Blogger Widgets

బుధవారం, జనవరి 18, 2012

పార్లమెంటు భవనం

బుధవారం, జనవరి 18, 2012



పార్లమెంటు భవనం గురించి తెలియని వారు వుండరు.  చదువుకోని పిల్లలను అడిగినా చేప్తారు పార్లమెంట్ గురించి.  సులువుగా చెప్పేస్తారు అక్కడ రాజకీయనాయకులు డబ్బలాడుకుంటారు అని.  అలాంటి పార్లమెంట్ అయిన  మన భారత పార్లమెంట్ కు ఈరోజు ఒక ప్రత్యకమైన రోజుగా చెప్పుకోవాలి.  పార్లేమేంట్ కు ఇంకోపేరు సంసద్ అని పేరు వుంది సంసద్ అనే పదము సంస్కృతానికి చెందినది దీనికి అర్థం ఇల్లు లేక భవనం.
భారత పార్లమెంటు భవనాన్ని ఒక  బ్రిటిష్ ఆర్కిటెక్ట్ Lutyens రూపకల్పన మరియు సర్ హెర్బర్ట్ బేకర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్మించిన అద్భుతమైన నిర్మాణము.  దీనిని "హెర్బర్ట్ బేకర్" 1912-13 లో డిజైన్ చేశాడు.  ఇది ప్రత్యేకమైన డిజైన్ ఇది ఒక సర్క్యులర్ బిల్డింగ్.  ఇది అనేక స్తంబాలు కలిగి వృత్తాకార  నిర్మాణము.  ఇది పోర్చుగీసు వారి నిర్మాణానికి అద్బుతమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  భవనం పని 1921 లో ప్రారంభమైంది అది ఆరు సంవత్సరాల తరువాత పూర్తయింది. ఈ భవనం జనవరి 18, 1927  భారతదేశం లో లార్డ్ ఇర్విన్ అను  అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ప్రారంభించారు. ఆగష్టు 1947 లో స్వాతంత్ర్యం తరువాత ఈ పార్లమెంట్ భారతదేశం యొక్క శక్తివంతమైన ప్రజాస్వామ్యం యొక్క గుర్తుగా వుంది.
పార్లమెంట్ భవనము పైకప్పుకు 257 గ్రానైట్ స్థంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఈ భవనాలు జనపథ్ రోడ్డులో వుంది. రాష్ట్రపతి భవన్ కు చాలా దగ్గరగా వుంది.
ఇది ఒక వృత్తాకార నిర్మాణం రూపకల్పన. దీని చుట్టుకొలత వ్యాసం ఒక మైలు వుంటుంది. ఇది  171 మీటర్లు ఉంటుంది. దానికి ఆకట్టుకునే గోపురం రెండు అర్థచంద్రాకార గదులు ఓర సెంట్రల్ హాల్. భవనం 144 క్రీం కలర్ ఇసుకరాయి స్తంభాలు తో జాలరు గల మొదటి ఫ్లోర్ లో మొత్తం ఓపెన్ కారిడార్ ఉంది. ఎరుపు ఇసుకరాయితో బాహ్య గోడలు ప్రతిధ్వని  రేఖాగణిత నమూనాల్లో చెక్కారు. సెక్యూరిటీ, నిబంధనలతో  మాత్రమే బయట నుండి చూడచ్చు.  ఈ నిర్మాణ అద్భుతమైనది. ఇది చుట్టుకొలతలో ఒక కిలోమీటరు వుండి దాదాపు వృత్తాకార నిర్మాణం గుమ్మటం వలెవుంది. ఇది భారత పార్లమెంటు ఒక ప్రత్యెక స్థానంగా ఉంది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా చర్చల యొక్క గృహముగా వుంది.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)