అన్నమాచార్యులవారు రాసిన మరో అద్భుతమైన సంకీర్తన కొండవేలనెత్తినట్టి గోవిందా అన్న కీర్తన. ఈ సంకీర్తనలో శ్రీ కృష్ణుని అద్భుతంగా వర్ణించారు. కృష్ణుని అనేక రకాలుగా వర్ణించారో ఈ అన్నమయ్య. స్వామీ వారిమీద కీర్తనలు రచించిన అన్నమయ్య అదృష్టవంతుడో లేక ఆ స్వామే అదృష్టవంతుడో కదా. ఈ కీర్తనలు మనం ప్రతీ రోజు గుర్తుచేసుకుంటుంన్నందుకు మనం మాత్రం అదృష్టవంతులమే కదా.
కొండవేలనెత్తినట్టి
గోవిందా నిన్ను
గొండించేరు
యశోదకు గోవిందా
గొల్లెతలు
మొక్కేరు గోవిందా నీ-
కొల్లల
చీరలిమ్మని గోవిందా
గొల్లు
వెన్న దొంగిలగ గోవిందా నిన్ను
కొల్లున
నవ్వేరు వీరె గోవిందా
గోవుల
గాచేవేళ గోవిందా పిల్ల
గోవిని
వలచిరి గోవిందా
గోవాళులై
యమునలో గోవిందా నీకు
కోవరమున్నారురా
గోవిందా
కొట్టేటి
వుట్లకింద గోవిందా నీతో-
గొట్టెవాటై
పెనగేరు గోవిందా
గుట్టుతో
శ్రీవేంకటాద్రిగోవిందా
కూడి
గొట్టాన
బెట్టేరు బత్తి గోవిందా
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.