నంద యశోదల ముద్దు బిడ్డగా వెలసిన శ్రీకృష్ణుడు తన చిలిపి అల్లరి పనులతో విసిగిన గోపవనితలు యశోదమ్మకు కృష్ణునివల్ల వారికీ కలిగిన కష్టాన్ని విన్నవించుకొని వారు ఊరు విడిచివెళ్లిపోతామని మీ అబ్బాయిని అదుపులో పెట్టుకోమని చెప్పారు గోపవనితలు. వారు అలా చెప్పుతుంటే యశోద చాలా బాధ పడినది. అప్పుడు యశోద గోపవనితలతో ఇలా అన్నది. నేను కూడా మీవలెనే కంటిని ఈ బిడ్డని. పిల్లలు చేసే అల్లరిని ఆమె సమర్ధిస్తున్నది.
అది అన్నమాచార్యులవారు ఇలా అందంగా రచించారు. ఇలా అందంగా వర్ణించటము ఎవరి తరమూకాదేమో అన్నట్టు రాసారు అన్నమాచార్యులవారు.
కానరటె పెంచరటె కటకట బిడ్డలను | నేను
మీవలెనే కంటి నెయ్యమైన బిడ్డని
బాయిట బారవేసిన పాలు
వెన్నలును | చేయి వెట్టకుందురా చిన్నిబిడ్డలు
|
మీయిండ్లు
జతనాలు మీరుసేసికొనక | పాయక దూరేరేల ప్రతిలేని
బిడ్డను ||
మూసిన కాగులనే యీముంగిట
పెరుగులూ | ఆసపడకుందురా ఆబిడ్డలు |
వోసరించి
మోసపోక వుండలేక మీరు | సేసేరింతేని దూరు చెప్పరాని బిడ్డని
||
చొక్కమైన కొప్పెరల జున్నులు జిన్నులును | చిక్కిన విడుతురా చిన్నిబిడ్డలు |
మిక్కిలి
పూజలుసేసి మెచ్చ్చించదగదా | యెక్కువైన తిరువేంకటేశుడైన బిడ్డని ||
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.