సంక్రాంతి లక్ష్మికి స్వాగతం సుస్వాగతము |
బోగి తరువాత రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో చక్కర పొంగలి తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు,చక్కినాలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం.
రంగు రంగులు ముగ్గులతో, ముంగిట్లో గొబ్బెమ్మలు, హరినామ సంకీర్తనలు హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిడతలు కొడుతూ తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. డూడూ బసవయ్య విన్యాసాలతో గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు.,ఆకాశాన గాలిపటాలు, ఇవన్నీ సంక్రాతి మహాలక్ష్మికి, ఉత్తరాయణ పుణ్యపురుషునికి మనం స్వాగతినిస్తున్నాయి.ఈ సంక్రాంతికి మనమందరమూ స్వాగతం చెప్పుదాం. ఈ పండుగను సంతోషముగా జరుపుకుందాము.

ఈపండుగ తో ప్రారంబమయిన సుఖసంతోషాలు జీవితాంతము ఆనందంగా గడిపాలని. పాడిపంటలతో, సిరి సంపదలతో మనదేశము అభివృద్దిచెందుతూ సంక్రాంతి లక్ష్మి సంతోషంగా అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
సంక్రాంతి శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిthanks andi meeku koodaa samkramti subhaakaamkshalu.
రిప్లయితొలగించండి