ధనుర్మాసము లో తిరుప్పావై తో స్వామిని మేలుకోలుపుతారు. ఆనెల రోజులు కలియుగ దేవుడు వెంకటేశ్వరునికి సుప్రబాత సేవ చేయరు. తక్కిన రోజులలో స్వామివారికి సుప్రభాత సేవ చేస్తారు. ఈ సుప్రభాతం మొట్టమొదట ఎవరు రాసారు అని నాకు డౌట్ వచ్చింది అప్పుడు నాకు ఈ విషయాలు తెలిసాయి.
మనము తెల్లవారి లేవగానే అందరకు good morning చెపుతాము కదా అదే సుప్రభాతము.
"సు-ప్రభాతము" అనగా "మంచి ఉదయం" (Good Morning) అని అర్ధం. శ్రీ
వేంకటేశ్వర సుప్రభాతం కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము.
రామాయణం బాలకాండలో ఈ శ్లోకం యాగరక్షణా నిమిత్తమై తనవెంట వచ్చిన రామలక్ష్మణులు నిద్రపోతుండగా విశ్వామిత్రుడు ఇలా పాడి వారిని మేలుకోల్పుతారు.
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ 1
"కౌసల్యాదేవి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. నిదుర లెమ్ము." అని భావం వచ్చేట్టు పాడారు
విశ్వామిత్రులవారు. దీని తరవాత నే మిగిలిన శ్లోకాలు వస్తాయి .
హిందూ
పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను, భగవంతుని
పూజామూర్తికి అనేకమైన సేవలు నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలాంటి సేవలలోనిదే
సుప్రభాత సేవ. ఆ సుప్రభాత
సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం"
అని అంటారు. తిరుమల శయనమంటపంలోని భోగశ్రీనివాసుని ఈ సుప్రభాతం ద్వారా
మేల్కొలుపుతారు. ప్రఖ్యాతమైన
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం స్తోత్రాన్ని శ్రీ ప్రతివాద భయంకర అణ్ణాంగారాచార్య లేదా
అణ్ణన్ స్వామి రచించారు. ఇతడు క్రీ.శ.1361 నుండి 1454 వ సంవత్సరం మధ్యలో జీవించారు ఆమద్య కాలంలో అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు
కంచి పట్టణంలో జన్మించారు. ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో
ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు.
ఇతని గురువు మణవాళ మహాముని. సుప్రసిద్ధమైన
వేంకటేశ్వర సుప్రభాతము, రంగనాధ సుప్రభాతము కూడా అణ్ణన్ రచనలే.
వేదాంత దేశికుల కుమారుడైన నారాయణావరదాచార్యుడు అణ్ణన్కు మొదటి గురువు.
నారాయణ వరదాచార్యుల వద్ద వేదాలు, ఇతర
విద్యలు అభ్యసిస్తున్న సమయంలో ఆణ్ణన్ను వాదంలో ఎదుర్కోవడం
ప్రత్యర్ధులకు చాలా సంకటంగా ఉండేదట.
నృసింహ మిశ్రుడనే అద్వైత పండితుడిని వాదనలో ఓడించినపుడు మణవాళ మహాముని అణ్ణన్కు "ప్రతివాద భయంకర" అనే బిరుదు ఇచ్చాడట.
తరువాత అణ్ణన్ తిరుమలలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో అతను
మణవాళ మహాముని శిష్యుడయ్యాడు.
వెంకటేశ్వర సుప్రభాతం లోని శ్లోకాలు సంఖ్య ఇలావున్నాయి.
స్వామీ మేలుకొలుపు : 29 శ్లోకాలు వీటిని శ్రీ ప్రతివాద భయంకర అణ్ణన్ రచించినారు .
వెంకటేశ్వర స్తోత్రం ( భగవంతుని పై కీర్తనలు) : 11 శ్లోకాలు
వెంకటేశ్వర ప్రపత్తి ( భగవంతునికి శరణాగతి): 16 శ్లోకాలు
శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రపత్తి అనేది చాలా ముఖ్యమైన అంశం. గురువులకు, భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులవడం ప్రపత్తి యొక్క ముఖ్యలక్షణం.
వెంకటేశ్వర మంగళాశాసనము (పూజానంతరము జరిపే మంగళము) : 14 శ్లోకాలు
ఈ భాగాన్ని మణవాళ మహాముని రచించారు అని అంటారు.
జై శ్రీమన్నారాయణ్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.