Blogger Widgets

బుధవారం, జనవరి 11, 2012

స్వామీ వివేకానంద-సూక్తులు

బుధవారం, జనవరి 11, 2012


స్వామీ వివేకానంద జనవరి 12, 1863 - జూలై 4, 1902 బెంగాలీలో 'షామీ బిబేకానందో' ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. హిందూ తత్వ చరిత్ర, భారతదేశ చరిత్రలలోనే ఒక ప్రముఖ వ్యక్తి. రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు.
భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండుల లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి కలదు. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగో లో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్)లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.
తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిధి ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మ దినాన్ని "జాతీయ యువజన దినోత్సవం" గా ప్రకటించింది.
ఈ సందర్బములో మనం వివేకానంద స్వామి వారు చెప్పిన కొన్ని సూక్తులు గుర్తుచేసుకుందాం.
  • ఎవరినీ తప్పు పట్టవద్దు , నిందించవద్దు
  • సహాయపడగలిగితే సాయంచేయ్యి
  • లేకపోతె ఆశీర్వధించి పంపివేయు
  • మనలను మన ఆలోచనలే తీర్చు దిద్దుతాయి
  • మాటలదేముంది ఆలోచనలే కలకాలం ఉంటాయి .
  • సుదూరము ప్రయాణము చేస్తాయి .
  • దేవుడు ఎక్కడో లేదు . నీలోనే ఉన్నాడు.
  • ప్రతీ జీవిలోను ఉన్నాడు.
  • ఇతరులకి మనము ఎంత మేలుచేస్తే
  • మన హృదయాలు అంత పవిత్రమవుతాయి. 
  • అందులోనే దేవుడున్నాడు.
ఈ విధముగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకోవటం చాలా సంతోషముగా వున్నది . ఆయన సూక్తులను పాటిద్ద్దాం  మరి.

4 కామెంట్‌లు:

  1. excellent, only impossible to follow....if you drop ur hypocrite mask.

    రిప్లయితొలగించండి
  2. ప్రస్తుతము ప్రతి భారతీయుడు అనుసరించవలసినవి. చక్కగా వ్రాశారు

    రిప్లయితొలగించండి
  3. దన్యవాదములండి. వివేకానందుల వారు చెప్పినవి ప్రతీ భారతీయుడు కష్టమైనా సరె తెలిసిన వాటిలొ కొన్ని అయినా ఆచరించాలని నా కొరిక.

    రిప్లయితొలగించండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)