Blogger Widgets

శనివారం, జనవరి 14, 2012

భారత సైనిక దినోత్సవం

శనివారం, జనవరి 14, 2012



భారత సైనిక దినోత్సవం. 1949లో ఇదేరోజున మొదటిసారి ఓ భారతీయుడు కె.ఎం.కరియప్ప  ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా జనవరి 15ను సైనికదినోత్సవంగా జరుపుకొంటున్నాం.   దేశవ్యాప్తంగా త్రివిధ దళాలు సైనిక దినోత్స వాన్ని జరుపుకోనున్నాయి.   భారత నావికాదళం, భారత వైమానిక దళం, దేశ రక్షణలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాయి.
అసలు ఎన్నోరకాలు పోరాటాలు విప్లవాలు చేసి హింసాయుత, మరియు అహింసా పోరాటాలు కూడా చేసి  ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు పోరాటం చేసి భారతదేశానికి బ్రిటిషవారి నుండి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెడితే.  ఆ స్వాతంత్ర భారతదేశాన్ని మన దేశ సైనికదళం సరిహద్దుల దగ్గర మన దేశాన్ని వారి ప్రాణాన్ని అడ్డుపెట్టి మరి కాపాడుతున్నది. 
మడమ తిప్పని యోధుడి చేతిలో మంటలు విరజిమ్మే ఆయుధం తో మంచి వజ్రమువంటి  మనస్సుతో ఎటువంటి వృద్దాప్యము దగ్గరకురాని సంకల్పబలంతో, వారి గుండె దైర్యముతో  పోరాటపటిమను చివరవరకు పోరాటం చేయగలిగే శక్తి.  ముప్పూటలా  మోహరిస్తే దానిపేరే భారత సైన్యం. నిప్పులు చెరిగే ఎడారులు లోను , నెత్తురును  గడ్డకట్టించే మంచు ప్రాంతాలలోను, కల్లోల సాగరాలు,  గగనతలాలు, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాంటి శత్రువునైనా ఎదిరించి ఓడించే దే మన దేశ సైనికదళం.భారతదేశ ప్రాదేశిక సమగ్రతనూ, సార్వభౌమాధికారాన్ని, కంటికి రెప్పలా కాపాడు తున్న సైనిక శక్తుల త్యాగాలు, విజయాలు. నిరుపమానాలు. వారిని ఎంత పొగిడినా చాలా తక్కువే అనిపిస్తోంది. జనవరి 15న ఆర్మీడే సందర్భంగా మన భారతదేశ త్రివిధ దళాలతో పాటు మనమందరం గొంతు కలుపుదాం. మన భారత జనానికి మోకరిల్లి ప్రణామం తెలుపుదాం.  మన భారతమాత మనలను చూసి గర్వపడేలా చేద్దాం. మన భారతదేశ ఉనికిని, మన సైనికదలాల పోరాటపటిమను ప్రపంచానికి చాటిచేప్పుదాం.  ఇంకెవ్వడు మనదేశము వంకచూడాలంటే భయపడేటట్టు చేద్దాం.
భారతదేశానికి స్వాతంత్య్రం లభించి పట్టుమని పదివారాలు కాకముందే 1947 అక్టోబర్‌ 27న విభజనకు గురైన పాకిస్తాన్‌ దళాలు మన దేశనికి మకుటమయిన కాశ్మీర్‌ను  కబళించడానికి దండెత్తి రాగా మన భారత దళాలు శతృవులను తరిమి తరిమికొట్టి స్వాతంత్య్ర దేశ చరిత్రలో తొలివిజయాన్ని నమోదు చేసుకొంది. ఇది స్వాతంత్ర భారతావనికి తొలివిజయం.  తరువాత  1962లో చైనా దురాక్రమణ దారులకు, 1965, 1971లో పాకిస్తాన్‌ మూకలను, 1999లో కార్గిల్‌ సైనిక చర్యలతో పాటు వివిధ ఆపరేషన్లలో శతృవులను వెనుతిరిగి చూడకుండా తరిమి వేసింది మన భారతసైన్యం. అలాగే ప్రపంచ యుద్ధాలలో సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా బంగ్లాడేశ్‌ అవతరణ సమయంలో దాదాపు 98 వేలమంది శతృ సైనికులు భారతదేశ సైన్యం ముందు మోకరిల్లినది.  ఇది మనం గర్వపడవలసిన విషయమే కదా.  
ఎందరో మహానుబావుల త్యాగాలకు మనకు స్వాతంత్ర భారతదేశం లబించింది. మన దేశసైనికులు సరిహద్దును ప్రాణాలను అడ్డుగా పెట్టి మనదేశాన్ని కాపాడుతుంటే మనం ఏమి చేస్తున్నాము? లోపల politics  చేస్తున్నాము.  లోపలలోపల తన్నుకుంటున్నాం. అవినీతి అన్నదానికి దారి తీసి దేశబద్రతకు, దేశఖజానాకు చిల్లులు పెడుతున్నాం.  ప్రజాస్వామ్యాన్ని దేబ్బతీస్తున్నాం.  దయచేసి అందరు దేశ భవిష్యత్తును కాపాడుకుందాం.  స్వాతంత్ర భారతదేశాన్ని కాపాడుకుందాం.  అలాంటప్పుడే మనదేశ సైనికులు చేసే ప్రయత్నంనాకు అర్ధం పరమార్ధం వుంటుంది.
మంచి ఆలోచన తో నూతన సాంకేతిక పరిజ్ఞానము తో వ్యక్తిగత జీవితాలు అడ్డుగా  పెడుతూ దేశాన్ని అన్నివిధాలా కాపాడుతూ మనకు ఆపద కలిగే సమయంలో వెనువెంటనే మేమున్నాము అని ఆదుకునే బారత సైన్యానికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగివుండాలి. సైనికులను గౌరవిస్తూ నేడు దేశవ్యాప్తం భారత సైనిక దినోత్సవం జరుపుకోవాలి . 
Heads  off to  the Indian  Army .
I  wish  you  happy  Indian  Army  Day .
జై హింద్

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)