ఆండాళ్ళు తల్లి ఈ వ్రతమునకు అంతా సిద్దముచేసింది. గోదాదేవి ఈ వ్రతమునకు తానూ ఒకత్తే కాకుండా మిగతా గోపికలును కూడా ఈ వ్రతమునకు రమ్మని ఆహ్వానించింది. ఈ వ్రతము అందరు చేయచ్చు అని వ్రతము భగవద్ అనుగ్రహము కొరకు. పాడి పంటలు బాగుండాలి అని వర్షాలు పడాలి అని లోక కల్యాణానికి అని చెప్పింది.
కృష్ణ ప్రేమ పొందాలని చాలా కోరికతో కలలు కంటున్నారు మరి కొందరు. మరి కొందరు బగావంతుని ప్రేమ పొందుతున్నట్లు కలలు కంటూ మత్తుగా నిద్ర పోతున్నారు. ఆహా కృష్ణుడు కేవలము నా వాడే అనే తలంపుతో మగత నిద్రపోతున్నారు. కొందరైతే అస్సలు నిద్ర పోతాం లేదు. మరి కొందరు నిద్ర పోతున్నారు. అసలు శ్రీ కృష్ణుని ప్రేమ అందరికి సమానమే . మరి భగవంతుని గుణగణాలు మట్టులాంటివి . అవి నిద్రను కలిగిస్తాయి .
ఆ నిద్రనుండి లేవని వారి పట్ల కుడా కృష్ణుని ప్రేమ ఎక్కువే. వారిని మనగోదా నిద్రలేపి వారి మనస్సులో వున్నా దోషాలను వారికి కమ్ము కున్న పొరలను తొలగిస్తుంది. భగవంతనుగ్రహము పొందేలా చేస్తుంది.
ఈ రోజు చిన్న పిల్ల అయిన ఉత్తిష్టను నిద్ర లేపుతున్నది. ఎలా అంటే.
పాశురము :
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్ పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
విశేషార్ధాము:
పుళ్ళుం శిలమ్బిన కాణ్:
తెల్లవారు చున్నది అని తెలియచేయుటకు మొట్టమొదట పక్షులు కలకాలమును ఇందు చెప్పుచున్నారు. తెల్లవారుచున్నది అని తెలుసుకుని తాము ముందు లేచి ఇతరులకు మేల్కొల్పునవి పక్షులు. తాము భగవదనుభావము ననుభవించి తమ వాక్కుచే ఇతరులకు కూడా భగవదనుగ్రము కల్గించుటకు మేల్కొల్పునట్లు చేయువారు మాహాఙ్ఞానులు . వీరి వాక్కులచే ప్రాత:కాలము అవుచున్నది.
పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో:
పక్షిరాజగు గరుడునియోక్క ప్రభువు అగు శ్రీ మహావిష్ణువు ఆలయములో మ్రోగుచున్న - అందరినీ ఆహ్వానించు-తెల్లని శంఖము యొక్క పెద్దధ్వనియు నీవు వినలేదా!
పక్షుల కిలకిలలును ఆమె తెల్లవారినట్టు నమ్మటంలేదు అందుకు వారు వేరొక గుర్తు చెబుతున్నారు. పక్షులకు రాజగు గరుత్మంతుడు ఆలయములో అందరినీ రమ్మని తెల్లని శంఖమును పూరించుచున్నాడు. ఆ ధ్వని చాలా పెద్దది ఆ ధ్వని నీకు వినబడలేదా అని అడుగుతున్నారు గోపికలు.
పిళ్ళాయ్! ఎళుందిరాయ్:
ఓ పిల్లా! లెమ్ము. అప్పుడు ఆపిల్ల మీరు వారికంటే ముందేలేచారు కదా ! మిమ్మల్ని ఎవరు లేపారు అని అడుగగా దానికి జవాబుగా మునులు, యోగులు వారి పక్కనుండి వీడి మెల్లగా లేస్తున్నప్పుడు ఉచ్చరిస్తున్న హరి హరి హరి అను శబ్దము మాకు వినబడినది అని చెప్పారు. ఆ యోగులు స్మరించు సర్వేశ్వరుని గుణాలు మూడిటిని చెప్పి నిరూపిస్తున్నారు.
పేయ్ములై నంజుండు:
పూతన స్తనమునందలి విషమును ఆరగించి,
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి:
కృత్రిమ శకటమును సంధిబంధములూడినట్లు కాలుచాచి కూల్చి,
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై:క్షీరసాగరమున శేషశయ్యపై నిద్రపోవుచున్న కారణభూతుని,
ఉళ్ళత్తు క్కొండు:
హృదయమున పెట్టుకొని,
మునివర్గళుం యోగిగళుం మెళ్ళ వెళున్ధు:
మునులును, యోగులును మెల్లగా లేచి
అరియెన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళ్ళిర్ న్ధు:
హరి హరి హరి అనిన పెద్ద శబ్ధము ఊరంతా వ్యాపించి ఆ ధ్వని మా చెవులలో ప్రవేసించి మా మనసులో పది కృష్ణవిహారము చే మా హృదయము బీటలు వాలిన హృదయ క్షేత్రమున నీరుపెట్టి పదను చేసినది. ఆ చల్లబడి తాపముపసమింఛి మేము మీల్కొంటిమమ్మా! నీవు కూడా మేల్కొనివచ్చి మాతో కలువు. అని మొదటి గోపికను మేల్కొల్పిరి.
జై శ్రీమన్నారాయణ్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.