Blogger Widgets

ఆదివారం, ఆగస్టు 16, 2020

అధిక ప్రోటీన్ కల దో ఫ్లోర్ సర్వపిండి ( High Protein Dho Flour Sarvapindi)

ఆదివారం, ఆగస్టు 16, 2020



ఈరోజు తెలంగాణ సాంప్రదాయపు పిండివంట సర్వపిండి.  నా స్వయం మెలికలుతో చేసినది.  చాలా ఆరోగ్యకరముగా రుచికరమైనదిగా తయారుచేసాను.  మీరు చూసి చేసుకోండి.  మీరు చూసి మీరుమీ అభిప్రాయం నాతో పంచుకోండి. 

శనివారం, ఆగస్టు 15, 2020

మనకి సవాలు చేసే అల్పాహారాలు. (Challenging Breakfasts)

శనివారం, ఆగస్టు 15, 2020

                     

నమస్కారమండి!

ఈరోజు వీడియోలో మనకు సవాలుగా వున్న కొని అల్పాహారాలు గురించి చెప్పానండి. వాటితో పాటు వాటి ప్రత్యామ్నయాలు కూడా మాట్లాడానండి. అవిఎమిటో తెలుసుకోవాలనుకుంటునారా అయితే వీడియో చూడవలసిందే మరి.  చూసి మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి మరి. 

శుక్రవారం, ఆగస్టు 14, 2020

సజ్జ బ్రౌన్ బ్రెడ్ ఊతప్పం

శుక్రవారం, ఆగస్టు 14, 2020


నమస్కారం. ఎంతో ఆరోగ్యకరమైన సజ్జ బ్రౌన్ బ్రెడ్ ఊతప్పం చేసాను చాలా బాగుంది, మీరుకూడా చేసుకుని రుచి చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోవాలి. అంతే కాదు ఛానెల్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చెయ్యనివారు, సబ్స్క్రైబ్ చెసుకుని మీ స్నేహితులతో కూడా పంచుకోండి, లైక్ చేయండి అంతె .
 

గురువారం, ఆగస్టు 13, 2020

రక్తంలో చెక్కర శాతం తగ్గిపోతే......కారణంగా కుప్పకూలిపోతే :o

గురువారం, ఆగస్టు 13, 2020



నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం.
ఈరోజు వీడియో లో రక్తంలో చెక్కర శాతం తగ్గిపోతే......కారణంగా కుప్పకూలిపోతే అన్నవిషయం మీద మాట్లాడాను. అలా జరిగితే ఎమిచేయాలి. ఎందుకు జరుగుతుంది రక్తంలో చెక్కర శాతం తగ్గిపోటం ఎమిటి అన్నవిషయాలన్ని చెప్పాను. మీరు ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలు , సందేహాలు నాతో పంచుకోండి.

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రొద్దున్నే అల్పాహారం తీసుకొకపోతే

బుధవారం, ఆగస్టు 12, 2020

నమస్కారమండి!

ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాను.  అది ఒక్క డయాబెటిక్ వారికే కాదు అందరికీ అవసరమే.  మనం ప్రొద్దున్నే అల్పాహారం తీసుకొకపోతే ఎమవుతుంది.  ఎటువంటి ప్రమాదాలు వస్తాయో , చిన్నపిల్లలు మీద ఎటువంటి ప్రభావం వుంటుంది.  ఆడవారి మీద ఎటువంటి ప్రభావం వుంటుంది.  

డయాబెటిక్ వారికి ఈ అల్పాహారం ఎంత ఇంపార్టెంటో చెప్పాను.  మీరు ఈవీడియో చూసి మీ అభిప్రాయం నాతో పంచుకోండి మరి.

మంగళవారం, ఆగస్టు 11, 2020

5 నిమిషాలలో తయారు చేసుకునే క్విక్ స్నాక్

మంగళవారం, ఆగస్టు 11, 2020

నమస్కారమండి!

డయాబెటికి చాలెంజర్ చానల్ కి స్వాగతం,  ఈరోజు 5 నిమిషాలలో తయారు చేసుకునే క్విక్ స్నాక్ తయారు చేసానండి.  అదేమిటో మీరు ఈ వీడియో పూర్తిగా చూసి , మీరు కూడా ఈ స్నాక్ ని తయారుచేసుకుని తిని ఎలావుందో నాతో షేర్ చేయండి.  

ఆదివారం, ఆగస్టు 09, 2020

గ్లూకోజ్ చాలెంజ్ పరీక్ష ఎవరికి చేస్తారు.

ఆదివారం, ఆగస్టు 09, 2020



అందరికీ నా నమస్కారం!
మనం ఇప్పటివరకు ఇంటిదగ్గర ఉండి గ్లుకోమీటర్ తో ఎలా రక్త పరీక్ష చేసుకోటం ప్రాక్టికల్ గా చేసుకున్నాం కదా. ఇంకా లాబు లలో పరీక్షలు గురించి మరియు, హెచ్ బి ఏ1 సి గురించి కూడా మాట్లాడుకున్నాం.
ఈరోజు గ్లూకోజ్ టోలెరెన్స్ పరీక్ష మరియు గ్లూకోజ్ చేలెంజ్ పరీక్ష గురించి చెప్పాను మీరు పూర్తిగా వీడియో అంతా చూసి మీ అభిప్రాయాన్ని, సలహాలును నాతో పంచుకోండి.
ఇప్పటివరకు నా చానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడు చేసుకోండి.

శుక్రవారం, ఆగస్టు 07, 2020

ఆరోగ్యప్రదమైన మసాలా వడ(Healthy masala vada)

శుక్రవారం, ఆగస్టు 07, 2020

 నమస్కారమండీ! ఈరోజు నేను చాలా సులువుగా తయారుచేసుకునే మంచి ఆరోగ్యకరమైన స్నాక్ చేసానండి. నేను ఎప్పటి లాగానే ఈ వీడియోలో కూడా రెసిపీ తో పాటు పొషకవిలువలు మరియు ఆరోగ్యానికి ఎంత మంచిదో చెప్పాను. వీడియో చూసి మీరు కూడా చేసుకుని ఎలావుందో నాతో మీ అభిప్రాయం నాతో పంచుకోండి.

                                   
                                   

హెచ్ బి ఏ1సి పరీక్ష అవసరమా? ( HbA1c or A1c)



అందరికి నమస్కారం...
ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మాట్లాడబోతున్నాను. ప్రతీ ఒక్కరు తెలుసుకోవలసిన విషయాలు.
హెచ్ బి ఏ1సి గురించి.

****హెచ్ బి ఏ1సి పరీక్ష ఎవరు చేయించుకోవాలి? ఎప్పుడు చేయించుకోవాలి? ఈ పరీక్ష అవసరమా?****

మీరు ఈవీడియోని మొదటినుండి చివరివరకు చూసి మీ అభిప్రాయాన్ని సందేహాలను నాతో పంచుకోండి.

బుధవారం, ఆగస్టు 05, 2020

యూటూబ్ లో మొట్టమొదటిసారిగా సర్ప్రైజ్ సమోసా ( Diabetic friendly surprise ...

బుధవారం, ఆగస్టు 05, 2020



యూటూబ్ లో మొట్టమొదటిసారిగా సర్ప్రైజ్ సమోసా ఈరోజు చేసానండి.  ఇది చాలా ఆరొగ్యకరమైనది . అలూ తినకూడదు కదా అందుకని స్టఫ్ఫింగ్ లొ అరటికాయని వాడానండి.  ఇందులో ఒక సర్పైజ్ పదార్ధం కూడా వేయటం విశేషం.  ఆ సర్పైజ్ ఎమిటో మీరు వీడియో చూసి తెలుసుకోండి.  ఈవీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి మరి.

మంగళవారం, ఆగస్టు 04, 2020

డయాబెటిస్ వారందరు తెలుసుకోవలసిన విషయం గ్లైసిమిక్ ఇండెక్స్. Things to kno...

మంగళవారం, ఆగస్టు 04, 2020

                     


అందరికీ నమస్కారం ! డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం .

ఈరొజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నాం. అదేమిటంటే. అసలు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి? మరియు అవి ఏమిటి? గ్లైసిమిక్ లోడ్ అంటే ఏమిటి? ఇంకా డయాబెటిక్ వారి మీల్ ప్లేట్ ఎలావుండాలి. ఏమి ఏమి తినాలి. ఎంత తినాలి ?
వాటర్మిలాన్ తినచ్చా అన్న ప్రశ్నకి సమాదానం ఇక్కడ దొరుకుతుంది.
తక్కువ గ్లైసిమిక్ కల ఆహారం తీసుకోటానికి కొన్ని టిప్స్ ఇంకా చాలా అనేకవిషయాలు చెప్పాను. కనుక మీరు అందరు ఈ వీడియోని చివరి వరకు చూడండి.
మీరందరూ వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. అంతే కాదు మీరు కనక మొదటిసారి చూస్తూవుంటె కనక, డయాబెటిక్ చాలంజర్ చానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

డయాబెటిస్ వారికి ప్రతేకమైన రాఖీపండగ స్పెషల్ మష్రూం బ్రౌన్ రైస్

అందరికీ నమస్కారం!

డయాబెటిక్ చాలెంజర్ చానెల్ కి స్వాగతం. అందరికీ రాఖీపండగ శుభాకాంక్షలు.
ఈరోజు డయాబెటిక్ చాలెంజర్స్ కోసం చాలా ఆరోగ్యకరమైన మంచి పోషకాలతో కూడిన మష్రూం బ్రౌన్ర్ రైస్ రిసిపీ చేసానండీ. దానీతో పాటు బ్రౌన్ రైస్ లో వుండే పోషకాలగురించి చెప్పానండి.
మీరందరూ వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాతో పంచుకోండి. అంతే కాదు మీరు కనక మొదటిసారి చూస్తూవుంటె కనక, డయాబెటిక్ చాలంజర్ చానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

ఆదివారం, ఆగస్టు 02, 2020

మధుమేహులకు ఉత్తమమైన వ్యాయామములు(Best exercises for diabetic patients)

ఆదివారం, ఆగస్టు 02, 2020


అందరికీ నమస్కారం.... డయాబెటికి చాలెంజర్ కి స్వాగతం . ఈరోజు మన వీడియోలో డయాబెటిక్ వారికి మందులు (మెడిసిన్) ఎంత అవసరమో అంతే అవసరమైనది వ్యాయామం లు గురించి చెప్పాను అంతేకాకుండా ఎలాంటి వ్యాయామాలు చెయ్యాలి. వాకింగ్ ఎలాచెయ్యాలి. ఎలాంటి బట్టలు, ఎలాంటి షూస్ వేసుకోవాలి. ఎలానడవాలి . ఎంతసేపు నడవాలి. అలాంటి విషయాలు ఎన్నో వున్నాయి. అందుకని మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని నాతో కామెంట్ తో పంచుకోండి . నమస్తే....

శుక్రవారం, జులై 31, 2020

డయాబెటిక్ పేషేంట్స్ బిస్కెట్స్ తినవచ్చా? తినకూడదా? (Can Diabetic Patie...

శుక్రవారం, జులై 31, 2020

                    

అందరికి నమస్కరం.. నా చానల్ డయాబేటిక్ ఛాలెంజర్‌కు స్వాగతం. అసలు డయాబెటిక్ రోగులు బిస్కెట్లు తినవచ్చా - తినకూడదా? . అన్నవిషయం మీద మాట్లాడానండి. మీరు నా వీడియోను చివరి వరకు చూసి తెలుసుకోవచ్చు. మీరు నన్ను ఎల్లప్పుడు ఎంకరజ్ చేస్తూవుండాలని ఆశిస్థున్నాను . దానికోసం మీరు ఎమి చెయ్యాలి అంటె నేను పోస్ట్ చేసిన వీడియోను చూసి ఇష్టపడటం (LIKE) , భాగస్వామ్యం (SHARE) చేయడం, వ్యాఖ్యానించడం (COMMENT) మరియు సభ్యత్వాన్ని( SUBSCRIBE) పొందడం చేయాలి అంతే సింపుల్. .వీక్షించినందుకు ధన్యవాదాలు.

గురువారం, జులై 30, 2020

మసాలా జొన్న రొట్టె (Diabetic friendly masala Jowar Roti)

గురువారం, జులై 30, 2020

                      

అందరికి నమస్కారం ..... ఈవేళ నేను ఒక మంచి వంటకంతో మీముందుకు వచ్చాను. నేను ఈవేళ మసాలా జొన్న రోటీ చేసాను. మసాలా జొన్నరోటీ చాలా సులువు మరియు ఎంతో ఆరోగ్యకరము మరియు రుచికరము కూడా. మీరు ఈ రిసిపీని తప్పనిసరిగా వీడియోలో చూసి మీ అభిప్రాయం చెప్పండి. ధన్యవాధములు. 


బుధవారం, జులై 29, 2020

డయాబెటిస్ నియంత్రణ కోసం సాధారణ జీవనశైలిలో కొన్ని మార్పులు

బుధవారం, జులై 29, 2020

నమస్కారమండి....
ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఎమిటి అంటే!  
డయబెటిస్ వచ్చింది కదా అని బెంగపెట్టుకోనవసరం లేకుండా. డయాబెటిస్ నియంత్రణ కోసం సాధారణ జీవనశైలిలో కొన్ని మార్పులు తెచ్చుకుంటే . మనం సుఖముగా జీవించవచ్చు.  ఆమార్పులు ఎమిటి అనుకుంటున్నారా.  అవి అన్నీ ఈవీడియోలో నేను వివరంగా చెప్పాను.  చూసి ఆచరించండి.  మరి వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాలు నాతో కామెట్ బాక్స్లో పోస్ట్ చేసి నాతో పంచుకోండి. ......:)  


మంగళవారం, జులై 28, 2020

తక్కువ కేలరీల సూపర్ స్టార్ గుమ్మడికాయ సూప్ (Low Calorie Superstar Pump...

మంగళవారం, జులై 28, 2020

              నమస్కారమండీ.... అందరూబాగున్నారా....నేను బాగున్నాను. 

ఈరోజు మనము తక్కువ కేలరీలు కల సుపర్ స్టార్ గుమ్మడికాయ గురించి మాట్లాడుకుంటున్నాము.  అంతేకాకుండా మంచి ఆరోగ్యకరమైన రుచికరమైన సులువైన గుమ్మడికాయ సూప్ రిసిపి కూడా చెప్పుకోబోతున్నాం.  అందరూ వీడియో పూర్తిగా చూసి ఇంట్లోచేసుకొని రుచి ఎలావుందో నాతో షేర్ చేసుకోండి.   ....:)

      

సోమవారం, జులై 27, 2020

వివిద 6 రకాల డయాబెటిస్ (Types of diabetes)

సోమవారం, జులై 27, 2020

                            

   హలో హాయ్.... అందరికి నమస్కారం .  ఈరోజు మనం సుగర్ గురుంచి చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాం. అదేమిటంటే అందరికి సుగర్ రెండురకాలుగానే తెలుసు, కానీ సుగర్ లొ ఆరురకాలు వున్నాయి.  వాటి గురించి ఈ వీడియో చూడండి.  చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి.  తరువాత వీడియోలో మనంచి రిసిపీతో మీముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు.  ధన్యవాధములు. 



 Plz.... all of you watch till the end and don't forget to subscribe .  Thank u ....:)

శనివారం, జులై 25, 2020

డైయాబేటిక్ వారికి మసాలా మఖన (Diabetic Friendly Yummy Masala Makhana)

శనివారం, జులై 25, 2020

                       

                          
డైయాబేటిక్ వారికి మసాలా మఖన (Diabetic Friendly Yummy Masala Makhana)

శుక్రవారం, జులై 24, 2020

మధుమేహరోగులపై కరోనావ్యాధి ప్రభావం ( Effect of corona virus on diabetic ...

శుక్రవారం, జులై 24, 2020

                    


బుధవారం, జులై 22, 2020

చిరుధన్యాలలో రారాజు రాగి ఇడ్లీ (Healthy Ragi Idli)

బుధవారం, జులై 22, 2020

                   

Hii everyone....How are you all???I am fine.Today came with a new recipe which is nothing but diabetic friendly Ragi idly. Ragi is also called as finger millet or African millet.It is rich in calcium,iron and micro nutrients.It helps in weight loss,constipation,risk of strokes,and helps to regulate sugar,control thyroid problems,helps in growth of bones in growing children and in adults it keep bones healthy,anemia and many more useful benefits with finger millet..Plz watch my video until end and don't forget to like,share and subscribe my channel.Thanks in advance


సోమవారం, జులై 20, 2020

గ్లూకోమీటర్‌తో ఇంట్లో చక్కెర పరీక్ష(sugar testing with glucometer)

సోమవారం, జులై 20, 2020



Hii everyone....how are u all??I am good..Today is very interesting and imp topic that is how to check sugar with glucometer at home.In this video i am going to discuss about how to check,when to check,who to check etc,and how to fix lancet in lancing device?,how to insert strip?,how prick? etc and some precautions.All of plz see my video till the end and let me know your sugar readings in comment section.Bye everyone.I will be back with another new and interesting video until then keep watching .And dont forget to like,share,subscribe and comment on my video bye bye.......

ఆదివారం, జులై 19, 2020

చిరుధాన్యాల సిరి కొర్ర బియ్యం చక్కెర పొంగలి

ఆదివారం, జులై 19, 2020



Hii everyone, In todays video i am going to share a healthy and tasty diabetic friendly sweet recipe.That is foxtail millet chakara pongali which is going to be very tasty and everyone will love to eat it.Even diabetic patients can have this. In this recipe i used foxtail millet and coconut jaggery which has low GI all of plz try this recipe and dont forget to like share ,subscribe and comment on my channel thank you bye,bye

శనివారం, జులై 18, 2020

డయాబెటిస్ గురించి పరిచయం వీడియో (Introduction video about diabetic manag...

శనివారం, జులై 18, 2020

                        

Hi Halloo..

welcome to my channel everyone.This my first video in this channel.Need all your support and encouragement....In this channel I am going to tell you about diabetic food management,insulin techniques,exercises,food portion control,diabetic friendly recipes and many more......Keep watching my channel, Subscribe, Like 👍 and share with your friends....bye bye.


Diabetic promo

గురువారం, ఫిబ్రవరి 15, 2018

రామచరిత మానస, 23, వాల్మీకి మునిపుంగవులకు నా నమస్కారములు .

గురువారం, ఫిబ్రవరి 15, 2018

సో - బందఉC ముని  పద కంజు , రామాయన జెహిC నిరమయఉ |
సఖర సుకోమల మంజు , దోష రహిత దూషన సహిత || 14 ఘ ||
బందఉC చారిఉ భేద , భవ బారిధి బోహిత సరిస |
జిన్హహి సపనెహుC ఖేద , బరనత రఘుబర బిసద జసు || 14 జ్ఞ ||
బందఉC  బిధి పద రేను , భవ సాగర జెహిC కీన్హ జహC |
సంత సుధా ససి ధేను , ప్రగటే ఖల బిష బారునీ || 14 చ ||
రామాయణము ఖర సహితము ( ఖర = ఖరుడను రాక్షసుడు , కఠినము ) కోమలము , మంజులము (ఖరుడను రాక్షసవృత్తాంతము గూడినను అది కోమలము , మంజులము ) దూషణ సహితమైనను (దూషణ =  దూషణుడు అను రాక్షసుడు , దోషములు ) అది దోషరహితము (దూషణుడు అను రాక్షసుని వృత్తాంతము తో కూడినను దోషరహితము) అట్టి మంజుల   వాల్మీకి మునిపుంగవులకు  నా నమస్కారములు . సంసారసాగరమునుండి తరించుటకు ఆలంబనమగుటలో నౌకలైన వేదములు నిరంతరము శ్రీహరి వైభవమునే గానము  చేయును.  వాటికి నా , ప్రణామములు , అమృతము ,  చంద్రుడు, కామధేనువు వంటి సాధుకోటిని , విషము , మధిర వంటి దుర్జనులు గల ఈ భవసాగరమును , సృష్టించిన బ్రహ్మకును నా నమస్కారములు .     

బుధవారం, ఫిబ్రవరి 14, 2018

రామచరిత మానస, 22, శ్రీహరికీర్తిని గానము చేయునట్లు కృపజూపుడు

బుధవారం, ఫిబ్రవరి 14, 2018

దో - సరల కబిత కీరతి బిమల , సొఇ  ఆదరహిC సుజాన |
సహజ బయర బిసరాఇ రిపు , జో సుని కరహిC బాఖాన || 14 క ||
సో న హోఇ బిను బిమల మతి , మొహి మతి బల అతి థోరా |
కరహు కృపా హరి జస కహఉC , పుని పుని కరఉ C  నిహోర  || 14 ఖ ||
కబి కోబిద  రఘుబర చరిత , మానస మంజు మరాల |
బాల బినయ సుని సురుచి లఖి , మో పర హోహు కృపాల ||  14 గ ||
కవిత సరళమై , నిష్కళంకమైనపాత్రపోషణ యున్నచో సుజనులు మెచ్చుకొందురు . శత్రువులు గూడ వైరములను విస్మరించి , దానిని ప్రసంసింతురు .  అట్టి కవితారచన ప్రజ్ఞావంతులకై సాధ్యము. నేనైతే మంద బుద్ధిని , కావున కవులారా ! నేను శ్రీహరికీర్తిని గానము చేయునట్లు కృపజూపుడు , శ్రీరఘువర చరితమనెడి మానససరోవరమునందు విహరించు హంసలవంటి కవి పండితులారా ! ఈ బాలుని ప్రార్ధన మన్నించి ,  నాపై కనికరింపుడు అని పదేపదే విన్నవించుకొనుచున్నాను . 

మంగళవారం, ఫిబ్రవరి 13, 2018

రామచరిత మానస, 21, మనోహరమైన శ్రీరామ వృత్తాంతమును రచించెదను.

మంగళవారం, ఫిబ్రవరి 13, 2018

                               దో - అతి అపార జే సరిత బర , జౌC నృప సేతు కరాహిC |
                                      చఢి పిపీలికఉC పరమ లఘు , బిను శ్రమ పారహి జాహిC ||
ఒక మహానదిపైన ఏరాజైనను వంతెన కట్టించినపిమ్మట చిన్న చిన్న చీమలుగూడ ఆనదిని అవలీలగా దాటకలదు. 
                                చౌ - ఎహి ప్రకార బల మనహి దెఖాఈ | కరహిఉC రఘుపతి కథా సుహాఈ ||  
                                        బ్యాస ఆది కబి పుంగవ నానా | జిన్హ సాదర హరి సుజస బఖానా || 1 ||
                                        చరన కమల బందఉC తిన్హ కేరే | పురవహుC సకల మనోరథ మేరే ||
                                        కలి కే కబిన్హ కరఉC పరనామా | జిన్హ బరనే రఘుపతి గున గ్రామా || 2 ||
                                        జే ప్రాకృత కబి పరమ సయానే | భాషాC జిన్హ హరి చరిత బఖానే ||
                                        భఏ జె అహహిC జె హొఇహహిC ఆగేC | ప్రనవఉC సబహి కపట సబ త్యాగేC || 3 ||
                                        హోహు ప్రసన్న దేహు బరదానూ | సాధు సమాజ భనితి సనమానూ ||
                                        జో ప్రబంధ బుధ నహిC ఆదరహీC | సో శ్రమ బాది బాల కబి కరహీC || 4 ||
                                        కీరతి భనితి భూతి భలి సోఈ | సురసరి సమ సబ కహC హిత హోఈ ||
                                        రామ సుకీరతి భనితి భదేసా | అసమంజస అస మోహి అCదేసా  || 5 ||
                                        తుమ్హారీ కృపాC సులభ సొఉ మోరే | సిఅని సుహావని టాట పటోరే ||
ఈవిధముగా నామనస్సును దృఢపరచుకొని , మనోహరమైన శ్రీరామ వృత్తాంతమును రచించెదను.  శ్రీరామకథావైభవమును వర్ణించిన వ్యాసాదిమహర్షులకు నా నమోవాకములు .  నా మోనోరధమును వారు సఫలము చేయుదురు గాక , శ్రీరఘుపతిగుణములను వర్ణించిన ఈకలియుగకవులకును నేను ప్రణమిల్లుదును .  శ్రీహరిగాథలను వర్ణించినప్రాకృత కవులకును , భూతభవిష్యద్వర్తమాన కవులందరికిని నిస్సంకోచముగా నమస్కరించుదును .  నాకవితాను సాధుసమాజము గౌరవించును గాక , సహృదయులైన బుద్ధిమంతులుమెచ్చని వ్యర్ధకవిత్వములను వ్రాసినవాడు మూర్ఖుడే , కీర్తి , కవిత , సంపద అనునవి గంగా జలములవలె   - అందరికిని హితమును చేకుర్చునవిగా ఉండవలెను .  శ్రీరామునికీర్తి అతిమనోహరమైనది అతి సాధారణమైన నాకవితద్వారా దానిని వర్ణించుట అసంజసమగునేమో అని నా భయము. ఓ మహాకవులారా ! మీ కృప వలన ఈభయము కూడా దూరముకాగలదు.  ఏలనన పట్టుదారముతో చేసిన నగిషీలు   గోనెపట్టపై కూడా అందంగానే ఉండును .  

సోమవారం, ఫిబ్రవరి 12, 2018

రామచరిత మానస, 20 శ్రీరామునిపాదకమలములకు శిరసా ప్రణమిల్లి గుణగానమొనర్చెదను .

సోమవారం, ఫిబ్రవరి 12, 2018

దో - సారద సేస మహేస బిధి , ఆగమ నిగమ పురాన |
        నేతి నేతి కహి జాసు గున , కరహిC నిరంతర గాన || 12 ||
వాగ్దేవియు , శేషుడు , పరమశివుడు పరమేష్ఠియు , వేదశాస్త్రపురాణములు శ్రీరామచంద్రుని గుణములను నిరంతరము గానముచేయుచు పూర్తిగా వర్ణింపబడును, కానీ అతని అనంతగుణములను వర్ణింపజాలక నేతి నేతి ( న + ఇతి , న + ఇతి ) అనుచు గానము చేయుచుండెను .  
చౌ - సబ జానత ప్రభు ప్రభుతా సోఈ | తదపి కహేC బిను రహా న కోఈ ||
తహాC భేద అస కారన రాఖా | భజన ప్రభాఉ భాCతి బహు భాషా || 1 ||
ఏక అనీహ అరూప అనామా | అజ సచ్చితానంద పర ధామా ||
బ్యాపక బిస్వరూప భగవానా | తెహిC ధరి దేహ చరిత కృత నానా || 2 ||
సో కేవల భగతన హిత లాగీ | పరమ కృపాల ప్రనత అనురాగీ ||
జెహి జన పర మమతా అతి ఛోహో | జెహిC కరునా కరి కీన్హీన కోహూ || 3 ||
గఈ బహోర గరీబ నెవాజూ | సరల సబల సాహీబ రాఘురాజు ||
బుధ బరనహిC హరి జస అస జానీ | కరహిC పునీత సుఫల నిజ బానీ || 4 ||
తెహిC బల మైC రఘుపతి గున గాథా | కహిహఉC  నాఇ రామ పద మాధా ||
మునిస్హ ప్రథమ హరి కీరతి గాఇ | తెహిC మగ చలత సుగమ మొహి భాఈ || 5 ||
శ్రీరాముని వైభవమును వర్ణింపనలవికానిదని ఎఱింగియు ఎవ్వరును వర్ణించుట మానలేదు  ఆయనభజనప్రభావమును వేదములు అనేకవిధములుగా తెల్సినవి .  ఏ కొద్దిపాటి గుణగానమైనను మానవులను భవసాగరమునుండి తరింపచేయును .  పరమేశ్వరుడొక్కడే . అతడు నిష్కాముడు , నిరాకారుడు , జన్మనామములేనివాడు , సచ్చితానంద స్వరూపుడు , పరంధాముడు , విశ్వవ్యాప్తి , విశ్వరూపుడు . అయినను దివ్యశరీరము ధరించి , పెక్కుఅవతారము ద్వారా తనలీలలను ప్రకటించును .  భగవంతుడు పరామకృపాళువు, శరణాగతివత్సలుడు , కావున భక్త సంరక్షణమునకై వారి శ్రేయస్సుముకొరకై  తన ఈలీలలును ప్రదర్శించుచుండును .  తన కరుణాదృష్టిని అయాచితముగానే  భక్తులపై ఆయనకు కల కృపావాత్సల్యము అపారము .  ఒక్కోసారి కృపజూపినవారిపై ఎన్నడును ఆయన కోపగింపడు .  భక్తులు నష్టపోయినదానిని లభ్యమగునట్లు చేయును .  అనగా భక్తులయోగక్షేమములను వహించుచుండువాడతడే .  అతడు దీనబందువు , సరళస్వభావుడు ,  సర్వశక్తిమంతుడు , అందరికిప్రభువు .  దీనిని ఎరింగియే బుద్ధిమంతులు శ్రీహరియసమును కీర్తించుచు తమవాక్కులను పునీత మొనర్చుకొనుచు జీవితములను సఫలముచేసికొనుచుందురు .  ఈకారణమునే శ్రీరామునిపాదకమలములకు శిరసా ప్రణమిల్లి ,ఆయన గుణగానమొనర్చెదను .  పూర్వము వ్యాస వాల్మీకాది మహర్షులు , శ్రీహరివైభవములను వర్ణించిరి .  వారిమార్గమును అనుసరించుటయే నాకును సులభము.      

ఆదివారం, ఫిబ్రవరి 11, 2018

రామచరిత మానస, 19, ఈ కథను చెప్పుటకు నాకు ధైర్యము చాలదు .

ఆదివారం, ఫిబ్రవరి 11, 2018

దో - జుగుతి బేధి పుని పోహిఅహిC , రామచరిత బర తాగ | 
        పహిరహిC సజ్జన బిమల ఉర , సోభా అతి అనురాగ || 11 ||
ఈ కవితా ముక్తామణులను యుక్తితో భేదించి , రామకధాసూత్రమున గూర్చి , సజ్జనుల తమ నిర్మల హృదయములయందు ధరించినచో అవి మిక్కిలి అనురాగశోభితములగును , భక్తి భరితములగును . ( దో || 11|| )
చౌ - జే జనమే కలికాల  కరాలా | కరతబ బాయస బేష మరాలా  ||
        చలత కుంపథ భేద మగ ఛాCడే | కపట కలేవర కలిమల భాCడే || 1 ||
        బంచక  భగత కహాఇ రామ కే  | కింకర కంచన కోహ కామ కే ||
        తిన్హ మహC ప్రథమ రేఖ జగ మోరీ | ధీంగ ధరమధ్వజ ధందక ధోరీ || 2 ||
        జౌC అపనే అవగున సబ కహఊC | బాఢఇ కథా సార నహిC లహఊC ||
        తాతే మైC అతి అలప బఖానే | ధోరే మహుC జానిహహిC సయానే || 3 ||
        సముఝి బిబిథి బిధి బినతీ మోరీ | కొఉ న కథా సుని దేఇహి ఖోరీ ||
        ఏతెహు  పర కరిహహిC  జె అసంకా|  మొహి తే  అధిక తె జడ మతి రంకా ||4||
        కబి న హోఉC నహిC చతుర కహావఉC | మతి అనురూప రామ గున గావఉC ||
        కహC రఘుపతి కే చరిత అపారా | కహC మతి మోరి నిరత సంసారా || 5 ||
        జేహిC మారుత గిరి మేరు ఉడాహీC | కహాహు తూల కెహి లేఖే మాహీC ||
        సముఝత అమిత రామ ప్రభుతాఈ | కరత కథా మన అతి కదరాఈ || 6 ||
పాప పంకిలమైన ఈ కలియుగమున పుట్టి , హంసవేషము ధరించి , కాకులవలె ప్రవర్తించువారును , వైదిక మార్గము విడిచి , దుర్మార్గములో సాగిపోయెడి వారును, పాపాత్ములును , రామభక్తులమని చెప్పుకొనుచు లోకులను మోసగించెడివంచకులును , కామక్రోధలోభములనకు దాసులను , పాషండులును , ధర్మధ్వజులను అయినవారిలో నేను ప్రధముడును , నాదుర్గుణములకు లెక్కలేనేలేదు , వాటిని వివరింప సాగినచో ఆ కథయే విస్తృతమగును .  వాటిలో కొన్నిటిని మాత్రమే తెలిపితిని .  సహృదయాలు ఈమాత్రము వివరములుతో అంతయు అర్ధంచేసుకుందురు.  నా ఈ మానవుని గ్రహించి , నా ఈకథను విన్నవారెవరు నన్ను దోషిగాతలంపరు. అయినప్పటికీ శంకించిన వారు నాకంటే మిక్కిలి మూర్ఖులు , మందబుద్ధులు , నేను కవిని కాను , చతురుడను కాను , శ్రీరాముని కథావైభవమును నా బుద్ధికి తోచినట్లుగా వర్ణించుచున్నాను .  శ్రీరాముని అపారమైన చరిత్ర ఎక్కడ ? సంసార వ్యామోహములో కూరుకుపోయిన నా బుద్ది ఎక్కడ ? మేరు పర్వతమును కూడా కదలించు శక్తి కలిగిన వాయువుముందు దూది ఎట్లా నిలువగలదు .  శ్రీరాముని అనంతవైభవములను తలచినప్పుడు ఈ కథను చెప్పుటకు నాకు ధైర్యము చాలదు .  

శనివారం, ఫిబ్రవరి 10, 2018

రామచరిత మానస, 18, సరస్వతీదేవి రాక.

శనివారం, ఫిబ్రవరి 10, 2018

చౌ - మని మానిక ముకుతా ఛబి జైసీ | అహి గిరి గజ సిర సోహ న తైసీ ||
         నృప కిరీట తరునీ తను పాఈ  | లహహిC సకల సోభా అధికాఈ || 1 ||
         తైసెహిC సుకబి కబిత బుధ కహహీC | ఉపజహిC అనత అనత ఛబి లహహీC ||
         భగతి హేతు బిధి భవన బిహాఈ | సుమిరత సారత ఆవతి ధాఈ || 2 || 
         రామ చరిత సర బిను అన్హవాఏC | సో శ్రమ జాఇ  న కోటి ఉపాఏC || 
         కబి కోబిత  అస హృదయC బిచారీ | గావహిC హరి జస కలిమల హారీ || 3 ||
         కీన్హేC ప్రాకృత జన గున గానా | సిర ధుని గిరా లగత పఛితానా ||
         హృదయ సింధు మతి సీప సమానా | స్వాతి సారద కహహిC సుజానా || 4 ||
         జౌC బరసఇ బర బారి బిచారూ | హోహిC కబిత ముకుతామని చారూ || 5 ||
పాములపడగలపైగలమణులును పర్వతములపైగల మాణిక్యములును , గజములమస్తకముల యందుండు ముత్యములను అంతగాశోభింపవు .  అవియే రాజులకిరీటములయందును, తరుణీమణులతనువులపైనను చేరి , వింతకాంతులను వెదజల్లును .  " కవిః కరోతి కావ్యాని , రసం జానాతి పండితః " అని ప్రాజ్ఞులు పల్కుచుందురు .  కావ్య నిర్మాణమునకు పూనుకొనిన కవి స్మరించినంతమాత్రముననే శ్రీరామభక్తి పారవశ్యమున సరస్వతీదేవి బ్రహ్మలోకమునుండి భూమికి పరుగులుదీయుచు వచ్చును.  ఆమెచే కవి శ్రీరామచరితమనెడి సరోవరమునందు స్నానము చేయించినప్పుడే ఆమె యొక్క దూరప్రయాణపుబడలిక తొలగిపోవును.  ఇది తప్ప వేఱుగా కోటి ఉపాయములు చేసినను ఆ బడలిక తీరదు .  ఈ విషయమును గ్రహించియే కవులును, పండితులను, కలిపాపములనురూపుమాపు రామచరిత యశోగానమును చేయుదురు.  కవులు సామాన్యమానవుల చరిత్రమును పొగడినచో సరస్వతీదేవి తనరాకకు పశ్చాత్తాపబడును .  పండితులు కవిహృదయమును సముద్రముతోడను అతని బుద్దిని ముత్యపు తోడను సరస్వతీదేవిని స్వాతివానతోడను పోల్చెదరు. ఇందులో సుందరభావములనెడి వర్షపుచినుకులు పడినచో అందమైన కవితాముక్తాముణులరూపములలో అది భాసించును .        

శుక్రవారం, ఫిబ్రవరి 09, 2018

రామచరిత మానస, 17, సజ్జనులు గానము చేయుదురు

శుక్రవారం, ఫిబ్రవరి 09, 2018

ఛం - మంగల కరని కలిమల హరని తులసీ కథా రఘునాధ కీ |
          గతి కూర కబితా సరిత కీ జ్యోC సరిత పావన పాథ కీ ||
          ప్రభు సుజన సంగతి భనితి భలి హోఇహి సుజన మన భావనీ |
          భవ అంగ భూతి మసాన కీ సుమిరత సుహావని పావనీ ||
తులసీదాసు పలుకుచున్నాడు .  శ్రీరఘునాధునిచరితము కలియుగపాపములను కడిగి వేయును ,  కళ్యాణపరంపరను గూర్చును.  శోభరహితమైన నా కవితాస్రవంతి పావనగంగానదివలె ఎన్నిమలుపు తిరిగినను .  శ్రీహరి వైభవ సాంగత్యముచే సుజనులుకు మనోహరముగా ఉండును .  స్మశానములోని అపవిత్రమైన భస్మముకూడా శంభుని శరీరస్పర్శ చేత సుశోభితమై , స్మరణమాత్రముననే పవిత్రమొనర్చును .  (చంద్)
దో - ప్రియ లాగిహి అతి సబహి మమ , భనితి రామ జస సంగ |
         దారు బిచారు కి కరఇ కొఉ , బందిఅ మలయ ప్రసంగ || 10 క ||
         స్యామ సురభి పయ బిసద అతి , గునద కారేహిC సబ పాన |
         గిరా గ్రామ్య సియ రామ జస , గావహిC సునహిC  సుజాన || 10 ఖ ||
మలయాపర్వతమునందలి చందనవృక్షసమీపమునకుగల ఏ వృక్షమైనను అది చందన వృక్షముగానే మాఱును . అందరూ దానిని ఆదరించుదురు .  అట్లే శ్రీరామ వైభవ సాహచర్య ప్రభావమున నా కవిత ఎల్లరురకు అత్యంత ప్రీతికరమేయగును .  నల్లని ఆవుపాలు కూడా తెల్లగాను , పుష్టికరముగాను ఉండును .  అందరును దానిని సేవింతురు.  అట్లే నా భాష గ్రామ్యమేయైనను సీతారాములకథను వర్ణించుటవలన సజ్జనులు దానిని గానము చేయుదురు, చెవులప్పగించి విందురు .   
     

గురువారం, ఫిబ్రవరి 08, 2018

రామచరితమానస , 16 , రామాయణ మహత్త్వం

గురువారం, ఫిబ్రవరి 08, 2018

రామచరితమానస , 16 , రామాయణ మహత్త్వం
దో - భనితి  మోరి సబ గున రహిత ,  బిస్వ బిదిత గున ఏక |
         సో బిచారి సునిహహిC సుమతి , జిన్హ కేC బిమల బిబేక || 9  ||
నాకవితలో ఎట్టి సుగుణములు లేవు . కానీ జగత్ప్రసిద్ధమైన శ్రీరామకథయను ఒకే ఒక సుగుణము కలదు , జ్ఞానులును , వివేక వంతులును దానిని ఎరిగి సాదరముగా ఆలకింతురు . 

రామాయణ మహత్త్వం
      చౌ - ఎహి మహC రఘుపతి నామ ఉదారా | అతి పావన పురానా శృతి సారా || 
              మంగల భావన అమంగల హారి | ఉమా సహిత జెహి జపత పురారీ || 1 || 
              భనితి బిచిత్ర సుకబి కృత జోఊ| రామ నామ బిను సోహ న సోఊ || 
              బిధుబదనీ సబ భాCతి సCవారీ | సోహ న బసన బినా బర నారీ || 2 || 
              సబ గున రహిత కుకబి కృత బానీ | రామ నామ జస అంకిత జానీ || 
              సాదర కహహిC సునాహిC బుధ తాహీ |  మధుకర సరిస సంత గునగ్రాహీ || 3 ||  
              జదపి కబిత రస ఏకఉ  నాహీC | రామ ప్రతాప ప్రగట ఎహి మాహీC|| 
              సోఇ భరోస మోరేC మన ఆవ | కెహిC న సుసంగ బడప్పను పావా || 4 || 
              ధూమఉ తజఇ సహజ కరుఆఈ | అగరు ప్రసంగ సుగంధ బసాఈ || 
              భనితి భదేస బస్తు భలి బరనీ | రామ కథా జగ మంగల కరనీ || 5 || 

ఇందు సాంబశివుడు సర్వదా జపించు శ్రీరామచంద్రునిపావననామము గలదు .  ఇది మిక్కిలి పవిత్రమైనది .  వేద , పురాణములసారము , కళ్యాణములకు పెన్నిధి , అశుభములు రూపుమాపునది , అనేకకాలంకారభూషితైనను , ఎంత సౌందర్యవతి అయినను వస్త్రములుధరింపని స్త్రీ శోభింపదు .  అట్లే మహాకవిచే వ్రాయింపబడినది అయినను మిక్కిలి ప్రశంసింపమైనదైనను రామనామము లేని కావ్యము శోభింపదు .  కానీ అల్పజ్ఞుడైన కుకవిచే వ్రాయబడినను , అది గుణరహితమైనదైనను రామనామవైభవముచే అలంకృతమైన కావ్యమును సజ్జనులు సాదరంగా చదివి , విని ఆనందింతురు.  తుమ్మెదలు పుష్పములోని మధువును గ్రోలినట్లు సత్పురుషులు గుణములనే గ్రహించుదురు .   ఇందు కవితారసపోషణలేకున్నను శ్రీరామచంద్రునిప్రతాపము బహుదా కీర్తింపబడినది.  ఇదియే నా సంపూర్ణ విశ్వాసమునకు మూలము .  సత్సాంగత్యమువలన గౌరవముదక్కని వారెవరు ? పొగ అగరు సాంగత్యమున తన సహజమైన ఘాటును , కఱుకుధనమును వదలి సుగంధమునే వ్యాపింపచేయును .  అట్లే నా కవిత సౌందర్య శోభితముకాకున్నాను రామకథావర్ణమహిమగుటవలన  శుభప్రదమైనది .  

బుధవారం, ఫిబ్రవరి 07, 2018

రామచరిత మానస, 15, దుర్జనుల పరిహాసముగూడ నాకు హితమే

బుధవారం, ఫిబ్రవరి 07, 2018

దో - భాగ చోట అభిలాషు బడ , కరఉC ఏక బిస్వాస |
        పై హహిC సుఖ సుని సుజల సబ , ఖల కరిహహిC ఉపహాస ||
నాశక్తి అల్పము , కానీ లక్ష్యము అనల్పం దుర్జనులు పరిహాసించును , సుజనులు నా రచనకు ఆనందింతురని నా పరమ విశ్వాసము . 

చౌ - ఖల పరిహాస హోఇ హిత మోరా | కాక కహహిC కలకంఠ కఠోరా ||
        హంసహి బక దాదుర చాతకహీ | హCసహిC మలిన ఖల బిమల బతకహీ  || 1  ||
        కబిత రసిక న రామ పద నేహూ| తిన్హ కహC సుఖద హాస రస ఏహూ ||
        భాషా భనితి బోరి మతి మోరీ | హCసిబే జోగ హCసేC నహిC ఖోరీ || 2 ||
        ప్రభు పద ప్రీతి న సాముఝి నీకీ | తిన్హహి కథా సుని లాగిహి ఫీకీ  ||
        హరి హర పద రతి మతి న కుతరకీ | తిన్హ కహుC మధుర కథా రఘుబర కీ || 3 ||
        రామ భగతి భూషిత జియCజానీ | సునిహహిC సుజన సరాహి సుభానీ ||
        కబి న హోఉC నహిC బచన ప్రబీనూ | సకల కలా సబ బిద్యా హీనూ || 4 ||
        ఆఖర ఆరథ ఆలంకృతి నానా | ఛంద ప్రబంధ అనేక బిధానా ||
        భావ భేద రస భేద అపారా | కబిత దోష గున బిబిధ ప్రకారా || 5 ||
        కబిత బిబేక ఏక నహిC మోరేC | సత్య కహఉC లిఖి కాగద  కోరేC || 6 ||
దుర్జనుల పరిహాసముగూడ నాకు హితమే .   కోకిలపాట కాకులకు కఠోరముగానే ఉండును.  కొంగలు హంసలను .  కప్పలు చాతకపక్షులను పరిహసించుచుండును.  నీచులు సచ్చరితలు విని నవ్వుదురు .  కవిత్వమునందును  శ్రీరామచంద్రుని పాదపద్మములయందును భక్తిలేని కవితారసికులకు ఈ కవిత హాస్యరస ప్రధానమై సుఖమునిచ్చును.  నా రచన లౌకికభాషలో సాగినది .  పైగా నాబుద్ధి అల్పమైనది .  కావున నవ్వదగినది.  అందువల్లవారు నవ్వుటలో వారిదోషము ఏమిలేదు.  శ్రీహరి చరణకమలములయందు భక్తిలేనివారికిని , అవగాహనరహితులకును ఈ కథ పేలవంగా కనిపించవచ్చు.  హరిహర భక్తులకును , కుతర్కబుద్దులుకానివారికిని శ్రీ రఘునాధునిచరితము మధురముగా ఉండును , హాయిని గొల్పును , సజ్జనులు ఈ గాధను శ్రీరామభక్తివైభవభూషితమైనదిగా గ్రహించి, మనోహరముగా ప్రశంసించుదురు.  నేను కవిని కాను .  వాక్చతురుడునూ కాను , వాక్యరచనాకళయందును , నాకు ప్రావీణ్యములేదు .  శబ్దార్ధ ప్రయోగములు వివిధములు . అలంకారములు , ఛందస్సులు అనేకము .  భావరుసభేదములు అపరిమితములు .   కవితాగుణములు , దోషములు వివిధములు ఈ కవితావిశేషములలో ఏ ఒక్కదానిని గూర్చియు నేనెరుగనేఎరుగను .  ఈ సత్యమును   ప్రమాణపూర్వకముగా తెల్పుచున్నాను .   

మంగళవారం, ఫిబ్రవరి 06, 2018

రామచరిత మానస, 14 , నేను అమృతము కోరుచున్నాను

మంగళవారం, ఫిబ్రవరి 06, 2018

చౌ - ఆకర చారి లాఖ చౌరాసీ | జాతి జీవ జల థల నభ బాసీ ||
         సీయ రామమయ సబ జగ జానీ | కరఉC ప్రనామ జోరి జుగ పానీ || 1 ||
         జాని కృపాకర కింకర మోహో | సబ మిలి కరహు ఛాడి ఛల ఛోహో ||
         నిజ బుధి బల భరోస మోహి నాహిC | తాతేC బినయ కరఉC సబ పాహీC || 2 ||
         కరన చహఉC రఘుపతి గున గాహా  | లఘు మతి మోరి చరిత అవగాహా  ||
         సూఝ న ఏకC అంగ ఉపాఊ  | మన మతి రంక మోనోరధ రాఊ  || 3 ||
         మతి అతి నీచ ఊCచి రుచి ఆఛీ | చహిఅ అమిఅ జగ జురఇ న ఛాఛీ  ||
         ఛమిహహిC సజ్జన మోరి ఢిఠాఈ | సునిహహిC బాలబచన మన లాఈ || 4 ||
          జౌC బాలక కహ తోతరి బాతా | సునహిC ముదిత మన పితు అరు మాతా ||
          హCసిహహిC  కూర కుటిల కుబిచారీ | జే పర దూషన భూషనధారి || 5 ||
          నిజ కబిత్త కేహి లాగ న నీకా |  సరస హోఉ అథవా అతి ఫికా ||
          జే  పర భనితి సునిత హరషాహీC | తే బర పురుష బహుత జగ నాహీC || 6 ||
          జగ బహు నర సర సరి సమ భాఈ | జే నిజ బాఢి బడహిC జల పాఈ ||
          సజ్జన సకృత సింధు సమ కోఈ | దేఖి పూర బిధు బాఢఇ జోఈ || 7  ||
భూమ్యాకాశములందును జలములయందును జీవించు చతుర్విధములైన  ( జరాయుజ , అండజ , స్వేదజ , ఉద్బీజములు ) 1.  మానవులు , జంతువులు  2.  పక్షులు 3. క్రిమి , కీటకాదులు  4.  మొక్కలు .  ఎనుబదినాలుగు లక్షల జీవరాసులు సీతారాములని భావించి , వాటికి అంజలి ఘటించుదును .  ఓ దయానిధులారా ! నన్ను మీ సేవకునిగా భావించి , నిష్కపటచిత్తములతో నాపై కృపచూపించండి .  నా బుద్ధిబలముపై నాకు విశ్వాసములేదు.  కనుక మీకువిన్నవించుకొనుచున్నాను.  రఘుకులతిలకుఁడైన శ్రీరామునిగుణములను వర్ణింపగోరుతున్నాను .  నా బుద్ది చాలా అల్పమైనది .  శ్రీరాముని చరిత అగాధమైనది.  నేను ఏ కావ్యఅంగము ఎరుగను .  నా మనోరధము మాత్రము రాజువలె ఉన్నతమైనది కానీ నా మనస్సు , బుద్ధి నిరుపేదలవలె అల్పములైనవి.  నా కోరిక ఘనమైనది ,  కానీ నా బుద్ధి మాత్రము అల్పమైనది.  నేను అమృతము కోరుచున్నాను .  కానీ మజ్జిగ కూడా సంపాదించ శక్తిలేనివాడను .  సజ్జనులు నా అతిసాహసమును మన్నించి, ఈ బాలుని వచనములను ఆదరముతో ఆలకించుదురు గాక .  తల్లిదండ్రులు తమ పిల్లల చిలుకపలుకలును చూసి  ఆనందించుడు. 
కఠినాత్ములు , కుటిలురు , దురాలోచనపరులు ఇతరుల దోషములే ఎంచుటఏ ఒక ఘనకార్యముగా భావించి , వారిని పరిహాసించుదురు .  మనోహరముగా నున్నా లేక పేలవంగా నున్నను ఎవరికవిత్వం వారికి మధురముగానే ఉండును . కానీ ఇతరులారచనలను విని మెచ్చుకొను సజ్జనులు మాత్రం చాలా అరుదుగామాత్రమే ఉందురు .  కుంభవృష్టి పడినప్పుడు వరదలు పొంగిపొరలు  నదులు.  తటాకములవలె తమ ఉన్నతికి పొంగిపోవు జనులు లోకమున కోకొల్లలు .  కానీ పూర్ణ చంద్రుని చూచి గంతులువేయు సముద్రునివలె ఇతరులఔన్నత్యమును  చూచి, సంతసించు సహృదయులు చాలా తక్కువగా ఉందురు .  

సోమవారం, ఫిబ్రవరి 05, 2018

రామచరిత మానస, 13, సమస్త ప్రాణకోటికి ప్రణమిల్లుదును .

సోమవారం, ఫిబ్రవరి 05, 2018

దో - గ్రహ భేషజ జల పవన పట , పాఇ కుజోగ సుజోగ  |
       హోహిC కుబస్తు సుబస్తు జగ , లఖహిC సులచ్ఛన లోగ || 7 క ||
        సమ ప్రకాస తమ పాఖ దుహుC , నామ భేద బిధి కీన్హ |
        ససి సోషక పోషక సముఝీ, జగ జస అపజస దీన్హ || 7 ఖ ||
        జడ చేతన జగ జీవ జత , సకల రామమయ జాని |
        బందఉC సబకే పద కమల , సదా జోరి జుగ పాని  || 7 గ ||
        దేవ దనుజ నర నాగ ఖగ , ప్రేత పితర గంధర్బ |
        బందఉC  కిన్నెర రజనిచర, కృపా కరహు అబ సర్బ  || 7 ఘ  ||
గ్రహములు, ఔషధులు, జలములు , వాయువు, వస్త్రములు ఇవి అన్నియును వాటి వాటి సహచర్యములను బట్టి మంచి , లేక చెడుగా భావింపబడుచుండును.  విజ్ఞులైన వారు ఈ లోకసత్యములను ఎఱుంగ గలరు.  శుక్ల , కృష్ణపక్షములయందు వెన్నెల , చీకటి సమంగానే వుండును. కానీ విధాత వాటికి వేరువేరు పేర్లును పెట్టెను .  లోకము చంద్రునికళలవృద్ధికి తోట్పడు శుక్లపక్షమును ప్రకాశించును .  క్షీణదశకు ఆకరమగు కృష్ణపక్షమును  ఏవగించుకొనును .  విశ్వమునందలి చేతనాచేతన పదార్ధములన్నియును శ్రీరామమయములు .  కావున నేను వాటిచరణకమలములకు చేతులుజోడించి మ్రొక్కెదను .  దేవతలు, దైత్యులు, మానవులు, నాగులు, పక్షులు, ప్రేతలు, పితరులు, గంధర్వ, కిన్నెర, రాక్షసులు మొదలుగు సమస్త ప్రాణకోటికి ప్రణమిల్లుదును .  తదనుగ్రహము నాకు లభించుగాక.        

ఆదివారం, ఫిబ్రవరి 04, 2018

రామచరిత మానస, 12, భగవదనుగ్రహము

ఆదివారం, ఫిబ్రవరి 04, 2018

దో - జడ చేతన గున దోషమయ , బిస్వ కీన్హ కరతార |
        సంత హంస గున గుహహిC పయ , పరిహరి బారి బికార || 6 ||
భగవంతుడు చేతనాచేతనరూపమైన విశ్వాసమునందు మంచిచెడులను  సృష్టించెను.  హంస పాలను గ్రహించి నీటిని వదలినట్లే సాధువులు గుణములను గ్రహించి , దోషములను దూరముగా పరిహరించెదరు. 

చౌ - అస బిబేక జబ దేఇ బిదాతా | తబ తజి దోష గునహిC మను రాతా ||
        కాల సుబాఉ కరమ బరిఆఈC |  భలెఉ ప్రకృతి బస చుకఇ భలాఈC || 1  ||
        సో సుధారి హరిజన జిమి లేహిC |  దలి దుఖ దోష బిమల జసు దేహీC||
        ఖలఉ కరహిC భల పాఇ సుసంగూ | మిటఇ న మలిన సుభాఉ అభంగూ || 2 ||
        లఖి సుభేష జగ బంచక జేఊ | బేష ప్రతాప పూజిఅహిC తేఊ ||
        ఉఘరహిC అంత న హోఇ నిబాహూ |  కాలనేమి జిమి రావన రాహూ || 3 ||
        కిఎహుC కుబేషు సాధు సనమానూ | జిమి జగ జామవంత  హనుమానూ ||
        హాని కుసంగ సుసంగతి లాహూ | లోకహుC బేద బిదిత సబ కాహూ || 4 ||
        గగన చఢఇ రజ పవన ప్రసంగా | కీచహిC  మిలఇ నీచ జల సంగా  ||
        సాధు అసాధు సదన సుక సారీC| సుమిరహిC రామ దేహిC గని గారీC||  5  ||
        ధుమ కుసంగతి కారిఖ హోఈ |  లిఖిఅ పురాన మంజు మసి సోఈ ||
         సోఇ జల అనల అనిల సంఘాతా | హోఇ జలద జగ జీవన దాతా ||   6  ||

భగవదనుగ్రహమున విచక్షణాశక్తిని కల్గివున్నవారు చెడును విసర్జించి,  మంచిని మాత్రమే గ్రహించుదురు.  ఒక్కొక్కప్పుడు మంచివారుసైతము మాయామోహితులై కాలము , స్వభావము , కర్మల ప్రభావముచే సన్మార్గము నుండి వైదొలుగుదురు.  భగవద్బాక్తులు ఈ పొరపాటును తెలుసుకుని , వాటిని సవరించుకొందురు.  దుఃఖదోషములును అధిగమించి నిర్మలమైనయాశమును  పొందుదురు .  అలాగే దుష్టులుగూడ ఒక్కొక్కసారి సత్సాంగత్యప్రభావమున సత్కర్మలను ఆచరింతురు .  కానీ వారి దుష్టస్వభావములు మాత్రము మారవు .  కపట వేషధారులైన ధూర్తులు మొదట గౌరవింపబడినను కాలక్రమమున వారివారి నిజస్వరూపము బట్టబయలగును .  కాలనేమి , రావణుడు , రాహువు మొదలుగు వారివృత్తాంతములు ఇందుకు ప్రబల నిదర్శనము .  సజ్జనుల , రూపములు, వేషములు ఎట్లనన్న వారు హనుమద్జాంబవతాదులువాలె అందరిచే గౌరవింపబడుదురు .  దుష్టసహవాసము ప్రమాదకరం .  సజ్జనమైత్రి వరప్రసాదం .  ఇది లోకవిదితము , వేదప్రామాణికము . వాయు సాంగత్యమున పైకెగురు ధూళి ఉన్నతస్థితికి చేరును.  అదియే పతనోన్ముఖంగా సాగిపోవు నీటితో కూడినప్పుడు బురదై అధోగతిపాలగును .  సజ్జనులఇండ్లలో పెరిగిన చిలుకలు , గోర్వంకలు , రామనామము జపించును .  దుర్జనుల ఇండ్లలోని చిలుకలు దుర్భాషలాడును .  పొగ మాలినములతో కల్సినచొ నల్లబారును .  కానీ సిరాగా మారినచో పవిత్ర పురాణములును వ్రాయవచ్చును .  ఆ పోగయే- నీరు , అగ్ని , గాలితో కలిసి , మేఘముగా , మారినపుడు , వర్షజలముల ద్వార జీవులకు ప్రాణదాత యగును.  

శనివారం, ఫిబ్రవరి 03, 2018

రామచరిత మానస, 11, సజ్జనులు మంచినే పట్టుకుందురు.

శనివారం, ఫిబ్రవరి 03, 2018

దో -  భలో భలాఇహి పై లహఇ , లహఇ  నిచాఇహి నీచు ||
         సుధా సరాహిఅ  అమరతాC , గరల సరాహిఅ మీచు ||  5  ||
సజ్జనులు మంచినే పట్టుకుందురు.  దుర్జనులు చెడును విడిచిపెట్టారు.  అమృతము అమరత్వమును ప్రసాదించును, విషము మరణమునే ప్రసాదించును ఈరెండును తమతమ గుణములకు ప్రసిద్ధము, దోహదకారులు. 

చౌ - ఖల అఘ అగున సాధు గున గాహా | ఉభయ అపార ఉదధి అవగాహా ||
         తెహి తేC కఛు గున దోష బఖానే    | సంగ్రహ త్యాగ న బిను పహిచానే || 1  ||
         భలెఉ  పోచ సబ బిధి ఉపజాఏ     | గని గున  దోష బేద బిలగాఏ ||
         కహహిC బేద ఇతిహాస పురానా       | బీధి ప్రపంచు గున అవగున సానా || 2||
         దుఖ సుఖ పాప పున్య  దిన రాతీ    | సాధు అసాధు సుజాతి కుజాతీ ||
         దానవ దేవ ఊCచ ఆరు నీచు         | అమిఅ సుజీవను మాహురు మీచూ || 3||
         మాయా బ్రహ్మ జీవ జగదీసా           | లఛ్చి అలఛ్చి రంక అవనీసా ||
         కాసీ మగ సురసిరి క్రమనాసా          | మరు మారవ మహిదేవ గవాసా || 4||
         సరగ నరక అనురాగ బిరాగా           | నిగమాగమ గున దోష బిభాగా ||
దుర్జనుల పాపకృత్యాలను  దోషములను , సజ్జనుల సద్గుణాలను చెప్పే కథలు సముద్రములవలే అపారములు , అగాధములు .  ఇందులో సజ్జనుల గుణములను , దుర్జనులు దోషములను వర్ణించబడినవి .  ఎలా అంటే వారి తారతమ్యమును గుర్తించనిదే సుగుణాలను గ్రహించుటకును , దుర్గుణములను నిరాకరించుటకు సాధ్యము కాదు.  గుణదోషములు రెండును బ్రహ్మ సృష్టిలోని భాగమే .  వాటి తారతమ్యములను వేర్వేరుగా స్పష్టముగా విశదీకరించును .  వేదములతో పాటు  ఇతిహాసపురాణాదులు గూడా బ్రహ్మ సృష్టి గుణదోషముల సమ్మేళనమని నొక్కివక్కాణించెను .  ఇట్టి వైరుద్యములు ఈ సృష్టిలో అనంతము .  సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు ,  దివారాత్రములు , మంచిచెడులు, సుజాతికుజాతులు , దేవదానవులు , ఉచ్చనీచములు , అమృతవిషములు , జననమరణములు , బ్రహ్మ - మాయలు , ఈశ్వర - జీవులు , సంపద - దారిద్రములు , రాజు - పేదలు , కాశీ - మగధలు , గంగా - కర్మనాశనాదులు ,  మార్వార - మాళవ దేశములు , బ్రాహ్మణుడు - కసాయివాడు , స్వర్గ -  నరకాదులు ,  వైరాగ్యము - అనురాగములు మొదలగున్నవి.  ఈ వైవిధ్యములు ప్రజలనిదర్శనము, వేదశాస్త్రములు వీటి మంచిచెడులను వివరించినవి .  

శుక్రవారం, ఫిబ్రవరి 02, 2018

రామచరిత మానస, 10, సాధువులకును, దుష్టులకును నమస్కరించుదును.

శుక్రవారం, ఫిబ్రవరి 02, 2018

దో - ఉదాసీన అరి మీత హిత , సునత జరాహిC ఖల రీతి |
         జానీ పాని జుగ జోరి జన ,  బినతీ కరఇ సప్రీతి           ||
దుష్టులు తమ మిత్రులయొక్క, శత్రువుల యొక్క, తటస్థులయొక్క ఉన్నతిని జూచి, ఈర్ష్యతో మాడిపోవుదురు.  వీరి యీరీతిని గమనించి, వినయముతో ప్రేమతో చేతులు జోడించి వీరికి నమస్కరింతును .  (దో || 4 )
చౌ - మైC  అపనీ దిసి  కీన్హ నిహోరా        |  తిన్హ  నిజ ఓర న లఉబ భోరా ||
         బాయస పలిఅహిC అతి అనురాగా  | హోహిC నిరామిష కబహుC కి కాగా || 1 ||
         బందఉC సంత అసజ్జన చరనా      | దుఖప్రద ఉభయ బీచ కఛు బఠనా||
         బిఛురత ఏక ప్రాన హరి లేహిC        |  మిలత ఏక దుఖ దారున దేహీC     || 2 ||
         ఉపజహిC ఏక సంగ జగ మాహిC      |  జలజ జోCక జిమి గున బిలగాహీC || 
          సుధా సుర సమ  సాధు అసాధూ     | జనక ఏక జగ జలధి అగాధూ         ||
          భల అనభల నిజ నిజ కరతూతీ      | లహత సుజస అపలోక బిభూతీ    ||
          సుధా సుధాకర సురసరి సాధూ       |  గరల అనల కలిమల సరి బ్యాధూ|| 4 ||
          గున అవగున జానత సబ కో ఈ       |  జో జెహి భావ నీకా తెహి సో ఈ         || 5 ||
నాధర్మముగా వారిని నేను ప్రార్ధించితిని .  కానీ వారిస్వభావమును మానుకొందురా ? కాకులను ఎంతటి తియ్యటి పాయసముతో పోషించినను అవి మాంసమును తినుట మానుకొనునా ? నేను సాధువులకును, దుష్టులకును నమస్కరించుదును.  ఉభయులును కష్టపెట్టేవారే.   కానీ వారిమధ్య మిక్కిలి అంతరం కలదు.  సాధువులు మనకు దూరమైనను మనకు ప్రాణములే  పోయినట్లే అగును .   దుష్టులు మనకు చేరువైనను మనకు ఎనలేని భాధకలుగును.  ఏ  కాలమునందైనను సజ్జనులను దుష్టులను ఈ లోకమున ప్రక్క ప్రక్కనే జనించుదురు .  కానీ వారి వారి స్వభావములు వేరు .   కమలములు జలగలు నీటిలోనే పుట్టు చుండును .  అమృతము మధిర రెండును సముద్రము నుండియే ఉద్భవించినవి .  సజ్జనులను దుష్టులును వారి వారి కర్మలను అనుసరించి కీర్తి - అపకీర్తి లను పొందును.  సాధువులు స్వభావములు అమృతము, చంద్రుడు పవిత్ర గంగానది  వంటివి .  దుష్టుల స్వభావములు ,విషము , అగ్ని , కలి పాపములతో గూడిన కర్మనాశనదివంటిది .  వీరి గుణావగుణములును ఎల్లరును ఎరుగుదురు .  ఎవరినచ్చినవి వారు గ్రహించుదురు .     

గురువారం, ఫిబ్రవరి 01, 2018

రామచరిత మానస, 9 , దుష్టలకుసైతము నేను సమస్కరింతురు .

గురువారం, ఫిబ్రవరి 01, 2018

              చౌ - బహురి  బంది ఖల గన సతిభాఏC  | జే బిను కాజ దాహినెహు బాఏC        ||
                       పర హిత హాని లాభ జిన్హా కేరేC        | ఉజరేC హరష బిషాద బాసేరేC       ||  1  ||   
                       హరి హర జస రాకేస రాహు సే         | పర అకాజ భట సహసబాహూ సే    ||  
                       జే పర దోష లఖహిC  సాహసాఖీ       | పర హిత ఘృత జిన్హా కే  మన మాఖీ || 2 || 
                       తేజ కృసాను రోష మహిషేసా           | అఘ అవగున ధన ధనీ ధనేసా      || 
                       ఉదయ కేత సమ హిత సబహీ కే      |  కుంభకరన సమ సోవతే నీకే          || 3 || 
                       పర అకాజు లగి తను పరిహరహీC    | జిమి హిమ ఉపల కృషీ దలి  గరహీC ||  
                       బందఉC  ఖల జస సేష సరోషా       | సహస బదన బరనఇ పర దోషా     || 4 || 
                       పుని ప్రనవఉC పృథురాజ సమానా  | పర అఘ సునఇ సహస దస కానా||  
                       బహురి సక్ర సమ బినవుఉC తేహి     | సంతత సురానీక హిత జేహీ          || 5 || 
                       బచన బజ్ర జెహి సదా పిఆరా            | సహస నయన పర దోష నిహారా    || 6 ||
దుష్టులు తమకు అవ్యాజ ప్రేమతో హితమునుచేకూర్చు వారిని సైతము హింసింతురు .  ఇతరులకు హాని చేయుటలోను తమకు లాభము కలదని భావింతురు. ఇతరులను పతనము చూసి ఆనంచుదురు.  ఉన్నతిని జూచి దుఃఖ పడుదురు.  అట్టి దుష్టలకుసైతము నేను సద్భావముతో సమస్కరింతురు .  వీరు హరిహరులకీర్తి అనెడి పూర్ణచంద్రునికి రాహువు వంటివారు.   ఇతరులకు కీడు చేయుటలో వీరు సహస్ర బాహువులు,  ఇతరుల దోషాలను  వేయికనులతో వెతకుదురు.  నేతిని చెడగొట్టు ఈగవలె  వీరి మనస్సులు ఇతరులు హితములను భంగపరచుటలో నిమగ్నమగుచుందురు.  వీరు ఇతరులకు తాపమును  గూర్చుటలో వీరు అగ్నివంటివారు  .     క్రోధములో వీరు యమునివంటివారు.  పాపములు , అవగుణములు అనే ధనమునకు వీరు కుభేరులు. కేతువువలె ( తోకచుక్క )  వీరు అందరహితములను నాశనము చేయుదురు.  వీరు నిద్రలో కుంభకర్ణులవ్వాటమే లోకమునకు  మేలు.  వడగండ్లు పంటలను పాడుచేసి,  తాముకూడా కరిగిపోయినట్లే  వీరు ఇతరులకు కీడు చేయుటకు వారి ప్రాణములు కూడా ఒడ్డేదరు.  వేయి నాలుకలు తో ఇతరుల దోషములను ఆక్రోశము తో ఎన్ను వీరిని శేషుడని భావించి నమస్కరించెదను .  ఇతరుల పాపకృత్యాలను గురించి పదివేల చెవులతో విందురు.  భగవత్కథలను వినుటకై పదివేలచెవులును గోరిన పృద్విరాజుగా వీరిని భావించుదును .  సుర పాన ప్రియులైన వీరిని సురానీక  ( దేవతాసమూహము ) ప్రియుడైన  ఇంద్రుడుగా భావింతును. కఠినాతికఠిన మైన వజ్రాయుధమే ఇంద్రునకు ఇష్టము.  అలానే కఠినాతి కఠినమైన పరుషవచనములే వీరికి ఇష్టము. ఇతరుల దోషములు వెతుకుటలో వీరు సహస్రాక్షులు .    

బుధవారం, జనవరి 31, 2018

రామచరిత మానస 8 సాధుపురుషులకు నమస్కరించెదను .

బుధవారం, జనవరి 31, 2018

                            దో -  బందఉఁ  సంత సమాన చిత , హిత అనహిత నహిC కోఇ |
                                     అంజలి  గత సుభ సుమన జిమి, సుమ సుగంధ కర దోఇ|| 3 (క ) || 
                                     సంత సరల చిత జగత హిత , జాని సుభాఉ   సనేహు      |
                                     బాలబినయ సుని కరి కృపా , రామచరన రతి దేహు         || 4 (ఖ) ||
దోసిట చేరిన పుష్పములు రెండుచేతులుకును (అంటే పుష్పములు కోసిన చేయికి మరియు పట్టుకున్న చేతికి )  సుగంధమును సమానముగా పంచును.     అట్లే సాధుపుంగవులు అందరిని సమభావముతోనే చూచుదురు .  వారికి శత్రువులుకానీ మిత్రులు కానీ ఉండరు .  అట్టి సాధుపురుషులకు నమస్కరించెదను . 
సాధువులు సరళ చిత్తులు , లోకోపకారులు , వారిసద్ భావమును స్నేహమును తెలుసుకుని , " ఓ సాధువులారా ! ఈ బాలుని ప్రార్ధనను మన్నించి శ్రీరామచంద్రునిపాదపద్మములపై ప్రీతికలుగునట్లు అనుగ్రహింపుడు" - అని తులసీదాసు వేడుకుంటున్నారు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)