్తోంది అంటే వారం రోజులు ముందుగా నే షాప్ కి వెళ్లి ఆ గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కొని వచ్చి వాటికి పేర్లు రాసి దూరంగా ఉండేవారికి పోస్ట్ చేసేవారుట.  స్కూల్ ఫ్రెండ్స్, టీచర్స్  కి న్యూ ఇయర్ రోజు వారి ఇంటికి వెళ్లి వారికి wish  చేసి వారికి chocolates  ఇచ్చి ఆరోజు అంతా హ్యాపీ గా గడిపేవారట.  కొన్ని రోజులు అయిన తరువాత ఎవరి కార్డులు వారే సొంతంగా తయారుచేసుకొని ఇచ్చేవారట.  అప్పట్లో వారికి cakes cut చేయంటము అవి తెలియదుట.  ఇప్పుడు మనము న్యూ ఇయర్ జరుపుకోవటం లో చాలా మార్పులు వచ్చేసాయి.  ఈ సందర్బంగా అసలు ఈ కార్డులు గొడవ ఏమిటో చూద్దాం.
పూర్వం గ్రీటింగ్ ను మొదట ఉత్తరాల ద్వారా తెలుపుకునేవారు.  ఇప్పుడు అయితే అలాంటి ఉత్తరాలే లేవులేండి.  తరువాత గ్రీటింగ్స్ ను షాప్కి వెళ్ళి ఎవరికినచ్చిన  గ్రీటింగు కార్డులు వారు కొనటం వాటిని పోస్టాఫీసుకువెళ్ళి పోస్టు చేసే ఓపికగా ,తీరికగా పంపేవారు.ఇప్పుడు మనకు అంతా నెట్ ప్రపంచంలోనే జరిగిపోతున్నాయి.  షాప్కి వెళ్లక్కరలేదు నచ్చింది ఎతుక్కోనక్కరలేదు. అన్ని నిమిషాలలో చాలామందికి పంపెయవచ్చు.  
అయినా సరే మనం చరిత్రలోకి ఒక్కసారి వేల్లివద్దాం.  మొట్టమొదటిగ్రీటింగ్ కార్డుల చరిత్రను మనం ఓ సారి చెప్పుకుందాం, వాటిని ఎవరు తయారుచేసారు అన్న డౌట్ వచ్చిందామీకు అయితే అది 1842 డిసెంబర్ 9వ తేదీన విలియం మా ఈగ్లే మొట్టమొదటి క్రిస్మస్ కార్డును తయారుచేసాడట!.
విలియం తయారుచేసిన కార్డు పై భాగాన To  అని తరువాత అడుగుబాగాన From  అని వుంచి వాటిని ప్రింట్ తీసుకొని వాటికి మద్యలో మెసేజ్ కి ఖాళీ వుంచి అడుగుని కొంత ప్లేస్ ఉంచేవారు అక్కడ అడ్రస్ రాయటానికి.  తరువాత అమెరికన్ క్రిస్మస్ కార్డు(1824-1909) లో లిధోగ్రాఫర్ లూయిస్ ప్రాంగ్ తయారిచేసాడుట.  ఆ తరువాత 1873 లో ప్రాంగ్ చార్లెస్ డికెన్స్ ఆటొగ్రాఫ్ తో గ్రీటింగ్ కార్డును దిజైన్ చేసి తన మితృలకు,కుటుంబ సభ్యులకు పంపించాడట.1900 సంవత్సరం  వరకు మత సంభందమైన విషయాలకే శుభాకాంక్క్షల కార్డులను పంపించే అలవాటు వుండేవారు తరువాత పుట్టిన రోజులు మొదలుగు  వాటికి కూడా గ్రీటింగ్స్ పంపటం మొదలయింది.
అయితే ఆ గ్రీటింగ్స్ కార్డులు పంపటంలో మెల్ల మెల్లగా చాలా మార్పులు చేర్పులుతో మరి మారి మనకు ఈ కార్డులుగా వచ్చాయి. 
Standard Greeting Cards:కార్డు షీట్ పరిమాణాలు వివిధ రకాలుగా చేతితో తయారు చేసినట్లు. కార్డులు మరియు ఆహ్వానాలను పంపేవిదంగా వుంటాయి. ఒక పెద్ద కార్డు లేదా వివిధచిన్న కార్డులు గా తయారుచేయచ్చు. ఇటువంటి కార్డు అతి తక్కువ ఖర్చు పద్ధతిలో తయారు అవుతుంది.
Photo Greeting Cards: మనకు నచ్చిన ఫోటోమీద విషెస్ తెలియచేసి. మనకు నచినవారికి ఇవ్వంటం.
Personalized Greeting Cards: ఇవి ప్రత్యేకంగా మనకు నచ్చినవిధంగా తయారుచేసి మనకునచ్చిన మెసేజ్ రాసి ఇచ్చే కార్డు.
Musical Greeting Cards: ఈ మ్యూజికల్ కార్డ్స్ కార్డ్ కే మ్యూజిక్ ఏర్పాటు చేసి పంపే కార్డు ఇది కార్డు 3d  ఎఫ్ఫెక్ట్స్ తో తయారు చేస్తారు.
తరువాత చాలా మార్పులు చేర్పులు చేసి వచ్చినవే E-Cards .  వీటిలో కూడా చాలా రకాలువున్నాయి.
Electronic Greeting Cards : E-card టెక్నాలజీ  సుమారు 1984  సంవత్సరములో వచ్చాయి.  వీటిలో కుడా చాలా రకాలు వున్నాయి.

Printed e-Cards : ఈ కార్డు మనకు నచ్చినది సెలెక్ట్ చేసుకొని ప్రింట్ చేసి పంపేవి.

Postcards and Greeting Cards : ఈ కార్డ్స్ పోస్ట్ కార్డ్స్ లానే వుంటాయి online లో ఈమెయిలు ద్వారా పంపేవి. 

Flash animation: ఈ కార్డ్స్ మ్యూజిక్ తో కూడి ప్లే చేస్తే మంచి గా movements తో వుంటాయి.  

Video E-Cards : ఈ కార్డ్స్ వీడియో తరహాలో విషెస్ చెప్పేవిధంగా వుంటాయి.

Mobile E-Cards: ఈ కార్డ్స్ యూజర్లు ఒక వెబ్సైట్ ఆన్లైన్ వెళ్లి చేయవచ్చు, ఒక కార్డ్ గ్రహీత యొక్క మొబైల్ సంఖ్యను టైప్ఎంచుకుని,  కార్డు ఒక ఎంఎంఎస్ గా గ్రహీత యొక్క మొబైల్ ఫోన్ పంపబడుతుంది.
Web based multi-media E-Cards :ఈ కార్డ్స్ slide show  లాగ వుంటాయి. ఇవిమనకు నచ్చినవి అన్ని slide చేసి కావాలంటే మ్యూజిక్ పెట్టి పంపేవి.
Face Upload E-Cards :  ఈ కార్డ్స్ లో మనకు నచ్చిన ఫస్ ఫోటోను అప్లోడ్ చేసి పంపే కార్డు ఇది. ఇది funny  గా కూడా తయారు చేయాచ్చు.
E-cards games:  ఈ కార్డులో మంచి సరదా అయిన ఆటలును కార్డు రూపంలో పంపచ్చు.
Pop up Cards: పాప్ అప్ లేదా యాంత్రిక గ్రీటింగ్లు కార్డులు బాగా ప్రాచుర్యం పొందాయి. కింది షీట్లను మాములుగా అనిపించేవి. ఓపెన్ చెసాగా చాలా బాగుంటాయి. ఇవి మాలాంటి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు.  
ఇది గ్రీటింగ్ కార్డ్స్ గురించి.  ఇవి మంచిగా మనకు మన ఫ్రెండ్స్ మద్య మరియు కుటుంబసబ్యుల మద్య మంచి relationship  ను పెంచుతాయి అంతమలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు అంటే నమ్మండి.
మీరు కూడా మీకు నచ్చినవారికి నచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ పంపి విషెస్ చెప్పేయండి ఇంకెందుకు ఆలస్యం.
ok  మరి ఇక.  నా తరపున విషెస్ అందుకోండి.
Wish You Happy New Year 2012

2 కామెంట్‌లు:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)